![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Krishna Mukunda Murari Serial Today December 20th Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: ముకుంద మీద కృష్ణకు డౌట్, కన్న తండ్రినే కిడ్నాప్ చేయించిన దేవ్!
Krishna Mukunda Murari Serial Today Episode జైలు నుంచి దేవ్ బెయిల్ మీద విడుదలై శ్రీనివాస్ దగ్గరకు వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Krishna Mukunda Murari Serial Today December 20th Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: ముకుంద మీద కృష్ణకు డౌట్, కన్న తండ్రినే కిడ్నాప్ చేయించిన దేవ్! krishna mukunda murari serial today december 20th episode written update Krishna Mukunda Murari Serial Today December 20th Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: ముకుంద మీద కృష్ణకు డౌట్, కన్న తండ్రినే కిడ్నాప్ చేయించిన దేవ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/08276ba08fde6e1e498d847b144d9eb01703038267533882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Serial Today Episode
కృష్ణ: సార్.. ఏసీపీ సార్‌కి మరో పెళ్లి చేయడానికి మా పెద్దత్తయ్య రెడీ అయిపోయింది. ఏదో ఒక రకంగా స్ట్రాంగ్ రీజనే ఉంది. కానీ మాకు అది ఇష్టం లేదు.
కమిషనర్: అయితే మీరు ఒకటి చేయండి మురారి. మీరు డ్యూటీలో జాయిన్ అవ్వకపోయినా మీరు కేసు డీల్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ అయితే ఇవ్వగలను.
మురారి: థ్యాంక్యూ సార్.. నన్ను హాస్పిటల్‌లో చేర్పించిన అతని పేరు శేఖర్.. అతనే నా సర్జరీకి అయిన ఖర్చు అంతా భరించాడు అంట. అతన్ని మనం పట్టుకోగలిగితే లైఫ్ చాలా బాగుంటుంది సార్.
ముకుంద: అత్తయ్య నాకు ఎందుకో మనసంతా టెన్షన్‌గా ఉంది అత్తయ్య. ఒక వేళ మురారి కేసును ఛేదిస్తే నా పరిస్థితి ఏంటి అత్తయ్య.
భవాని: అలా ఆలోచించకు ముకుంద అంతా పాజిటివ్‌గా ఆలోచించు, వెళ్లు.
మధు: ముకుంద ఇలా మాట్లడుతున్నా అని ఏం అనుకోకు. నువ్వు ఇలా ఎందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది.
ముకుంద: నాకేం టెన్షన్ లేదు. అయినా నేను ఎందుకు టెన్షన్ పడటం.
మధు: పడాలి టెన్షన్ పడాలి. ఎందుకు అంటే కృష్ణ వాళ్ల చిన్నాన్న ఈ పని చేశాడు అని నీకు నమ్మబుద్ధి కావడం లేదు. కానీ పెద్ద పెద్దమ్మ ఉంది కదాఅని మొండిగా ఉంటున్నావు. మొన్న పరిస్థితి వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు మురారికి గతం గుర్తొచ్చింది నువ్వేం పని చేసినా నువ్వు బాక్ అవ్వడం తప్ప పెళ్లి చేసుకోడు. సో వాస్తవం ఆలోచించు డ్రాప్ అయిపో.. నీ గౌరవం పెరుగుతుంది. ఆలోచించు. ఇంతలో కృష్ణ మురారిలు వస్తారు.
భవాని: మనసులో.. ఏంటి కేసు తేలుస్తామని వెళ్లి గోడకు కొట్టిన బంతుల్లా మళ్లీ వచ్చేశారు.
మురారి: పెద్దమ్మ ఓ గుడ్ న్యూస్. పెద్దమ్మ నేను పరిమళ డాక్టర్ దగ్గరకు వెళ్లాను.
ముకుంద: మనసులో..ఇప్పుడు ఇదంతా అన్నయ్యే చేశాడు అంటే నా పరిస్థితి ఏంటి.
మురారి: నాకు సర్జరీ చేయించిన అతని పేరు చెప్పారు. తన డిటైల్స్ చెప్పారు.
ముకుంద: అయ్యో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా చేస్తున్నావు. దేవుడా ఒక్క నిమిషం ఆనందం పడేలోపు మళ్లీ బాధ పెడుతున్నావా.
భవాని: ఇంతకీ ఎవరు అతను అతని పేరు ఏంటి.
మురారి: శేఖర్.
ముకుంద: అంటే దేవ్ పేరు మార్చాడా.. ఓకే వీళ్లు అది తెలుసుకునేలోపు పెళ్లి అయిపోతుంది.
మధు: ఇంతకీ ఈ శేఖర్ ఎవరు మురారి.
మురారి: ఈ శేఖర్ అని ఎవరైనా మన ఫ్యామిలీలో ఉన్నారా..
ముకుంద: (ఈ టాపిక్ ఎలా అయినా డైవర్ట్ చేయాలి.. ) ఏముంది అత్తయ్య ఎవరికీ తెలీకుండా గుప్త దానాలు చేస్తుంటారు కదా.. మొన్నటికి మొన్న మన ఆఫీసర్ ఒకరికి ఎవరికీ చెప్పకుండా తన ఇంట్లో తెలీకుండా డబ్బులు ఇవ్వలేదా.. ఇది అలాంటిదే అయిఉండొచ్చు కదా..
మురారి: ముకుంద చెప్పింది కూడా ఆలోచించాలి కదా పెద్దమ్మ మీరు ఏమంటారు.
భవాని: ఏమో నాన్న నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నా.
కృష్ణ: ముకుంద చెప్పిందే నిజం అయితే మరి ఫేక్ బాడీని ఇంటికి ఎందుకు పంపిస్తారు. అలా బాడీని ఇంటికి పంపడం గుప్త దానం చేసి రుణం తీర్చుకోవడం అనరు కదా.. పగ తీర్చుకోవడం అంటారు. ఏదో స్వార్థంతోనో కుట్రతోనో చేశారు అనిపిస్తుంది. (నేను అన్న మాటలకు ముకుంద టెన్షన్ పడుతుంది.. మార్నింగ్ వెళ్లినప్పుడు కూడా ముకుందది సేమ్ రియాక్షన్ కొంప తీసి ముకుందకు ఏమైనా హస్తం ఉందా)
ముకుంద: ఈ కృష్ణ ఏంటి నన్ను గమనిస్తుంది. ఈ కృష్ణతో చాలా కష్టం. అయినా ఇలా నేను టెన్షన్‌గా ఉంటే నా అంతట నేనే దొరికిపోయేలా ఉన్నాను.
రేవతి: ఏది ఏమైతేనేం చేసింది కృష్ణ చిన్నాన్న కాదు అని తేలిపోయింది. ఇక ఈ కండీషన్లు అన్నీ తొలగిపోయినట్లేనా అక్క.
భవాని: ఆ శేఖర్ అనే వాడు పెద్దపల్లి ప్రభాకర్ మనిషి అయిండొచ్చు కదా. అక్షరం ముక్క రాని ఆ ప్రభాకర్‌కి సర్జరీ గురించి ఏం తెలుసు. దారిన పోయిన వారితో చేయించొచ్చు కదా. అయినా నవ్వు ఏం చేసినా వచ్చే శుక్రవారం లోపు చేయాలి.
కృష్ణ: పెద్దత్తయ్య ఎటుతిరిగి చిన్నాన్న మీదే అనుమానం పెట్టుకుంది. వాడిని తీసుకొచ్చాకే నమ్ముతుంది.
ఇక కృష్ణ తన ఇంటిదగ్గర ముకుంద, మురారి, భవానీల మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక భవాని ఆ శేఖర్ వెనక తన చిన్నాన్నే ఉండొచ్చు అన్న మాటలకు తనకు అత్తయ్య మీద కోపం వచ్చింది అని కృష్ణ అనుకుంటుంది. ఇంతలో రేవతి అక్కడికి వస్తుంది. ఇక ఇద్దరూ భవాని మాటల్ని తలచుకొని బాధ పడతారు. ఇంతలో మురారి కూడా అక్కడికి వస్తాడు.
కృష్ణ: నేను శ్రీనివాస్ బాబాయ్ గురించి ఆలోచిస్తున్నాను. అవును బాబాయ్ కన్న కూతురు ముకుంద అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ తండ్రి అయినా నా బిడ్డ జీవితానికి అడ్డం నిలుస్తుంది అని నా మీద కోపం పెంచుకుంటారు. కానీ బాబాయ్ ధర్మంగా ఆలోచించి నా వైపు ఉన్నారు. అది ఆయన మంచి తనం. ఆ మంచి తనానికి విలువ ఇచ్చే ఇలా అంటున్నా.. నాకు ముకుంద కన్నా బాబాయ్ సంతోషమే ముఖ్యం. అందుకే ముకుందకు ఒక దారి చూపే వరకు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను.
రేవతి: చూస్తే తింగరిలా ఉంటావు కానీ నువ్వు ఇంతలా ఆలోచిస్తావు అనుకోలేదు. నిజానికి నీ శత్రువు ముకుంద.
కృష్ణ: సారీ అత్తయ్య ముకుంద నా శత్రువు కాదు. ముకుందది అమాయకత్వం అంతే.
మురారి: ఇవన్నీ సరే ముందు ఆ శేఖర్ ఎవరో తెలుసుకోవాలి.
మరోవైపు దేవ్ జైలు నుంచి బెయిల్ మీద వస్తాడు. దేవ్ శ్రీనివాస్ ఇంటికి వెళ్తాడు. అతన్ని చూసిన శ్రీనివాస్ షాక్ అయిపోతాడు.
దేవ్: నాకు బెయిల్ వచ్చింది శ్రీనివాస్
శ్రీనివాస్: మురారికి గతం గుర్తొచ్చింది. షాక అయ్యావా. ఇక నీ ఆటలు సాగవు కదా.. ఆ మురారినే నీ ఆటలు కట్టిస్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను ఉండు.
దేవ్: నాన్న వద్దు ఆగు ప్లీజ్. నేను భోజనం చేసే వరకు కాల్ చేయకు నాన్న ప్లీజ్. ఇక అప్పుడే ఇద్దరు కుర్రాళ్లు వస్తారు. వారితో చెప్పి శ్రీనివాస్‌ను బంధించి తమ ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లో అది కామన్, హీరోను ఇరిటేట్ చేశా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శృతి హాసన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)