Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
సౌందర్యకు ఫోన్ చేసిన జ్వాల... నానమ్మ అని పిలుస్తుంది. నన్ను మర్చిపోయారా అని అడుగుతుంది.
కారులో కూర్చొని హిమ గురించే ఇంకా నిరుపమ్ ఆలోచిస్తుంటాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించుకుంటాడు. కలిసి బతకాలనుకున్నామని.. కానీ ఎందుకు కాదన్నావో... అర్థం కావడం లేదంటుంది. ఇంతలో హిమ వచ్చి కారు తీస్తుంది.
జ్వాలను లాక్కొని వచ్చిన సౌందర్య... బాధలు కష్టాలు లేవా అని ప్రశ్నిస్తుంది. అన్నింటినీ లైట్ తీసుకొని ఎలా ఉండగలుగుతున్నావని అడుగుతుంది సౌందర్య. నీకేం బాధలు ఉంటాయని ఎదురు ప్రశ్నిస్తోంది జ్వాల. డబ్బు ఉన్న వాళ్లు అన్నింటినీ ఈజీగా మర్చిపోతారని అంటుంది. కొన్నింటిని అంత సులభంగా మర్చిపోలేమంటుంది సౌందర్య. కన్నీళ్లు తుడుకుంటూ ఉంటే... జ్వాల బాధపడుతుంది. మిమ్మల్ని ఇలా చూడలేనంటుంది జ్వాల. ఇద్దరికి ఉన్న సమస్యలపై మాట్లాడుకుంటారు. చాలా కొత్తగా ఉన్నావని జ్వాలను కాస్త పొగుడుతుంది సౌందర్య. చాలా గ్రేట్ అంటుంది. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నావో చెప్పమంటుంది. కలెక్టర్ అవ్వాలనుకున్నానని చెబుతుంది జ్వాల. నాన్నకు చెప్పేదాన్ని అని అంటుంది. నాన్న ఎవరని అడుగుతుంది సౌందర్య. ఆయన గురించి ఎందుకని వదిలేయమంటుంది జ్వాల. ఇంతటి తెలివైన వ్యక్తిని ఎందుకు చదివించలేదని వాళ్లను పిచ్చపిచ్చగా తిట్టేస్తుంది సౌందర్య. ఆ తిట్లను భరించలేక ఆపమని చెబుతుంది జ్వాల. నాన్న తనకు ప్రాణమని.. మంచి ఫ్రెండ్ అని దేవుడు తీసుకెళ్లిపోయాడని చెప్పి బాధపడుతుంది జ్వాల. సౌందర్య ఓదారిస్తే వద్దని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి బయల్దేరతారు.
ఇంతలో కారులో బయల్దేరిన హిమ, నిరుపమ్ ఓ చోటుకు వచ్చి ఆగుతారు. మంచి వ్యక్తివి కాబట్టే ఇలా చేసిన ఏమనలేదని నిరుపమ్‌తో అంటుంది హిమ. నీ మౌనం కాల్చేస్తుందని... కోపం తీరేదాక తిట్టమని హిమ కోరుతుంది. తిడితే కోపం పోతుందేమో కానీ... ప్రేమ పోదని చెబుతుంది అంటాడు నిరుపమ్. గాయం నువ్వే చేసి మందు నువ్వే రాస్తావా అని ప్రశ్నిస్తాడు. ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలని రిక్వస్ట్ చేస్తాడు నిరుపమ్. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవని ఆ ప్రశ్న అడక్కుండా చేస్తుంది.
ఇంతలో అక్కడెవరో వ్యక్తికి బాగాలేదని తెలిసి వైద్యం చేయడానికి వెళ్తుంది హిమ. అక్కడే జ్వాల ఉంటుంది. అక్కడ జ్వాల ఎందుకు ఉందని ప్రశ్నించుకుంటుంది. ఇప్పుడు నిరుపమ్‌ను అక్కడకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక సతమతమవుతుంది.
సత్యం ఇంటికి స్వప్న వస్తుంది. ఇంటి బయటే ఉండి ఎవరి కోసమో చూస్తుంది. పై నుంచి సత్యం దిగుతాడు. రమ్మని లోపలికి ఆహ్వానిస్తాడు. అంతగా ఊహించుకోవద్దని.... నేను ఫోన్ చేసి రమ్మన్నానే తప్ప నేను వస్తానని చెప్పలేదు అంటుంది స్వప్న. మీ ఇంటికి భార్యగా, అతిథిగా రాలేదని చెప్పేస్తుంది. నీ కొడుకును అదుపులో పెట్టుకోమని సత్యానికి వార్నింగ్ ఇస్తుంది. ఆ నష్టజాతకురాలి వెంట పడొద్దని చెప్పమని హెచ్చరిస్తుంది. జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తుంది. తండ్రిగా మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తుంది. భర్తగా ఫెయిల్ అయిన మీరు తండ్రిగానైనా బాధ్యతగా ఉండాలని చెబుతుంది. అలాంటి నష్టజాతకురాలితో నా కొడుకు పెళ్లి జరగదని తేల్చి చెబుతుంది స్వప్న. వాళ్లిద్దర్ని కలపాలని ప్రయత్నిస్తే రియాక్షన్ సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
నిరుపమ్, హిమ ఉన్న ప్లేస్‌కే జ్వాల, సొందర్య వస్తారు. కారు నుంచి దిగిన సౌందర్య... జ్వాలను పొగడ్తలతో ముంచెత్తుతుంది. పని ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తుంది జ్వాల. జాగ్రత్తగా వెళ్లమని ఇద్దరికీ ఇద్దరూ చెప్పుకుంటారు. ఇంతలో పనిగా మనవరాలి విషయంపై ఆరా తీస్తుంది జ్వాల. దీంతో కోపంగా వెళ్లిపోతుంది సౌందర్య.
హిమ ఒంటరిగా తన రూమ్ దగ్గర నిల్చొని జ్వాల గురించి ఆలోచిస్తుంది. సౌర్య నాన్నమ్మతో మాట్లాడిందా... నేనే హిమ అని తెలిసిపోయిందా అని అనుమానపడుతుంది. తెలిసి కూడా నటిస్తుందా అనుకుంటుంది. ఏం జరిగిందో అర్థం కావడం లేదనుకుంటుంది.
సౌందర్య కూడా తన కారిడార్‌లో ఒంటరిగా తిరుగుతుంటుంది. ఇంతలో జ్వాల ఫోన్ చేస్తుంది. హలో అనేలోపు కట్ చేస్తుంది. తిరిగి సౌందర్య ఫోన్ చేస్తుంది. ఎవరు అని అడుగుతుంది. మాట్లాడరేంటని ప్రశ్నిస్తుంది. అన్ని వింటుంది కానీ... జ్వాల మాట్లాడదు. నవ్వుతూ ఉంటుంది. నాన్నమ్మా అని జ్వాల పలకరిస్తుంది.
రేపటి ఎపిసోడ్
హిమను పిలిచి సౌర్య ఫోన్ చేసిందని చెబుతుంది సౌందర్య. ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న కూడా నీ మనవరాలిని వెతికే పనిలో ఉండూ అని సలహా ఇస్తుంది. అది ఎక్కడ ఉన్న వెతికి పట్టుకుంటానంటుంది సౌందర్య. ఒకవేళ అది దొరికితే నా ఇంటికి తీసుకొచ్చి కోడల్ని చేస్తానని కొత్త డ్రామా మొదలు పెట్టొద్దని హెచ్చరిస్తుంది. ఇంతలో హిమ ఆనెంబర్‌కు మళ్లీ కాల్ చేస్తుంది.