Krishna Mukunda Murari Serial Today December 28th Episode పరిమళ చూడకుండా తప్పించుకున్న దేవ్.. మురారి మాస్టర్ ప్లాన్!
Krishna Mukunda Murari Today Episode డాక్టర్ పరిమళ మురారి ఇంటి వస్తుంది అని ముకుంద దేవ్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Serial Today Episode: మురారి కృష్ణని ఎత్తుకొని ఇంటికి వస్తాడు. భవాని కోపంగా చూస్తుంది. ఇక కృష్ణ అయితే తన పెద్దత్తయ్య ఏం అనుకుంటుందో అని బాధపడుతుంది. ఇక నందూ స్ప్రే తీసుకొస్తే మురారి కృష్ణ కాళ్లకు స్ప్రే చేసి కాలు పట్టుకుంటాడు. దీంతో భవాని కోపంతో ఊగిపోతుంది. కోపంతో వచ్చి కృష్ణ ఎదురుగానే కూర్చొంటుంది. మరోవైపు ముకుంద కూడా భవానిని రెచ్చగొడుతుంది.
మురారి: పరిమళ దగ్గరకు వెళ్తా అనుకున్నాను కానీ ఇంతలో ఇలా జరిగింది.
కృష్ణ: సరే.. ఏసీపీ సార్ నేను వెళ్తాను..
మురారి: ఈ పరిస్థితుల్లోనా.. ఏం అవసరం లేదు. పరిమళను ఇక్కడికే రమ్మంటాను నీకు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు ఉంటుంది నా పని అయినట్లు ఉంటుంది.
మురారి పరిమళకు కాల్ చేసి కృష్ణకి కాల్ బెనికిందని.. తననే ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఇక పరిమళ ఆర్టిస్ట్‌ని రమ్మని పిలిచావ్ కదా ఎలా అని అడుగుతుంది. అయితే మురారి ఆ ఆర్టిస్ట్‌ని కూడా ఇంటికే రమ్మన్నాను అని చెప్తాడు. ఇక మరోవైపు పరిమళ ఉన్న మెడికల్ షాపు దగ్గరకు దేవ్ కూడా వస్తాడు. దేవ్ పరిమళని చూసి తనని గుర్తిస్తాడు. టాబ్లెట్స్ వద్దని దేవ్ పారిపోతాడు. పరిమళ అతన్ని క్లారిటీగా చూడదు. ఎవరో అనుకుంటుంది.
మురారి: పరిమళ వస్తాను అంది. మెడికల్ షాపు దగ్గరే ఉంది అంట కావాల్సిన మెడిసిన్ తీసుకొస్తా అంది.
ముకుంద: మనసులో.. దేవ్‌కి ఫోన్ చేసి వెంటనే రావొద్దు అని చెప్పాలి.
కృష్ణ: మనసులో.. ఏంటి ముకుంద ఎందుకో టెన్షన్ పడుతుంది. మొన్న ఎవరూ చూడకూడదు అన్నట్లు చాటుగా లోపలికి వెళ్లింది. ఈ కేసు విషయంలో ముకుంద ఎందుకు కంగారు పడుతుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈవిషయం అర్జెంటుగా ఏసీపీ సార్‌కి చెప్పాలి.
ముకుంద: దేవ్ ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడంతో.. వీడేంటి ఇప్పుడు ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు పరిమళ వచ్చేస్తే.. ఆ విషయం దేవ్‌కి తెలీకుండా లోపలికి వచ్చేస్తే..
భవాని: ఏంటి మురారి నన్ను ఎందుకు ఆగమన్నావ్.. ముకుంద ఎందుకు టెన్షన్ పడుతున్నావు. కృష్ణకు అలా సేవలు చేయడం నీకు నచ్చడం లేదు కదా.. మురారి కేవలం నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నాడు ముకుంద. నేను ఇందాక కోపడ్డాను కదా.. ఇలాంటి విషయంలో మనం కొంచెం సహనం వహిస్తే రేపు నిజం తెలిశాక సేవ చేసినందుకు మనల్ని చూడటానికి కూడా సిగ్గుపడతారు. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం.
ముకుంద: మనసులో.. నాకు అన్ని నిజాలు తెలుసు అనే విషయం అత్తయ్యకు తెలిస్తే నా గతి ఏం అవుతుందో.
మరోవైపు దేవ్ మురారి ఇంటికి వస్తాడు. డాక్టర్ పరిమళని చంపేస్తే బెటర్ అనుకుంటాడు. అయితే తక్కువ టైంలో అంత రిస్క్ తీసుకోకూడదు అని మళ్లీ అనుకుంటాడు. ఇక దేవ్ టెన్షన్ పడటాన్ని మధు చూస్తాడు. ఏంటి బ్రదర్ టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు. దీంతో దేవ్ కవర్ చేస్తాడు. అయినా మధు దేవ్‌ని నమ్మాలి అనిపించడం లేదు అనుకుంటాడు. ఇక అప్పుడే ముకుంద కూడా వస్తుంది.
దేవ్: వీడేంటి ముకుంద నా మీద డౌట్ పడుతున్నాను.
ముకుంద: కృష్ణ, మురారిలు అంటే వాడికి పిచ్చి. అయినా నువ్వు ఎందుకు ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశావు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది.
దేవ్: నాకు టెన్షన్‌గానే ఉంది. ఇందాక మెడికల్ షాపు దగ్గర డాక్టర్‌ని చూశాను. నన్ను గుర్తుపట్టే ఒకే ఒక్క వ్యక్తి ఆమె. నన్ను చూడకుండా తప్పించుకొని వచ్చాను.
ముకుంద: దేవ్ ఇంట్లోకి వెళ్లాలని చూడటంతో.. దేవ్ ఆగు.. నువ్వు ఎవరి దగ్గర నుంచి తప్పించుకొని వచ్చావో ఆవిడే డాక్టర్ పరిమళ. ఆవిడే మురారికి ఫ్రెండ్. ఇప్పుడు ఇంటికి వస్తుంది. మురారి కేసు ఇన్విస్టిగేషన్‌లో భాగంగా పరిమళ శేఖర్‌ని గుర్తుపడతాను అంది కదా.. మురారి డిపార్ట్‌మెంట్ నుంచి పోలీసులకు చెప్పి బొమ్మలు గీసే ఆర్టిస్‌ని తీసుకొస్తున్నాడు. పరిమళ పోలికలు చెప్తుంది వాడు గీస్తాడు. నువ్వు నేను అడ్డంగా దొరికిపోతాం దేవ్.
దేవ్: ఏంటి ముకుందా ఇది ఏదో నాలుగైదు రోజులు మ్యానేజ్ చేస్తే పెళ్లి అయిపోతుంది అనుకుంటే ఏంటి ఈ తలనొప్పి. సరే నేను బ్యాక్ డోర్ నుంచి నీ రూమ్‌కి వస్తాను. భయపడకు ముకుంద ఏం జరగదు.
మధు ఒంటరిగా కూర్చొని దేవ్ ముకుందల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి కృష్ణ వస్తుంది.
మధు: కృష్ణ నీకు ఒక విషయం చెప్పనా నాకు ఎందుకో దేవ్‌ని చూస్తే నమ్మాలి అనిపించడం లేదు.
కృష్ణ: ఇందులో నమ్మడానికి నమ్మకపోవడానికి ఏం ఉంది. దేవ్ జస్ట్ ముకుంద అన్నయ్య. మనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇందులో ఏం నమ్మాలి అనిపించడం లేదు.
మధు: ముకుంద అన్నయ్య దేవ్ అనడంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కృష్ణ. నాకు ఎందుకో అతని ఓవర్ యాక్షన్ చూస్తే మనకు సపోర్ట్‌గా ఉన్నాడా అనిపిస్తుంది.
కృష్ణ: మనకు ఎందుకు సపోర్ట్‌గా ఉండాలి. అలా చేస్తే తనకి ఏం వస్తుంది ముకుంద నుంచి చీవాట్లు తప్ప.
మధు: కానీ నాకు ఎందుకో అతని క్యారెక్టర్ అసహ్యంగా ఉంది.
కృష్ణ: ఆయన అంతేలే మధు. ముకుంద మరి మామూలుగా బిహేవ్ చేస్తుందా.. వాళ్ల ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం అంతే.
మధు: నిజమే కానీ ఈ దేవ్ ఎందుకో నాకు కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఇక మురారి అక్కడికి వస్తాడు. కృష్ణని తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.