By: ABP Desam | Updated at : 14 May 2022 08:17 AM (IST)
Karthika Deepam May 14th Episode 1352 (Image Credit: Star Maa/Hot Star)
నిశ్చితార్థం జరుగుతున్న గుడిలోనే జ్వాల పూజలు చేస్తుంది. హిమ టెన్షన్‌లో ఉంటే... ఎందుకంత డల్‌గా ఉన్నావని అడుగుతాడు. ఏం చెప్పదు. ఇంతలో ప్రేమ్‌కు మంచి సంబంధం చూడాలి అని స్వప్నతో అంటాడు. ప్రేమ్‌తోపాటు నిరుపమ్‌కి కూడా మంచి సంబంధం చూడాలి అంటుంది స్వప్న. స్వప్న మాటలకు షాక్ అవుతాడు సత్యం. ఉంగారాలు ఎక్కువ తెచ్చుకున్నంత మాత్రాన నిశ్చితార్థం అయిపోదని అంటుంది స్వప్న. ఆ ఉంగరాలు తీసిందే నేను అని చెప్తుంది. షాక్ అవుతాడు సత్యం.
ఇంతలో పక్కనే గుడికి వచ్చి దేవుడికి దండం పెడుతున్న జ్వాలను చూస్తుంది హిమ. తనలోని టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది. అందర్నీ ఒకే చోట చూస్తే పరిస్థితి ఏంటని అనుకుంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండానే జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో హిమ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ముహూర్తం దగ్గర పడింది.. తాంబూళాలు మార్చుకునే టైంలో పెళ్లి ఇష్టం లేదని హిమ షాక్ ఇస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.
ఏమంటున్నావని సౌందర్య అడుగుతుంది. పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది హిమ. ఏమైందని నిరుపమ్ అడుగుతాడు. సారీ చెప్పేస్తుంది కానీ ఏమీ చెప్పదు. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ఎవరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని జ్వాలకు తన ఆటోలో వచ్చిన పాసింజర్లు చెప్తారు. ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో అనుకుంటుంది జ్వాల.
హిమ చేసిన పనితో రివర్స్ అవుతుంది స్వప్న. నలుగురిలో అవమాన పరిచేలా చేశారని సౌందర్యపై మండిపడుతుంది. అది ముమ్మాటికీ నష్టజాతకురాలే అని చెబుతుంది. ఓ అమ్మాయి రిజెక్ట్ చేసిందనే నింద తన కుమారుడు మోయాల్సి వస్తుందని దెప్పిపొడుస్తుంది.
కార్తిక్, దీప ఫొటోలు ఎదురుగా ఏడుస్తుంది హిమ. సౌర్యను అప్పగించి మీరు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని.. అందుకే ఈ పని చేశానని చెబుతుంది. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాని ఆనందపడుతుంది. సౌర్య కోసం నా ప్రాణం అడ్డు వేద్దామనుకున్నాను.. కానీ ప్రేమను అడ్డువేశానని చెబుతుంది. సౌర్య కోసం బావన త్యాగం చేశానని చెప్తుంది.
ఆ రోజు ఐస్‌క్రీమ్ పార్లర్‌లో జ్వాల ఫోన్ హిమ చూస్తుంది. అందులో నిరుపమ్ ఫోన్ నెంబర్‌ను నా మొగుడు అని సేవ్ చేసుకొని ఉంటుంది. నిరుపమ్‌ను సౌర్య ప్రేమించిన సంగతి తెలుసుకుంటుంది.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి సౌర్య ఆనందమే నా ఆనందంగా బతుకుతున్నానని అందుకే ప్రేమను త్యాగం చేశానని చెప్పేస్తుంది. సౌర్య కోసం ఏమైనా చేయగలనా అనుకున్న టైంలో ఈ ప్రేమ సంగతి తెలిసిందని చెబుతుంది. నిరుపమ్, సౌర్యకు పెళ్లి చేస్తానని అంటుంది. ఇప్పుడు ఆ పెళ్లి చేసిన తర్వాత నా గురించి ఆలోచిస్తానని అనుకుంటుంది. అదే నా జీవిత లక్ష్యమని తల్లిదండ్రులకు మాట ఇస్తుంది.
ఒంటరిగా కూర్చొని ఉన్న హిమ దగ్గరకు సౌందర్య వస్తుంది. ఏమైందని నిలదీస్తుంది.
రేపటి ఎసిసోడ్
నిరుపమ్ ఫుల్‌గా తాగేసి కారులో పడి ఉంటాడు. అతన్ని చూసిన జ్వాల ఇంటికి తీసుకెళ్తుంది. మధ్యలో నేను నీకు ఇష్టమే కదా అని అడుగుతాడు. ఐలవ్‌యూ అని చెప్పేస్తాడు.
Bigg Boss Telugu 7: నువ్వేమైనా పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
Nindu Noorella Savasam September 23rd: ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టిన అరుంధతి ఆత్మ - సైకోలా మారిన మనోహరి!
Trinayani September 23rd Episode: సుమనకు ఆస్తి ఇచ్చిన విశాల్ - విషపు కత్తిని మింగిన పాము!
Gruhalakshmi September 23rd: మాజీ భార్యని ఇంప్రెస్ చేసేందుకు నందు తిప్పలు- జాహ్నవి ఆత్మహత్యాయత్నం
MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
/body>