Karthika Deepam మే 24 ఎపిసోడ్: శోభ పిలిచిందని వెళ్లిపోయిన నిరుపమ్- ఫీల్ అవుతూ కూర్చున్న జ్వాల

నిరుపమ్‌కు వేరే పెళ్లి చేయడానికి ట్రై చేస్తుంది. శోభ అనే డాక్టర్‌ను హిమ, జ్వాలకు పరిచయం చేస్తుంది.

FOLLOW US: 

నిరుపమ్‌ లేని టైంలో హాస్పిటల్‌కు వచ్చిన స్వప్న ఓ వ్యక్తిని తీసుకొచ్చి హిమకు పరిచయం చేస్తుంది. నిరుపమ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. ఆటోలో బయటకు వెళ్లాడని సమాధానం చెబుతుంది హిమ. అది విన్న స్వప్న షాక్ అవుతుంది. జ్వాల ఆటోలో అని చెప్పేసరికి మరింతగా టెన్షన్ పడుతుంది. వెంటనే నిరుపమ్‌కు ఫోన్ చేస్తుంది స్వప్న. ఆటో నడుపుతున్న నిరుపమ్‌ ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉంటుంది. ఫోన్‌లు కట్‌ చేస్తూ ఆటో నడుపుకొని ఓ అనాథశరణాలయానికి వస్తారు జ్వాల, నిరుపమ్. ఇక్కడ ఉన్న వాళ్లకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఆనందంగా ఉన్నారని.. అన్నీ ఉన్నా చాలా మందిలో ఇది కనిపించదని క్లాస్ తీసుకుంటుంది. జ్వాల మాటలకు కాస్త నవ్వి తన చేయిని చేతిలోకి తీసుకొని నువ్వు గ్రేట్ అంటాడు. నీకు తెలియకుండానే గొప్ప గొప్ప మాటలు చెప్పావంటాడు. నువ్వు మా ఫ్యామిలీ కోసమే పుట్టావేమో అని పొగిడేస్తాడు. అంతే ఆ మాటతో డ్రీమ్‌లోకి వెళ్లిపోతుంది జ్వాల. ఏంటీ సాబ్‌ ఈ మధ్య పరేషాన్ పరేషాన్‌గా కనిపిస్తున్నారని అడుగుతుంది జ్వాల. ఏమైనా చేయగలనా అని ప్రశ్నిస్తుంది. అవసరమైనప్పుడు చెప్తానని కవర్ చేస్తాడు. ఇంతలో మళ్లీ ఫోన్ మోగుతుంది. కట్ చేస్తాడు నిరుపమ్. ఈ అశ్రమానికి నీకు ఏంటని సంబంధం అని అడుగుతాడు నిరుపమ్. చాలా ఉందిలే అని అంటుంది జ్వాల. ఇక్కడ ఉన్నానంటే మొత్తం కథ చెప్పాల్సి ఉంటుందని మనసులో అనుకుంటుంది. 

ఆసుపత్రిలో శోభతో కలిసి  ఉన్న స్వప్న... ఇంకా నిరుపమ్‌ ఫోన్‌ కోసం ట్రై చేస్తుంటుంది. వెళ్లిపోతూ... డాక్టర్‌ శోభాదేవి తనకు కాబోయే పెద్ద కోడలని హిమతో చెబుతుంది. అది విన్న హిమ షాక్ అవుతుంది. త్వరలోనే శుభలేఖలు పంపిస్తానని చెప్పి వెళ్లిపోతుంది. 

నిరుపమ్‌తో జ్వాలకు పెళ్లి చేసే బాధ్యత తనదేనంటూ ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలని భావిస్తే స్వప్న వేరే వ్యక్తిని తీసుకొచ్చి కోడలు అంటుదని... దీన్ని అడ్డుకోమని దేవణ్ని ప్రార్థిస్తుంది. 

ఇక్కడ నిరుపమ్‌ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి  ఆనందంతో ఊగిపోతుంది. ఇంతలో డాక్టర్ శోభ అక్కడకు వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తుంది జ్వాల. శోభ కూడా అదే ప్రశ్న వేస్తుంది. ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే.. ఇంతలో నిరుపమ్‌ వచ్చి శోభను విష్‌ చేస్తాడు. జ్వాలను పరిచయం చేస్తాడు. చాలా మంచి స్నేహితులమని చెప్తాడు. దాపరికాలు ఏమీ ఉండవని అంటాడు నిరుపమ్. వీళ్లిద్దరి క్లోజ్‌ నేస్‌ చూసి జ్వాల కుళ్లుకుటుంది. ఆటోవాలాకు డాక్టర్‌ సాబ్‌తో పరిచయమేంటని ప్రశ్నిస్తుంది. అసలు ఇక్కడకు ఎలా వచ్చావని అడుగుతాడు నిరుపమ్. స్వప్నతో కలిసి వచ్చానని బాంబు పేలుస్తుంది. ఇంతలో స్వప్న కోపంగా ఉందని గ్రహించి నిరుపమ్‌ ఆమెను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటాడు. 
నిరుపమ్ అలా వెళ్లిన వెంటనే శోభ, జ్వాల మధ్య మరోసారి వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో స్వప్న శోభను పిలుస్తుంది. శోభ నిరుపమ్‌ను పిలుచుకొని వెళ్తుంది. ఆటోలో రావడమేంటి... కారులో వెళ్దాం రమ్మంటుంది. దీంతో తను వెళ్తానంటూ వెళ్లిపోతాడు నిరుపమ్. వెళ్లకపోతే శోభ ఫీల్ అవుతుందని అంటాడు.  ఆ మాట విన్న జ్వాల ఫీల్ అవుతుంది. 

రేపటి ఎపిసోడ్...
శోభ, నిరుపమ్‌కు పెళ్లి చేయాలని స్వప్న ప్లాన్ చేస్తోందని హిమతో చెబుతుంది సౌందర్య. ఏమీ తెలియనట్టు షాక్‌ తింటుంది హిమ. మరోవైపు నిరుపమ్‌ ఇంటికి వచ్చి క్యారేజ్ ఇస్తుంది జ్వాల. ఆమెను చూసిన స్వప్న అగ్గిమీద గుగ్గిలమై మండిపడుతుంది. పెద్దలంటే తనకు గౌరవమని... చెప్పి స్వప్న కాళ్లకు నమస్కారం చేస్తుంది. అక్కడే ఉన్న శోభ్ ఈ సీన్ చూసి ఆశ్చర్యపోతుంది. 

Published at : 24 May 2022 08:21 AM (IST) Tags: Manas Nagulapalli karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar keerthi Karthika Deepam 24th May Episode 1360

సంబంధిత కథనాలు

Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి  వాయనం, రుక్మిణి  ఫోన్ ట్యాప్  చేసిన మాధవ

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Guppedantha Manasu జులై 5 ఎపిసోడ్: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu జులై 5 ఎపిసోడ్:  ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్

Gruhalakshmi జులై 5 ఎపిసోడ్: విషం తాగబోయిన లాస్య, కరిగిపోయిన నందు, సంబరంలో తులసి

Gruhalakshmi  జులై 5 ఎపిసోడ్: విషం తాగబోయిన లాస్య, కరిగిపోయిన నందు, సంబరంలో తులసి

టాప్ స్టోరీస్

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉచితం

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!

Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!