Karthika Deepam మే 11 ఎపిసోడ్: ఎంగేజ్‌మెంట్‌ ఆపింది స్వప్న కాదు హిమ- షాక్‌లో నిరుపమ్‌, సౌందర్య

స్వప్న ఏదో చేస్తుందని అనుకుంటే... హిమ షాక్ ఇచ్చింది. తనకు పెళ్లి ఇష్టం లేదని నిశ్చితార్ధం వద్దనుకొని వెళ్లిపోతుంది.

FOLLOW US: 

ఆటోలో వస్తూ బాబాయ్‌ను తిట్టుకుంటూ ఫంక్షన్ హాల్‌కు వస్తుంది జ్వాల. నిరుపమ్ తన కోసం ఎదురు చూస్తుంటాడని ఊహించుకుంటూ ఉంటుంది. కాస్త ఆలస్యంగానైనా ఫంక్షన్ హాల్‌కు వస్తుంది జ్వాల. అక్కడ ఎవరూ ఉండరు. ఫంక్షన్ ఎప్పుడో అయిపోయిందని అక్కడి స్టాఫ్ చెబుతారు. 

కట్‌చేస్తే నిరుపమ్‌, హిమ ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఏదో విజయం సాధించిన ఆనందంలో ఉంటారు ఇద్దరు. పక్కపక్కనే ఉన్నప్పటికీ మనసులో మాట చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్తాడు నిరుపమ్. ఐలవ్‌యూ అని చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశానంటాడు. నవ్వుతూ హిమ రిప్లై ఇస్తుంది. నువు చెబుతున్న మాటలన్నీ... నా మనసులో మాటలేనంటూ సమాధానం ఇస్తుంది. ఇద్దరం మనసులోని ప్రేమ బయటపెట్టకుండా దాచుకున్నామని ఇద్దరూ అనుకుంటారు. 

ఇద్దరు లవ్‌ మూడ్‌లో ఉండగానే సౌందర్య అక్కడకు వస్తుంది. ఇంతలో నిరుపమ్ సిగ్గుతో వెళ్లిపోతాడు. హ్యాపీయేనా అని హిమను అడుగుతుంది సౌందర్య. నా జీవితంలో సగం సౌర్య ఉందని.. సంతోషంలో కూడా సగం ఉండాలని చెబుతుంది. సౌర్య లేకుంటే జీవితం, సంతోషం అన్నీ సగమే అంటుంది. సౌర్య వచ్చాకే పెళ్లి చేస్తానంటూ హిమకు మాట ఇస్తుంది సౌందర్య. 

సత్యం మందు తాగుతూ పెళ్లిరోజు వేడుక గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరో గ్లాస్ తీసుకొచ్చి నాక్కూడ మందు పోయమంటాడు కుమారుడు ప్రేమ్. ఇవాల్టి నుంచే మొదలు పెడతానంటాడు. ఏంట్రా నీ ఆనందం అని అడుగుతాడు సత్యం. హిమ, నిరుపమ్ ఎపిసోడ్‌ గురించి తలుచుకొని ప్రేమ్ బాధపడుతుంటే... అదే ఎపిసోడ్‌ తలచుకొని ఆనందపడుతుంటాడు సత్యం. హిమను ప్రేమిస్తున్నానని మనసులో మాట చెప్పేస్తాననుకుంటాడు కానీ ఇంతలో నిరుపమ్, హిమ పెళ్లి విషయంలో సౌందర్యను పొగిడేస్తాడు సత్యం. మీ అమ్మ నా దగ్గరకు వస్తుందని ఆ రోజు వస్తుందని ఆనందపడతాడు. దీంతో మనసులో మాట చెప్పకుండానే తన రూమ్‌కి వెళ్లిపోతాడు ప్రేమ్. 

నిరుపమ్, హిమ పెళ్లి ప్రస్తావనతో రగిలిపోతుంది స్వప్న. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పగుల గొడుతుంది. ఇంతలో సౌందర్య వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. పోగట్టుకున్నవి వస్తువులపైతే కొనుక్కోవచ్చు... ప్రేమను, బంధాలను పోగొట్టుకుంటే ఈజీగా దొరకవని హితబోధ చేస్తుంది. ఇది మంచి అవకాశమని నచ్చజెప్పుతుంది. ఆ నష్టజాతకరాలుని నా నెత్తినపెట్టుకొని ఊరేగమంటావా అని అడుగుతుంది స్వప్న. దీప, కార్తీక్‌ను పొట్టన పెట్టుకున్న దాన్ని కోడలిగా ఎలా అంగీకరిస్తానంటూ ప్రశ్నిస్తుంది. ఏం చేసినా నిశ్చితార్థం జరుగుతుందని... తల్లిగా వచ్చి పెద్దరికం నిలబెట్టుకోమంటుంది సౌందర్య. నా ఆలోచనలు నాకున్నాయని అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. 

హిమ, నిరుపమ్‌ పెళ్లి ప్రపోజల్‌ సంగతి తెలియని ఆటోలో కూర్చొని నిరుపమ్‌ కోసం ఆలోచిస్తుంటుంది జ్వాల. హీరో లెక్క ఉంటావని పొగిడేస్తుంది. మనల్ని ఎవరూ వేరు చేయలేరంటూ ఊహించుకుంటుంది. ఇంతలో హిమ వస్తుంది. షాపింగ్‌కు పిలుస్తుంది హిమ. రానని చెప్పేస్తుంది జ్వాల. నిరుపమ్ వస్తున్నాడని చెప్తే షాపింగ్‌కు రావడానికి జ్వాల ఓకే చెప్పేస్తుంది. ఇలా ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్తారు. 

రేపటి ఎపిసోడ్
నిశ్చితార్థం జరుగుతున్న గుడిలోకి జ్వాల వస్తుంది. అది చూసిన హిమ షాక్ అవుతుంది. వెంటనే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందరికీ షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక అంతా సైలెంట్‌ అయిపోతారు. 

Published at : 11 May 2022 08:57 AM (IST) Tags: Manas Nagulapalli karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar keerthi Karthika Deepam 11th May Episode 1349

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Karthika Deepam మే 25(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్‌కు దగ్గరయ్యేందుకు శోభ వేసిన ప్లాన్‌ జ్వాలకు వర్కౌట్‌ అయిందా?

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్- లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Guppedantha Manasu మే 25(ఈరోజు) ఎపిసోడ్: వెడ్డింగ్ కార్డు చూసి రిషి రియలైజేషన్-  లైఫ్‌ పార్టనర్‌ దొరికేసిందని ఆనందం

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి