అన్వేషించండి

Krishna Mukunda Murari December 12th Episode : ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: కృష్ణకు ఇష్టమైన ఆహారం తీసుకొచ్చిన మురారి - భవానిని బుట్టలో వేసుకున్న ముకుంద

Krishna Mukunda Murari Today Episode: కృష్ణకు ఇష్టమైన ఆవకాయ్, యాపిల్ ముక్కలు మురారి తీసుకొని రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Serial Today Episode : భవాని గార్డెన్‌లో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్తుంది. దీంతో భవాని తాను విష్ చేసి రాత్రి పూజ ఎలా జరిగింది అని అడుగుతుంది. అయ్యిందనే అనిపించింది అత్తయ్య అని ముకుంద అంటుంది.

భవాని: ఏంటి తన తిరుగుతోందా.. పూజ అంటే భక్తి భావంతో చేయాలి. ఇలా విరక్తిగా మాట్లాడుతావేంటి
ముకుంద: సారీ అత్తయ్య కానీ మీరు ఏమైనా అనుకోండి కానీ మీరు అన్నట్లు జీవితం మీద విరక్తే కలుగుతుంది. మళ్లీ మళ్లీ మనం ఏదైతే జరకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది అత్తయ్య. మురారి విషయంలో ఇవాళ దీపం పెట్టి తులసి, ఉసిరికి పూజ చేశాం కదా.. అంటూ కృష్ణ, మురారి కలిసి పూజ చేసినట్లు భవానితో చెప్తుంది. మురారి దృష్టి మొత్తం అటువైపే కానీ.. నా మీద, పూజ మీద అస్సలు లేదు అత్తయ్య. ఇప్పుడు చెప్పండి వచ్చే శుక్రవారం పెళ్లి పెట్టుకొని కాబోయే వాడు పక్క చూపు చూస్తే నాకు విరక్తి కాక ఇంకేం వస్తుంది అత్తయ్య ఒకసారి ఆలోచించండి
భవాని: అసలు తప్పు మురారిది కాదు. నాది నాదే తప్పు. అసలు ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అవుట్ హౌస్‌లో ఉంచడం నాది తప్పు. మురారికి అందుబాటులో ఉంచితే మంచిదని వాళ్లని ఇక్కడ ఉండనిచ్చాను కానీ. కృష్ణ ఇలా చీప్‌గా ప్రవర్తిస్తుంది అని అసలు అనుకోలేదు. అసలు కృష్ణ ఇక్కడ ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా. మనకు నష్టం తప్పితే
ముకుంద: ప్రయోజనం ఉంది అత్తయ్య. సారీ అత్తయ్య మీ మాటకు అడ్డొచ్చాను. కృష్ణ చీప్‌గా ప్రవర్తించొచ్చు కానీ కృష్ణకు మీరంటే అపారమైన గౌరవం మర్యాదు, ఆ గౌరవంతోనే మురారి అన్నిసార్లు అడిగినా.. అన్నిసార్లు కలిసినా గానీ.. నీ భార్య నేను అని మురారితో చెప్పలేదు. ఎందుకు రాత్రికి రాత్రే మీరు రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు.. మేమంతా భోజనం చేస్తున్నప్పుడు చిన్నత్తయ్య గారిని మురారి వేణిగారి భర్త ఎవరూ అని అడిగితే చిన్నత్తయ్య సైలెంట్‌గా ఉంది. దీంతో మురారి విసురుగా వేణి గారిని అడుగుతా అని వెళ్లాడు. తను ఏం చెప్పిందో కానీ తనే భార్య అని మాత్రం చెప్పలేదు. చెప్తే ఇప్పుడు ఇళ్లు ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. శత్రువులో కూడా మంచి ఉంటే మాట్లాడుకోవడంలో తప్పులేదు అనిపించింది అందుకే చెప్పాను అత్తయ్య.. 
భవాని: ముకుంద నువ్వు నాకు చాలా బాగా నచ్చావు వెరీగుడ్. ఆడదానివే అయినా సాటి స్త్రీ మీద పనికిమాలిన మాటలు మాట్లాడకుండా ఇలా వాళ్లలో ఉండే మంచి క్వాలిటీలు చెప్పావు చూడు నిజంగా నువ్వు వండర్ ఇలాంటి మంచి లక్షణాలే మురారి భార్యకు కావాల్సింది. కానీ ఆ వసపిట్టలా వాగే వాళ్లు కాదు. నువ్వు ఏం భయపడకు మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. 
ముకుంద: చాలా థ్యాంక్స్ అత్తయ్య

మరోవైపు కృష్ణ తన పిన్నితో మాట్లాడుతుంటుంది. త్వరలోనే మురారికి గతం గుర్తొచ్చేస్తుంది అని చెప్తుంది. దీంతో శకుంతల ఈ పెళ్లిలోపు గతం గుర్తొస్తే బాగున్ను అని అంటుంది. ఆ మాటతో కృష్ణ ఆలోచనల్లో పడిపోతుంది. ఏమైంది అని తన పిన్ని అడిగితే..తేరుకొని.. 

కృష్ణ: రేపు పెళ్లి అయిన తర్వాత ఏసీపీ సార్‌కి గతం గుర్తొస్తే ముకుంద జీవితం ఏంటి.. తనతో ఉంటే ఏసీపీ సార్ క్షణం కూడా ఉండరు అని నేను ఆలోచిస్తున్నాను
శకుంతల: ఇదే ఈ ముచ్చటే నాకు ఒళ్లు మండేది. ఆ పిల్ల నీ జీవితం నాశనం చేస్తుంటే నువ్వేంటి దాని జీవితం గురించి ఆలోచిస్తున్నావు
కృష్ణ: ఆడపిల్ల కదా చిన్నమ్మ
శకుంతల: ఆడపిల్ల అయితే ఆడపిల్ల తీరు ఉండాలి. ఇలాంటి పనులు చేసి నా కూతురు జీవితం నాశనం చేయకూడదు
కృష్ణ: పాపం ఏసీపీ సార్ నేను చెప్పిన హోం వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటుంది. ఇంతలో మురారి రావడం చూసి.. సార్ మీకు నూరేళ్లు సార్ ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను రండి సార్ లోపలికి 
మురారి: ఏమనుకుంటున్నారు నా గురించి ఈ పిచ్చోడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా.. 
కృష్ణ: సార్ అలాంటి మాటలు మాట్లాడొద్దు అన్నానా.. ఈ సారి అలా అంటే మీతో అసలు మాట్లాడను. 
మురారి: సారీ సారీ ఇంకెప్పుడు మాట్లాడను. 
కృష్ణ: ఏంటి సార్ ఏదో తెచ్చారు ఏంటి.. చేతితో క్యారేజ్ చూస్తూ.. 
మురారి: మీరు ఇచ్చిన హోంవర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎందుకో మీరు ఉపవాసం ఉంటాను అన్నారు కదా అది గుర్తొచ్చింది. అందుకే మీ కోసం ఇది తీసుకొచ్చా. ఏదో ఒకరకమైన స్పెషల్ అనుకోండి. యాపిల్ ముక్కలు, ఆవకాయ్ అని మురారి చెప్పడంతో కృష్ణ చాలా సంతోషంగా ఫీలవుతుంది. 
కృష్ణ: ఏసీపీ సార్‌కి గతం తాలూకు చాయలు గుర్తొస్తున్నాయి. అదేంటి సార్ యాపిల్‌తో ఆవకాయ్ ఏంటి అలా ఎవరూ తినరు కదా.. మీరు ఎందుకు తెచ్చారు. ఎవరైనా చెప్పారు
మురారి: లేదు ఎవరూ చెప్పలేదు. ముందు యాపిల్ తీసుకున్నాను.. ఆ తర్వాత ఎందుకో ఆవకాయ్ తీసుకోవాలి అనిపించింది. అని వాటిని తీసి చూపిస్తారు. దీంతో కృష్ణ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని కిచెన్‌లోకి వెళ్లి తీన్ మార్ డ్యాన్స్ వేస్తుంది. ఇక ఆ బాక్స్ ఉంచుకుంటా అని కృష్ణ అంటుంది. మురారి ఓకే అంటాడు. ఇక కోనేటి దగ్గరకు రావొచ్చా అని మురారి అడుగుతాడు.
కృష్ణ: మీరు రాను అన్నా ముకుంద, మీ పెద్దమ్మ తీసుకొస్తారు సార్
మురారి: డల్‌గా.. ఎందుకో వాళ్లు గుర్తొస్తుంటే మనసు ఏదోలా అయిపోతుంది. పేషెంట్‌గా మీ దగ్గర చెప్పుకుంటున్నాను ఏమనుకోకండి.. సరే సాయంత్రం గుడిలో కలుద్దాం

ఇక సాయంత్రం భవాని ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తారు. కృష్ణ వాళ్లు కూడా వస్తారు. ఇక కృష్ణ చాలా అందంగా ఉంది అని మురారి అనుకుంటాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. దాన్ని భవాని, ముకుంద దూరం నుంచి చూస్తారు. ఇక భవాని అక్కడికి వచ్చి క్లాస్ తీసుకొని మురారిని తీసుకెళ్లిపోతుంది. కృష్ణ కూడా వస్తుంటే రావొద్దు అనేస్తుంది. అందరూ షాక్ అవుతారు. కృష్ణ ఏడుస్తుంది. ఇక ముకుంద, మురారి కలిసి పూజ చేస్తారు.

ఇక నందూ, మధు కృష్ణ దగ్గరకు వస్తారు. ఇక నందూ కృష్ణతో నిన్న మురారి నీ భర్త ఎవరు అని అడిగితే ఏం చెప్పావు అని అడుగుతుంది. అబద్దం చెప్పావు అని అర్థమైంది అని నందూ అంటే లేదు నిజమే చెప్పానని కృష్ణ అంటుంది. దీంతో నందూ, మధు షాక్ అవుతారు. గతం గుర్తొస్తే మీకే తెలుస్తుంది మా ఆయన ఎవరో అని చెప్పానని కృష్ణ అంటుంది. దీంతో ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇక పంతులు గారు మురారి, ముకుందలకు వారి వయసు ఉన్న ముత్తయిదువుతో కంకణాలు కట్టించాలి అని అంటే మురారి వెంటనే వేణి గారు ఉన్నారు కదా కట్టించొచ్చు అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

తరువాయి భాగంలో: ముకుంద, కృష్ణ ఇద్దరూ కోనేటి దగ్గర దీపాలు పెడుతుంటారు. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని ముకుంద కృష్ణను అడుగుతుంది. ఈలోగా కృష్ణ పొరపాటున జారి కోనేటిలో పడిపోతుంది. భయంతో కృష్ణ ఏసీపీ సార్.. ఏసీపీ సార్ అని పిలిస్తే మురారికి యాక్సిడెంట్ సమయంలో కృష్ణకు తగిలిన గాయం గుర్తొస్తుంది. కృష్ణ అంటూ మురారి కోనేటిలో దూకి కృష్ణను బయటకు తీసుకొస్తాడు. 

Read Also: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget