అన్వేషించండి

Karthika Deepam జూన్ 14 ఎపిసోడ్: హిమ మెళ్లో తాళి కట్టేసిన నిరుపమ్, మొత్తం జ్వాల చూసేసింది!

Karthika Deepam june 14th Episode 1378: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 14 బుధవారం 1378 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 14 మంగళవారం ఎపిసోడ్  1378
ఎట్టకేలకు నిరుపమ్ ని ఒప్పించిన హిమ..జ్వాలను దగ్గరుండి తీసుకెళ్లి ప్రపొజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఏడు అడుగులను పూలతో డిజైన్ చేసి ఒక్కో అడుగును వేయిస్తుంది. అమ్మా నాన్న మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా..శౌర్య కోరుకున్న నిరుపమ్ ని తనకి ఇస్తున్నా అని మనసులో అనుకుంటుంది. అటు జ్వాల( శౌర్య) కూడా మరో అడుగుముందుకేస్తే డాక్టర్ సాబ్ కి చేరువవుతా అని మురిసిపోతుంది. మరోవైపు నిరుపమ్ కూడా... నువ్వు అనవసరంగా నాపై ప్రేమ పెంచుకున్నావ్ నా మనసంతా హిమే నిండి ఉంది..తనే నా జీవితం..తనతోనే ప్రేమ..తనతోనే పెళ్లి అని నీకు స్పష్టంగా చెప్పేస్తాను రా జ్వాలా అనుకుంటాడు. ఏడో అడుగు వేసేలోగా జ్వాల ఫోన్ రింగవుతుంది. 

నిరుపమ్ ని దక్కించుకోవాలంటే జ్వాలని ప్రపోజ్ చేయనీయకూడదని ఫిక్సైన డాక్టర్ శోభ... కాల్ చేసి నేను నీ శత్రువు హిమను అంటుంది (జ్వాల చేతిపై పచ్చబొట్టు చూసి శోభ అడిగితే నా శత్రువుది అని చెబుతుంది జ్వాల). వెంటనే జ్వాల కోపంగా అక్కడి నుంచి వెనకడుగు వేస్తుంది. నేను ఫోన్లో అడ్రస్ చెబుతుంటాను..నువ్వు రావాలి..నాకు కోపం వస్తే మనసు మార్చుకుంటా అలాగే వచ్చెయ్ అంటుంది శోభ.నేనంటే నీకు ఎంతో కోపం కదా చెప్పినట్టు వింటున్నావ్ అంటుంది. అటు హిమ బాధగా నిరుపమ్ దగ్గరకు వెళ్లి ఏంటి బావా జ్వాల అలా వెళ్లిపోతోందని అడుగుతుంది.... తను ఏడో అడుగు వేసిన తర్వాత నా మనసులో హిమ మాత్రమే ఉందని చెప్పాలనుకున్నా అని క్లారిటీ ఇస్తాడు నిరుపమ్. నువ్వు వందసార్లు చెప్పినా నువ్వే నా లోకం-నువ్వే నా భార్యవి అని జ్వాలకు చెబుతానని తేల్చి చెప్పేస్తాడు నిరుపమ్. 

Also Read: వంటల పోటీల్లో వెనిగర్ పంచాయితీ- జానకి మాటతో ఉలికిపడ్డ సునంద- ఇక రామచంద్ర గెలిచినట్టేనా?

అటు జ్వాలని వెనక్కు రప్పించడంలో సక్సెస్ అయ్యానంటూ శోభ మురిసిపోతుంది. మరోవైపు ఫొటో గిసిన గీత దగ్గరకు వెళ్లిన శోభ... జ్వాలే...శౌర్య అని ఫొటో చూసి తెలుసుకుంటుంది. పెద్దావిడ అడిగి మరీ గీయించుకున్నారు  నేను ముంబైకి వెళ్లిపోయినప్పుడు ఆ బొమ్మలన్నీ ఇవ్వలేకపోయానంటుంది. స్పందించిన శోభ...నాకు వాళ్లంతా తెలుసు నా మొబైల్ కి సెండ్ చేయి నేను ఇచ్చేస్తా అంటుంది. 

మరోవైపు జ్వాలపై ఫైర్ అవుతుంది హిమ. 
హిమ: బావతో నీ మనసులో మాట చెబుతావని నేను అనుకుంటే మంచి మర్యాద లేకుండా నువ్వు వెళ్లిపోయావేంటి ఇదేనా పద్ధతి అని క్వశ్చన్ చేస్తుంది. డాక్టర్ సాబ్ ని అవమానించావ్.. 
జ్వాల:  తింగరి నేను తర్వాత మాట్లాడతాను..నువ్వెళ్లు
హిమ: నాకు చాలా కోపం వస్తోంది..గట్టిగా అరవడం ఇంతకుముందు నువ్వెప్పుడూ చూసి ఉండవ్..నువ్వు చెప్పాపెట్టకుండా వచ్చేస్తే బావ ఏమనుకోవాలి. నేను వెళ్లను...ఏమైంది నీకు..ప్రాబ్లెమ్ ఏంటి..ప్రతీదాన్ని ఈజీగా తీసుకునే నువ్వు సీరియస్ గా ఎందుకున్నావ్...
జ్వాల: హిమ కాల్ చేసింది నాకు..ఎవరైతే నాకు శత్రువు అనుకుంటున్నానో అదే నాకు కాల్ చేసింది. అది నా చెల్లి. మా అమ్మానాన్న చావుకి కారణమైంది...తన మొహం చూడటం ఇష్టంలేక. ఇంట్లోంచి పారిపోయి వచ్చాను.రోజులు గడుస్తున్నా.. దాని మీద కోపం తగ్గేలా లేదు.. నా వయసు పెరిగే కొద్దీ.. కోపం పెరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు చూస్తానా? నాకున్న కోపాన్ని ఎప్పుడు తీర్చుకుంటానా? అని చూస్తున్నా. దాని మీద కోపమా? డాక్టర్ సాబ్ మీద ప్రేమా? అని పోల్చుకుంటే.. దాని మీద కోపమే ఎక్కువ అని అనిపించింది. అది ఫోన్ చేసే సరికి.. నన్ను నేనే మర్చిపోయాను.. ఏం చేయాలో తోచలేదు.. అక్కడ ఉండలేక వచ్చేశాను. నువ్వెళ్లు తింగరి నీతో తరువాత మాట్లాడతాను. నేను ఇప్పుడున్న మూడ్‌లో నీతో మాట్లాడలేను వెళ్లు.

Also Read: ఇది కాదా L-O-V-E, వసు తనని ప్రేమిస్తోందని రిషికి క్లారిటీ వచ్చినట్టేనా!

శోభ: జ్వాల గతంలో కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇకపై మిమ్మల్ని ఆట ఆడిస్తా అని అనుకుంటుంది. అబ్బబ్బా ఫ్యామిలీ మొత్తం దొరికిపోయింది. నన్ను కొట్టి జ్వాల కొట్టిందంటావా? నువ్ జ్వాలవి కాదని తెలిసిందిగా. ఏంటండి సౌందర్య గారు.. మీరు ఎక్కువ చేశారు కదా?.. అంతకు మించి ఎక్కువ ఇప్పుడు నేను చేస్తాను. మా మమ్మీలా ఆ శోభను చేసుకోమని చెబుతావా? అని హిమని నిరుపమ్ అడగడం.. చీచీ అలా నేను ఎందుకు చెబుతాను బావ అని హిమ అన్న మాటలను శోభ గుర్తుకు చేసుకుంటుంది. చీచీనా హిమ. నీ ఫ్యామిలీతో ఆడుకుంటా.. బ్రహ్మాస్త్రం నా చేతికి దొరికింది. నిరుపమ్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ నా వాడిని చేసుకోవాలి ఇదే మంచి టైం.

హిమ: నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని జ్వాల అన్న మాటలను హిమ తలుచుకుని బాధపడుతుంది.నా పేరు చెప్పి శౌర్యను ఎవరు బెదిరించారు, ఎవరికి ఆ అవసరం ఉంది.. ఆట పట్టిస్తున్నారా? పాపం శౌర్య ఎంత ఫీలైందో ఏమో.. అసలే శత్రువు అని  వెతుకుతున్న నన్ను.. ఎవరో హిమ అని ఫోన్ చేస్తే ఇంకా బాగా డిస్టర్బ్ అయింది. 
ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
బుధవారం ఎపిసోడ్‌లో గుళ్లో హిమకు తాళి కట్టేస్తాడు నిరుపమ్. అది జ్వాల చూస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
PM Modi: ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
ప్రధాని మోదీ చేతికి నల్లదారం గమనించారా? అది మాములు దారం కాదు, ఆ రహస్యం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
Youtuber Anvesh:పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
పుచ్చకాయ వీడియోతో వివాదంలో ప్రపంచయాత్రికుడు అన్వేష్! సినీనటి కళ్యాణి ఫిర్యాదుతో ఏం జరగబోతోంది? స్పెషల్ ఇంటర్వూ!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
I Bomma: ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్! ఆధారాలుంటే చూపించండని పోలీసులకే షాకిచ్చిన రవి!
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Embed widget