అన్వేషించండి

Karthika Deepam మే 31(ఈ రోజు) ఎపిసోడ్: శోభతో పెళ్లి సంగతి తెలుసుకున్న నిరుపమ్- అసహనంతో తల్లిపై డాక్టర్ సాబ్ చిందులు

శోభతో పెళ్లి సంగతిని కూల్‌గా నిరుపమ్‌కు చెబుతుంది స్వప్న. వెంటనే ఆగ్రహంతో ఊగిపోతాడు నిరుపమ్. అప్పుడే హిమ పెళ్లి గురించి కూడా చెబుతుంది స్వప్న.

హాస్పిటల్‌కు వచ్చిన నిరుపమ్‌.. హిమ కోసమే ఆలోచిస్తుంటాడు. ఆమెతో ఉన్న క్లోజ్‌నెస్‌ను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో పిలిచినట్టు అనిపించి కళ్లు తెరిచి చూస్తే ఎవరూ ఉండరు. కాసేపటికి హిమ వస్తుంది. బావా అని పిలవడం మానేసి.. డాక్టర్ నిరుపమ్ అని పిలుస్తుంది. వెంటనే ఆగ్రహంతో బావా అనే పిలుపును కూడా మర్చిపోయావా అంటూ మండిపడతాడు. పుస్తకం మూసేసినట్టు ఇలా ఎలా అన్నింటినీ మర్చిపోతారాని ప్రశ్నిస్తాడు. డాక్టర్‌ నిరుపమ్‌ అని అంటుంటే చాలా బాధగా ఉంటుందని అంటాడు. నేను నీకు సరిపోనని.. చెబుతుంది. అలా నువ్వు అనుకుంటే సరిపోదని అంటాడు నిరుపమ్. వెంటనే నీకు తగిన అమ్మాయిని నేను తీసుకొస్తానంటుంది. మరింత కోపంతో ఊగిపోతాడు నిరుపమ్. నువ్వు నాకు పెళ్లి సంబంధం చూస్తే.. నేను నీకు పెళ్లి సంబంధం చూడాలా అంటూ నిలదీస్తాడు. వీళ్లిద్దరు మాట్లాడుకుంటుంటే... శోభ అక్కడకు వస్తుంది. వెళ్లిపోతుంటే.. ఉండమని నిరుపమ్‌ చెప్పి ఆమెతో బయటకు వెళ్తాడు. దీన్ని చూసి కాస్త అసహనంతో ఊగిపోతుంది హిమ. 

ఇంతలో సౌందర్యను జ్వాల తన ఇంటికి తీసుకొస్తుంది. కుడికాలు పెట్టి లోపలికి వెళ్లమంటుంది. రేపు ఎలాంటి గొడవలు జరగకుండా అంటుంది జ్వాల. ఇది నా ప్యాలెస్‌, ఇదే నా సామ్రాజ్యం అని చెబుతుంది జ్వాల. చాలా బాగుందంటుంది సౌందర్య. మీలా పెద్ద పెద్ద బంగ్లాలు లేవంటుంది జ్వాల. వాళ్లకు ఉండాల్సిన కష్టాలు వాళ్లకు ఉంటాయని... నీళ్లలో ఉన్న చేప పిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎవరికీ తెలియదు కాదు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది సౌందర్య. ఇంట్లో ఎవరెవరు ఉంటారని ప్రశ్నిస్తుంది సౌందర్య. కన్నవాళ్లు చనిపోయారని... బాబాయ్‌, పిన్నితో ఉన్నానంటూ చెబుతుంది. ఇంతలో కాఫీ ఇచ్చి ఏదో మాట్లాడాలని అన్నావంటుంది జ్వాల. మా మనవరాలు అంటూ ఏదో సౌందర్య చెప్పబోతుంటే... జ్వాలకు ఫోన్ వస్తుంది. చుట్టాలు వచ్చారు మళ్లీ మాట్లాడతాను అంటుంది. 
ఏం లేదు రౌడీ పిల్ల నీ వయసులోనే మా మనవరాలు ఉందని... దానికి నిశ్చితార్థం చేద్దామనుకున్నాం...కానీ మధ్యలోనే తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఆ విషయమే నువ్వు తెలుసుకోవాలని అంటుంది. దాని మనసు మార్చమంటుంది. ఏంటిది ఇలాంటి నాతో కావంటుంది జ్వాల. 


షాపింగ్ నుంచి వస్తున్న స్వప్నకు జ్వాల పిన్ని బాబాయ్ కనిపిస్తారు. వీళ్లు ఏదో చేస్తున్నారని గ్రహించిన స్వప్న.. వాళ్ల ఆటపట్టిస్తానంటుంది. మొత్తం కారు బాగానే ఉందని.. డబ్బులు అవసరం లేదంటూ చెబుతాడు. తాము చేతి వృత్తినే నమ్ముకొని బతుకుతున్నామని... ఏదో మాటలు చెప్పి తప్పించుకుంటారిద్దరు. 

హిమకు సౌందర్య పెళ్లి సంబంధం తీసుకొస్తుంది. ఈ విషయం తెలిసైనా నిరుపమ్ మనసు మారుతుందని అనుకుంటుంది. విషయాన్ని నిరుపమ్‌కు చేరవేయాలని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

తన బెడ్రూమ్‌లో ఒంటరిగా కూర్చొని నిరుపమ్‌...హిమ గురించే ఆలోచిస్తుంటాడు. ఇంతలో తల్లి స్వప్న వచ్చి హిమను మర్చిపోమంటుంది. మర్చిపో అనడం చాలా ఈజీ అని మర్చిపోవడం చాలా కష్టమంటాడు నిరుపమ్. తనే నా లైఫ్‌ అనుకున్నాక వదిలేసి ఎలా వెళ్లిపోతుందని ప్రశ్నిస్తాడు. తను నిన్ను కాదంటే.. నువ్వు కూడా మర్చిపోమంటుంది స్వప్న. భోజనం చేద్దామంటుంది. శోభ కూడా వస్తుందని చెబుతుంది. వెంటనే కోపంతో.. పదే పదే శోభ ఎందుకు వస్తుందని తల్లిని ప్రశ్నిస్తాడు. ఏదో నాతో మాట్లాడటానికి అని చెప్పి కవర్ చేస్తుంది స్వప్న. మా ఇద్దరిదీ అత్తాకోడళ్ల బంధం అంటుంది. ఆమెను పెద్ద కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నాను అని మనసులో మాట చెప్పేస్తుంది. అసహనంతో నిరుపమ్ తల్లిపై కోప్పడతాడు. మా ఇద్దరిదీ ఫ్రెండ్‌షిప్‌ అని... ఇలాంటి లేని పోని ఆలోచనలు ఆశలు శోభకు కలిగించవద్దని చెప్పేస్తాడు. అసలు తాను పెళ్లే చేసుకోనని అంటాడు. హిమ కాదన్నందుకు నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవు కానీ... ఆమె మాత్రం పెళ్లి చేసుకుంటుంది అని సంబంధాలు గురించి చెప్తుంది. విజయవాడ సంబంధం ఫిక్స్ చేస్తున్నారని విషయాన్ని నిరుపమ్‌కు వివరిస్తుంది. 

రేపటి ఎపిసోడ్
హిమకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న నిరుపమ్ ఆగ్రహంతో ఆమె వద్దకు వెళ్తాడు. కారులో తీసుకొచ్చి నిలదీస్తాడు. ఎవర్నో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావంట కదా అంటూ ప్రశ్నిస్తాడు. ఇంతలో ఈ డిస్కషన్ మొత్తాన్ని జ్వాల వింటుంది. నీకు పెళ్లి అంటూ జరిగితే నాతోనే జరుగుతుందని చెప్తాడు. ఈ మాటను జ్వాల వింటుంది. ఆ విషయం తెలుసుకున్న హిమ ఒక్కసారిగా షాక్ తింటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Embed widget