By: ABP Desam | Updated at : 05 May 2022 07:52 AM (IST)
Karthika Deepam May 5th Episode 1343 (Image Credit: Star Maa/Hot Star)
ట్రీట్మెంట్ చేస్తున్న హిమను సహకరించకుండా ఎదురించి మాట్లాడుతుంది స్వప్న. ఇంతలో సౌందర్య కలుగజేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటుంది. ఆమె పట్టుకుంటేనే ఏదోలా చూస్తుంది...చాలా కోపంగా ఉంటుంది. చాలా కోపంగా చూస్తున్నారని దీని వల్ల బీపీ, పల్స్ రేట్ పెరుగుతుందని చెబుతుంది హిమ. మీరు ఓ డాక్టర్‌లా చూడాలంటూ రిక్వస్ట్ చేస్తుంది. ఇంజెక్ష్ చేయడానికే భయపడే నువ్వు ఓ డాక్టర్‌వా అని అడుగుతుంది. సౌందర్య అందుకొని... ఇది ఒకప్పటి హిమ కాదని... ఇప్పుడు ఏకంగా ఆపరేషన్లే చేస్తుందని సర్ది చెబుతుంది. దానికి రీయాక్ట్ అయిన స్వప్న... అమ్మా నువ్వు దేన్నైనా నమ్మించగలవంటూ సెటైర్లు వేస్తుంది. ఈ మార్పునకు కారణం ఆ ఆటో అమ్మాయి అని చెబుతుంది. దీంతో కోపం మరింత పెరుగుతుంది స్వప్నకు. ఆటో పిల్ల, ఈ నష్టజాతకురాలు ఇద్దరూ నా ప్రాణానికి తగులుకున్నారని మనసులో అనుకుంటుంది. ఇంతలో హెల్త్‌చెకప్ చేసిన హిమ... కాస్త ఆలోచనలు తగ్గించుకోవాలని స్వప్నకు చెబుతుంది. కష్టపెట్టేవాళ్లంతా పక్కనే ఉంటే ఆలోచనలు ఎలా తగ్గుతాయని ప్రశ్నిస్తుంది. తర్వాత సీన్ రెస్టారెంట్‌కు షిప్ట్ అవుతుంది.
మనసులో మాట చెప్పడానికి నిరుపమ్ కష్టపడుతుంటాడు. జ్వాల కూడా అదే ఫీలింగ్‌తో ఉంటుంది. అవి చెప్పకుండా ఇద్దరూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వచ్చిన టీని ఇద్దరికీ షేర్ చేస్తాడు నిరుపమ్.
నేనే ముందుగా ఒకటి చెప్పాలని అనుకున్నానని చెబుతుంది జ్వాల. ఇంతలో మీరే కలుద్దామన్నారని అంటుంది. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అని ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. తన మనసులో మాట చెప్పబోతుంది జ్వాల. ఇంతలో అక్కడకు ఫొటోగ్రాఫర్(నిరుపమ్ బ్రదర్) వస్తాడు. జ్వాల ఎదురుగా ఉన్న టీ తాగుతాడు. గతంలో చేసిందానికి రివేంజ్ ప్లాన్ చేశాడు. ఎక్సట్రాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఈ టైంలో వచ్చాడేంటని నిరుపమ్, జ్వాల మనసులో అనుకుంటారు. ఇంతలో వెయిటర్ ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. ఫోన్ చూసి కంగారుగా వెళ్లిపోతాడు నిరుపమ్.
స్వప్నకు ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంది హిమ. ఆవేశ పడొద్దని స్వప్నకు చెబుతుంది. నా పల్స్ బీపీ నా కొడుకు వచ్చి చూస్తాడని అక్కడి వెళ్లిపోమని కసురుకుంటుంది. అప్పుడే అక్కడకు నిరుపమ్ వస్తాడు. స్వప్నతోపాటు హిమ, సౌందర్యను చూసి షాక్ అవుతాడు. ఏం జరిగిందని ఆరా తీస్తాడు. ఇచ్చిన మందులు చూపిస్తుంది హిమ. ఇంత హెవీడోస్ ఇచ్చావని అడుగుతాడు నిరుపమ్. అప్పుడు కండీషన్ అలా ఉందని వివరిస్తుంది. ఎందుకు లేనిపోని విషయాలు ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకుంటావని తల్లికి క్లాస్ పీకుతాడు నిరుపమ్. ఇలా చేస్తే ఏదో రోజు గుండె ఆగిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. మీరంతా కలిసి నన్ను హింసించి ఏదో రోజు ఆ పని చేస్తారని అసహనంతో అంటుంది స్వప్న. నేను హిమ ఇద్దరం డాక్టర్లం ఇంట్లో ఉండగా నీ గుండెను ఎందుకు ఆగిపోనిస్తామని అంటాడు నిరుపమ్. ఇంతలో సౌందర్య జోక్యం చేసుకొని మీ ఇద్దరు ఒకే చోట ఉంటే సమస్యలే ఉండవు కదా అంటూ సలహా ఇస్తుంది. ఇది విన్నాక స్వప్న ఆగ్రహంతో ఊగిపోతుంది. ఒకే ఇంట్లో ఉంటే మీ అమ్మ బీపీని కంట్రోల్‌లో పెట్టొచ్చని కూడా చెబుతుంది సౌందర్య. ఈ డిస్కషన్ జరుగుతుండగానే నిరుపమ్ హిమ పెళ్లి చేసుకొని వచ్చినట్టు ఊహించుకుంటుంది స్వప్న. అమ్మ కళ్లుతెరిపించమని నిరుపమ్‌కు చెబుతుంది సౌందర్య. నువ్వైనా చెబితే స్వప్న వింటుందని... చెప్పమని సలహా ఇస్తుంది. అక్కడి నుంచి హిమ, సౌందర్య ఇద్దరూ వెళ్లిపోతారు.
సీన్ సత్యం ఇంటికి షిప్ట్ అవుతుంది. స్వప్న ఆరోగ్యం గురించి తెలుసుకున్న సత్యం... కొడుకు వద్దకు వచ్చి ఆరా తీస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు. ఇన్ని అడిగే బదులు వెళ్లి చూడవచ్చు కదా అంటాడు కొడుకు. దానికి సత్యం... నన్ను చూస్తే పాతాళంలో ఉన్న మీ అమ్మ బీపీ అమాంతం పైకి లేస్తుందని చెప్తాడు. అలానే అనుకొని అక్కడ ఆమె.. ఇక్కడ నువ్వు ఇలానే ఉండండి. మీరిద్దరు మా పెళ్లిళ్లకు పెద్దల్లా కాకుండా అడ్డంకిలా మారతారని అసంతృప్తి వ్యక్తం చేస్తాడు కొడుకు. ఇంతలో క్యారేజ్ పట్టుకొని వస్తుంది జ్వాల. అందులో బిర్యాని ఉందని తెలుసుకొని నిరుపమ్‌ను కూడా పిలుస్తాడు. హిమను కూడా రమ్మని నిరుపమ్ సలహా ఇస్తాడు. ఆమెను కూడా పిలుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ క్లంపీట్ అవుతుంది.
రేపటి ఎపిసోడ్
బిర్యాని అంతా కలిసి తింటుంటారు. బిర్యాని మొత్తం నిరుపమ్‌కు వడ్డించేస్తూ జ్వాల డ్రీమ్స్‌లోకి వెళ్లిపోతుంది. నిరుపమ్‌తో పెళ్లైనట్టు ఓ రొమాంటిక్ సీన్ ఊహించుకుంటుంది. ఇంతలో మిగతా ఇంటి సభ్యులు గోల చేస్తే రియాల్టీలోకి వస్తుంది.
Bigg Boss Telugu 7: అమర్‌పై యావర్ డౌట్లు, ఆటలో చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!
Bigg Boss Telugu 7: అర్జున్ గెలవకుండా యావర్ కుట్ర? చివరికి అతడికే ఎఫెక్ట్? ఫినాలే అస్త్రాలో పాలిటిక్స్
Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!
Naga Panchami November 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: తల్లైతేనే ఇంట్లో ఉంటావ్ - పంచమిని హెచ్చరించిన మోక్ష, గెటప్ మార్చేసిన కరాళి!
Krishna Mukunda Murari November 30th Episode: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: భవానిని తన మాటలతో ఏమార్చిన ముకుంద, మురారి పెళ్లి ముహూర్తం ఫిక్స్
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
/body>