అన్వేషించండి

Karthika Deepam June 7th (ఈ రోజు) ఎపిసోడ్: తల్లిని ఎదిరించి తండ్రి వద్దకు వచ్చేసిన నిరుపమ్- రివర్స్ డ్రామా మొదలు పెట్టిన స్వప్న

కార్తీక దీపం ట్విస్ట్‌లు టర్నింగ్‌లు మామూలుగా లేవు. స్వప్నను ఎదురించి ఇంటి నుంచి బయటకి వస్తాడు నిరుపమ్. దీంతో స్వప్న రివర్స్ డ్రామా మొదలెట్టింది.

పిన్ని బాబాయ్‌ను దొంగలగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం, నిరుపమ్‌ అన్న మాట జ్వాలను విపరీతంగా బాధించింది. అందుకే పార్టీ  నుంచి పక్కకు వచ్చి విచారంగా ఉంటుంది జ్వాల. అక్కడకు నిరుపమ్ వస్తాడు. తొందరపాటులో ఏదో మాట్లాడేశాను సారీ చెప్తాడు నిరుపమ్. మీరు నాకు సారీ చెప్పడమేంటీ డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. ఆవేశంలో ఏదో మాట్లాడేశాను అంటాడు. నన్ను ఏదైనా అనే హక్కు మీకు ఉందని చెప్తుంది జ్వాల. అంటే నీకు కోపం లేదా అని అడుగుతాడు నిరుపమ్. అప్పుడు చివుక్కుమన్న మాట వాస్తమే కానీ... తర్వాత ఏమీ ఉండదు డాక్టర్ సాబ్ అంటుంది. 

వీళ్లు మాట్లాడుకుంటుండగానే హిమ అక్కడకు వస్తుంది. నీకు ఎన్ని థాంక్స్‌లు చెప్పినా తక్కువే తింగరీ అని హిమని ఆకాశానికి ఎత్తేస్తుంది జ్వాల. అవును అంటాడు నిరుపమ్. జ్వాల చెప్పింది నిజం... చివరి నిమిషంలో చాలా బాగా ఆలోచించావు అంటాడు. తింగరీ నీ తెలివితేటలకు అందరూ పరేషాన్ అయ్యారు అంటుంది జ్వాల. ఇన్ని తెలివితేటలు ఉన్న హిమ నన్ను ఎందుకు వద్దన్నదో ఇప్పటికీ అర్థం కాదని మనసులో అనుకుంటాడు నిరుపమ్.

జ్వాల పిన్ని ,బాబాయ్‌కు శోభ సారీ చెప్పడంపై స్వప్న రగిలిపోతుంది.. అందరి ముందు నీ పరువుతోపాటు నా పరువు కూడా తీశావంటూ శోభపై కోప్పడుతుంది. హిమ అందరి ముందు మన పరువ కాపడిందని అంటుంది. ఆమె రచ్చ చేసి ఉంటే ఇంకోలా ఉండేదని అంటుంది. 

శోభతో పెళ్లి డిస్కషన్ మళ్లీ పెడుతుంది స్వప్న. ఇది జరగని పని అని నిరుపమ్ అంటాడు. ఇది నా జీవితమని.. నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉందని అంటాడు నిరుపమ్. మీరు పెద్దలగా పెద్ద మనుషులుగా దీవించండి అని అంటాడు. హిమను పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. మళ్లీ హిమ అంటావేంటిరా అని స్వప్న అడుగుతుంది. మమ్మీ... నీపై గౌరవం ఉంది అది పోయేలా చేయకు అని వార్నింగ్ ఇస్తాడు నిరుపమ్. ఏంటండీ మీరేం మాట్లాడరా.. బాధ్యతలేదా అని సత్యాన్ని అడుగుతుంది. నా బాధ్యతలు ఎవరు పట్టించుకున్నారని... నేను ఓ తండ్రిగా మాత్రమే సమాజానికి మిగిలిపోయానని నిట్టూరుస్తాడు సత్యం. బాధ్యత మాటకొస్తే పిల్లల పెళ్లి వాళ్ల ఇష్టానికి వదిలేయడమే మంచిది అంటాడు సత్యం. కరెక్ట్ డాడీ అంటాడు నిరుపమ్. ఏంట్రా కరెక్ట్‌... మీ నాన్నమ్మ ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్‌మెంట్‌ పెడితే మీకు ప్రాబ్లమ్‌ లేదని అంటుంది స్వప్న. ఇప్పుడు నీ మమ్మి పెళ్లి ఫిక్స్‌ చేస్తే ప్రాబ్లమ్‌ అయిందా అంటుంది. అంటే నీకు నాన్నమ్మ ఎక్కువైపోయిందా అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు మమ్మీ... మనసు తెలుసుకున్న వాళ్లదే గొప్పతనం అవుతుందని అంటాడు నిరుపమ్. నీకు ఇష్టం లేకపోయినా ఓ షర్ట్‌ ఇస్తే వేసుకుంటాను... అది నీకోసం చేయగలను కానీ ఇది నా జీవితం మమ్మీ. నా జీవితాన్ని కాబోయే భార్యను నువ్వెలా డిసైడ్ చేస్తావు అని అడుగుతాడు నిరుపమ్. అవును సత్యం స్వప్న దీన్ని ఇంతటితో వదిలేద్దామని అంటాడు సత్యం.

 మిస్టర్‌ సత్యం మీ బోడి  సలహాలు నాకు అవసరం లేదు... మీరు ఏం చేయలేరని అర్థమైపోయిందని అసలు మిమ్మల్ని ఇంటికి రప్పించడమే తప్పని అంటుంది స్వప్న. వచ్చే నెలలోనే ముహూర్తాలు పెట్టిస్తున్నామని ఆ ముహూర్తానికే శోభను పెళ్లి చేసుకుంటావని చెబుతుంద స్వప్న. మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలని నేను హిమనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడునిరుపమ్. నీవు నేను చెప్పినట్టు వినకపోతే మీ అమ్మ బ్రతికి ఉండదని బ్లాక్‌మెయిల్ చేస్తుంది స్వప్న. కోపంతో టీపాయ్‌ మీద ఉన్న వస్తువు విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. 

హాస్పిటల్‌లో ఉన్‌న హిమను ప్రేమ్ వచ్చి కలుస్తాడు. తాను పంపించిన వీడియో గురించి అడగాడని వచ్చి ఉంటాడు. లోపలికి రమ్మంటుంది. రాకపోయేసరికి తనే వెళ్లి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఏంటీ చాలా రోజుకు వచ్చావని అంటుంది. నీవే రావట్లేదు అంటాడు ప్రేమ్. తీరిక లేదని అంటుంది హిమ. ఒక్కోసారి తెలియకుండానే బిజీ అయిపోతామంటుంది. రావాలని ఉంటే ఎలాగైనా రావచ్చని అంటాడు ప్రేమ్. నువ్వు మారిపోయావని హిమ అంటాడు ప్రేమ్. అవును లావు అయ్యాని చాలా మంది అంటున్నారని రిప్లై ఇస్తుంది. నా వీడియో చూడలేదు అంటే నీ మనసులో నేను లేనని అర్థమైందని మనసులో అనుకొని వెళ్లిపోతాడు ప్రేమ్. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఇంతలో మెకానిక్‌ వచ్చి ఫోన్ ఇస్తాడు. అందులో వీడియోలు, ఫొటోలు పోయాయని చెప్తాడు. అంటే నేను పంపిన వీడియో హిమకు చేరలేదని తెలుసుకొని మళ్లీ వచ్చి కూర్చొని కాఫీ తాగుదామా అని హిమను అడుగుతాడు. 

ఆటోలో వస్తున్న జ్వాల నిరుపమ్ గురించే ఆలోచిస్తుంటుంది. ఇంటికి వెళ్లాలని ఉన్నా... ఆ గయ్యాలి మేడం ఉంటుందని ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. కేరేజ్‌ తీసుకొని సత్యం వాళ్ల ఇంటికి వస్తుంది. అక్కడ నిరుపమ్‌ను చూసి ఇక్కడ ఉన్నారేంటీ అంటుంది. ఇకపై ఇక్కడే ఉంటాను అంటాడు నిరుపమ్. ఎందుకని అంటుంది జ్వాల. కొందరికి దగ్గరవ్వాలంటే ఇంకొకకరికి దూరమవ్వాలని అంటాడు నిరుపమ్. హిమకు దగ్గర అవ్వాలంటే... ఇలా చేయక తప్పదని మనసులో అనుకుంటాడు నిరుపమ్. నాకు దగ్గరవ్వడానికి డాక్టర్ సాబ్‌ ఇలా చేశారని తన మనసులో అనుకుంటుంది జ్వాల. ఇంతలో వచ్చిన ప్రేమ్‌ను జ్వాల పలకరిస్తుంది పద్దతిగా ఉంటే ఓకే కానీ పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే బాగుదు అని వార్నింగ్ ఇస్తాడు. మీ మమ్మీ కూడ వస్తే ఎంత బాగున్నో అనుకుంటాడు సత్యం. సడెన్‌గా అక్కడకు వచ్చిన స్వప్న... అంతా కలిసే ఉంటారని అంటుంది. ఆంటీ కూడా కలిస్తేనే ఫ్యామిలీ అవుతుందని త్వరలో అన్ని సర్దుకుంటాయని చెబుతుంది. స్వప్నతో పడక నేను వచ్చాను.. తర్వాత వీడు వచ్చాడు... ఆమెతో కలవాలంటే భూమి ఆకాశం ఒక్కటవ్వాలేమో అంటాడు సత్యం. 

అంత అవసరం లేదు లెండీ అని అక్కడికి సడెన్ ఎంట్రీ ఇస్తుంది స్వప్న. స్వప్నను అక్కడ చూసి అంతా షాక్ అవుతారు. ఆమె రాకను చూసి అంతా ఆశ్చర్యపోతారు. కలా నిజామా అని అడుగుతాడు ప్రేమ్. నా మాటే చెల్లాలనే పెంకితనం ఇన్నేళ్లు గడిచాయి... నిరుపమ్‌ కోపంతో ఇల్లు వదిలి వచ్చాక... శోభ చెప్పిన తర్వాత నాలో కొత్త ఆలోచనలు కలిగాయి అంటుంది స్వప్న. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లాక ఒక్కసారి ఆలోచించాను...  అందర్నీ పంపించేసి ఏం చేయగలను అనుకున్నాను.. నీ కోసమే వచ్చేశావు అని నిరుపమ్‌తో అంటుంది. అవేమీ పట్టించుకోకుండా నిరుపమ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా శోభ గొప్పతనమే అనేలా కవరింగ్ ఇస్తారు. ఇక ఇవాల్టితో టిఫిన్ మోయడాలు.. మాటలు మోయడాలు ఆపేయమని జ్వాలకు స్వప్న వార్నింగ్ ఇస్తుంది. 

రేపటి భాగం
హిమ రాగానే జరిగింది చెప్పేస్తుంది శోభ. ఇకపై మీ మధ్య ఉన్న కనెక్షన్ కట్ అవుతుందని అంటుంది. మీవల్ల కానిది నేను చేశానంటూ బిల్డప్ ఇస్తుంది.  ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న... శోభదేవి తనకు కాబోయే కోడలని... ఆమె తన మనసుకు నచ్చిందని అంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Embed widget