అన్వేషించండి

Alia bhatt: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..

Alia bhatt: నటుడు రామ్ చరణ్ పై బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రశంసల జల్లు కురిపించింది. ‘RRR’ షూటింగ్ టైమ్ లో ఆయన తన పట్ల ఎంతో కేరింగ్ గా ఉండేవారని వెల్లడించింది.

Alia bhatt About Ram Charan: ‘RRR’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. తన అద్భుత నటనతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఆలియా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రోజులను తలచుకుంటూ.. రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. మూవీ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్ సమయంలోనూ ఆయన చాలా కేరింగ్ చూసుకునే వాడని చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్ పై ఆలియా ప్రశంసలు

ఆలియా భట్ తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కు స్పెషల్ గా మాట్లాడింది. ఈ సందర్భంగా ‘RRR’ సినిమా గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది. పనిలో పనిగా తన సహ నటుడు రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తనను చాలా జాగ్రత్తగా చూసుకునే వాడని తెలిపింది. ప్రమోషన్ టైమ్ లోనూ చాలా కేరింగ్ గా ఉన్నారని వెల్లడించింది. “ఎక్కడున్నాను? ఎలా ఉన్నారు? కంఫర్ట్ గా ఉన్నానా? లేదా? అని తరచుగా తెలుసుకునే వారు. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్తున్నాను. నటుడిగానే కాకుండా, వ్యక్తిగానూ చెర్రీ చాలా గొప్పవారు” అని చెప్పుకొచ్చింది.

చెర్రీ అబ్జర్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది- ఆలియా

ఇక సినిమా షూటింగ్ టైమ్ లోనూ రామ్ చరణ్ అబ్జర్వేషన్ డిఫరెంట్ గా ఉంటుందని ఆలియా వెల్లడించింది. “ఒక సీన్ చేయడానికి ముందు ఆయన చాలా విషయాలను గమనిస్తారు. ఎదుటి వారు నటించేటప్పుడు సైలెంట్ గా గమనిస్తారు. ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా ఎంతగా అవసరమో అంత మేరకే ఆయన నటన కనబరుస్తారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా తన పని మాత్రమే తాను చేసుకుంటూ వెళ్తారు. తనకు సంబంధించిన సీన్లు చాలా డిగ్నిటీగా పూర్తి చేస్తారు. అదే సమయంలో అందరితో చాలా కలగలుపుగా ఉంటారు. చాలా ఫన్ చేస్తారు” అని ఆమె వెల్లడించింది.  

ఆలియా భట్ సినిమాల గురించి..

ఆలియా భట్ రీసెంట్ గా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో కనిపించింది. ఇందులో రణవీర్ సింగ్‌ హీరోగా నటించారు. స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆలియా ప్రధాన పాత్రలో ‘జిగ్రా’ సినిమాలో నటిస్తోంది. వాసన్ బాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్, ఆలియా భట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.

‘గేమ్ ఛేంజర్’ మూవీతో చెర్రీ బిజీ

అటు రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌జె సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్ థమన్ అందిస్తున్నారు.  

Read Also: దిల్ రాజు బ్యానర్‌లో ‘బేబీ‘ బ్యూటీకి ఛాన్స్, ఆశిష్ తో వైష్ణవి చైతన్య రొమాన్స్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
What is Cyclone: తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
Cyclone Montha: తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
Aaryan Movie: 'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
Advertisement

వీడియోలు

Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Pratika Rawal Ruled Out | ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌
Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
What is Cyclone: తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
Cyclone Montha: తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
Aaryan Movie: 'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
Cheapest Bikes: TVS నుంచి Hero వరకు - కేవలం ₹60 వేలలో దొరుకుతున్న అత్యంత చవకైన 5 బైక్స్‌
తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరలో దొరుకుతున్న టాప్‌-5 బైక్స్‌
Telangana Guarantees: కాలం చెల్లిపోతున్న కాంగ్రెస్ గ్యారంటీలు - ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?
కాలం చెల్లిపోతున్న కాంగ్రెస్ గ్యారంటీలు - ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?
Bheems Ceciroleo : ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా... కానీ ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎమోషనల్
ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా... కానీ ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఎమోషనల్
Cyclone Montha Impact In AP: మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మొంథా తుపాను బీభత్సం.. రైల్వే ట్రాక్స్ ధ్వంసం, పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
Embed widget