అన్వేషించండి

Krishna mukunda Murari December 30th Episode:‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌ : ప్రభాకర్ నిర్దోషి అని నిరూపిస్తానన్న మురారి - డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కటైన అత్తాకోడళ్లు

Krishna mukunda Murari Serial Today Episode: ప్రభాకర్ నిర్దోషి అని ఇవాళ రాత్రి లోపు నిరూపిస్తాను లేదంటే ముకుందను పెళ్లి చేసుకుంటానని మురారి ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ జరిగింది.

Krishna mukunda Murari Telugu Serial Today Episode:  దేవ్, కిట్టమ్మ అని పిలవడంతో  అచ్చం మానాన్న పిలిచినట్టే ఉందని.. కానీ మధుకి ఎందుకు అలా అనిపించిందో అర్థం కావడం లేదని దేవ్‌  అన్నయ్యని చూస్తే అలా అనిపించడం లేదని మనసులో అనుకుంటుంది కృష్ణ. మురారి పిలిపించే ఆర్టిస్ట్ బాగా బొమ్మలు వేస్తాడు. పరిమళ చెప్పిన పోలీకలతో బొమ్మ ఖచ్చితంగా గీస్తాడు. అని నందిని అంటుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదని దేవ్ అంటాడు. వాడు ఎవడో తెలిస్తే నేనే వాడిని చంపేసి జైలుకి వెళ్తాను.. కృష్ణ వాళ్ళ చిన్నాన్నని బయటకి తీసుకొస్తానని దేవ్‌ చెప్పడంతో ...

కృష్ణ: అన్నయ్య మీకెందుకు శ్రమ ఏసీపీ సర్ వాడి ఎముకల్లో సున్నం కూడా లేకుండా కొట్టి లోపల వేస్తాడు.

నందిని: అవును మురారి అసలే తిక్కలో ఉన్నాడు. ప్రస్టేషన్‌ కోపం తిక్క అన్ని దొరికిన వాడి మీద చూపించి కుళ్లబొడుస్తాడు.

రేవతి: అవును అసలు వాడికంటే ముందు నేనే వాణ్ని చీపురుకట్ట తిరగేసి కొడతాను.

అంటూ నందిని, రేవతి వాణ్ని తిట్టేసరికి దేవ్ మొహం మాడిపోతుంది. తర్వాత రేవతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  మరోవైపు  ముకుంద, మురారి ఎదురుపడతారు. మురారీ పక్కకి వెళ్లబోతుంటే ముకుంద అడ్డంగా ఉంటుంది. అడ్డుతప్పుకోమని మురారి అంటే..

ముకుంద:  అడ్డు తప్పుకోవాల్సింది నేను కాదు కృష్ణ

మురారి:  కృష్ణ ఇలా అడ్డుగోలుగా నిలబడదు. ఇలా అడ్డు రాదు.

అనగానే ముకుంద, కృష్ణ చిన్నాన్న ప్రభాకర్‌ గురించి మాట్లాడుతుంటే వద్దని వారిస్తాడు.. ఆయన నిర్దోషని నిరూపిస్తానని చెప్తాడు మురారి.  చట్టం చేతుల్లోకి తీసుకుని అతన్ని నిర్దోషిని చేయాలని చూస్తున్నావా? అంటూ ముకుంద ప్రశ్నిస్తుంది. దీంతో ముకుందను  మురారి తిడతాడు.

ముకుంద: అసలు నీకు మాట నిలకడ లేదు. నన్ను ప్రేమించాను అన్నావ్ కృష్ణ కనిపించగానే ఫ్యామిలీ గౌరవం అని కట్టుకథ చెప్పి తనని పెళ్లి చేసుకుని వచ్చావ్. నన్ను వెర్రిదాన్ని చేస్తున్నావ్.

మురారి: అవును వెర్రిదానివే పెళ్ళైన వాడి వెనుక పడుతున్నావ్  అంటే నువ్వు నిజంగా వెర్రిదానివే.. తండ్రి చనిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆదర్శ్ ని పెళ్లి చేసుకోమని చెప్పాను. నువ్వు రాజీ పడతావ్ అనుకున్నా.

ముకుంద: నేను రాజీ పడను మురారి

మురారి: మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్. అప్పుడే ఎదురు తిరగొచ్చు కదా. నీ వల్ల ఒకడి జీవితం ఎటూ కాకుండా పోయింది. నీ వల్ల ఎంతో ఇష్టంగా పెంచుకున్న కొడుకు దూరం అయ్యాడు. నేను ఈ కేసులో గెలవకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను గెలిస్తే  నువ్వు ఆదర్శ్ ని భర్తగా అంగీకరించాలి గుర్తు పెట్టుకో

అని కరాకండిగా చెప్పి వెళ్ళిపోతాడు మురారి. ఆ మాటకి ముకుంద షాక్ అవుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వస్తారు. కృష్ణ వచ్చి పెద్దత్తయ్య రాలేదా అని అడుగుతుంది. కొంతమంది ఉంటే పెద్దత్తయ్య రారని తెలియదా అంటూ  ముకుంద  వెటకారంగా మాట్లాడుతుంది. అవుతున్న గొడవలు చాలు ఇక సైలెంట్ గా ఉండమని నందిని అంటుంది. మురారి వచ్చి కృష్ణని నొప్పి తగ్గిందా అని అడుగుతాడు. దేవ్‌ మాత్రం ఇంట్లో భవాని మాట ఎవరూ జవదాటరని ముకుంద అంటుంది ఇక్కడ చూస్తే అలా కనిపించడం లేదని మనసులో అనుకుంటాడు. మురారి వెళ్లి భవానీని భోజనానికి పిలుస్తాడు. కానీ ఆకలిగా లేదని చెప్తుంది. నాకు యాక్సిడెంట్ జరగకముందు ఎలా ఉండేవాళ్ళమని ఇప్పుడెలా ఉన్నామని మురారి అడుగుతాడు.

భవాని: అలాంటి రోజులు రావు కదా ఆలోచించి ఏమి ప్రయోజనం ఉండదు. నీకు గతం గుర్తు లేకపోవడానికి ప్రభాకర్ కారణం అని తెలిసి కోపంతో అతన్ని జైలుకి పంపించాను. కానీ నువ్వు అప్పుడు కూడ కృష్ణ వెనుక తిరుగుతుంటే నీకు గతం గుర్తుకు రాకపోతే బాగుండని అనుకున్నా. వాళ్ళతో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు నచ్చడం లేదు.

మురారి:  నచ్చడం నచ్చకపోవడం మీ ఇష్టం దాంట్లో తప్పు పట్టే హక్కు నాకు లేదు. కానీ విచారణ చేయకుండా ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు.

భవాని: అంటే నేను అనేది నిజం కాదని అంటున్నావా మురారి. నేను అలా అనుకుంటే కృష్ణతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాను.

అని భవాని అనగానే నాకు నచ్చకపోయిన నీకోసం  ముకుందతో పెళ్ళికి ఒప్పుకున్న వాడిని నాకోసం భోజనానికి రాలేవా పెద్దమ్మా ప్లీజ్ అని భవాని కాళ్ళ మీద పడతాడు మురారి.  కొడుకు మాటలకి కరిగిపోయిన భవాని భోజనానికి వస్తుంది. అయితే భవానికి అటు పక్క కృష్ణ, ఇటుపక్క మురారి కూర్చునేలా అందరి ప్లేసులు మార్చమని మురారి, కృష్ణకు మెసేజ్‌ చేస్తాడు. కృష్ణ అలాగే చేస్తుంది. ఇది గమనించిన ముకుంద భవానికి అసలు విషయం చెప్తుంది. దీంతో భవాని మురారిపై కోపంగా కేకలేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget