Karthika deepam 2 serial today may 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన అనసూయమ్మ – తన భర్తను కాపాడమని కార్తీక్‌ను వేడుకున్న దీప
KARTHIKA DEEPAM 2 Serial Today Episode: నరసింహను పోలీసులు పట్టుకెళ్లడంతో అనసూయ కోపంగా దీప దగ్గరకు వచ్చి తిడుతుంది. గంటలో నా కొడుకు బయటకు రాకపోతే మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తుంది.
KARTHIKA DEEPAM 2 Telugu Serial Today Episode : బంటుగానికి కట్టు కట్టాక ఇక ఇంట్లోంచి పంపిచమని చెప్తారు. దీంతో పారిజాతం పంపనని దీప ఇక్కడే ఉన్నప్పుడు బంటు గాడు కూడా ఇక్కడే ఉంటాడని చెప్తుంది. అందరూ వద్దని వారించినా దీప ఇక్కడ ఉన్నంత వరకు బంటు గాడు ఇక్కడే ఉంటాడని చెప్తుంది. ఒకవేళ దీపను పంపిస్తే.. అప్పుడు బంటు గాడు కూడా వెళ్ళిపోతాడని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది పారిజాతం. తర్వాత దీపను సుమిత్ర పిలిచి శౌర్య స్కూల్ గురించి మాట్లాడాలి అని చెప్తుండగానే అనసూయమ్మ కోపంగా దీప అంటూ పిలిస్తూ వస్తుంది.
అనసూయమ్మ: అనుకున్నానే పేరుకు పక్కిల్లే కానీ నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావని అనుకున్నాను.
దీప: ఏమైందత్తయ్యా?
అనసూయమ్మ: నువ్వు నన్ను అలా పిలవొద్దు నీకు మాకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా? నీ బ్రతుకుని మేము ప్రశ్నించనప్పుడు మా బతుకుల్లోకి నువ్వెందుకు రావడం.
సుమిత్ర: చూడు నువ్వు ఈ మాట అడగాల్సింది దీపను కాదు. నీ కొడుకుని.. దీప కష్టానికి సాయంగా నిలబడాల్సింది పోయి.. వెళ్ళి కొడుకు పంచన చేరింది. అంటూ సుమిత్ర కోపంగా అనసూయను పిచ్చతిట్టుడు తిడుతుంది.
నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదని బెదిరిస్తుంది. దీంతో నాకు మీతో మాటలేంటని అనసూయమ్మ, దీపను తిట్టి నరసింహను పోలీసులకు పట్టించిన విషయం చెబుతుంది. దీంతో దీప షాక్ అవుతుంది. నువ్వు ఇప్పుడు పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే తప్పా వాడిని వదిలిపెట్టరు.
దీప: నేను ఎవరి మీద ఏ కేసు పెట్టలేదు అత్తయ్యా..
అనసూయ: నువ్వు కేసు పెట్టకపోతే నీపేరుతో పోలీసులు వచ్చి నరసింహను తీసుకెళ్లారు.
దీప: నేను మీకు చెప్పాను కదమ్మా కేసు పెట్టొద్దని..
సుమిత్ర: నేను ఎవరి మీద ఏ కేసు పెట్టలేదు దీప.. అయినా నీకు తెలియకుండా నీ తరపున కేసు ఎవరు పెడతారమ్మా
దీప: అదే అర్థం కావడం లేదమ్మా..
పారిజాతం: నాకు అర్థం అయింది. కావాల్సిన వాళ్లే పెట్టి ఉంటారు.
సుమిత్ర: కావాల్సిన వాళ్లు అంటే..
పారిజాతం: నాకు మనవడు.. నీకు కాబోయే అల్లుడు..
సుమిత్ర: ఊరికే ఏది పడితే అది మాట్లాడకండి అత్తయ్యా..
అనగానే జ్యోష్న కూడా పారిజాతం చెప్పింది నిజమే ఉంటుందని బావకు కాల్ చేసి అడగండి అని చెప్తుంది. దీంతో దశరథ్, కార్తీక్‌కు ఫోన్ చేస్తాడు. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో దీప ఇక ఎవరికీ ఫోన్ చేయ్యొద్దని.. ఇది నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను అనగానే అనసూయ మళ్లీ దీపను తిట్టి నువ్వు వస్తే నా కొడుకు బయటకు రాడు.. ఆ కార్తీక్ వస్తేనే నా కొడుకు బయటకు వస్తాడని చెప్పి గంటలో నా కొడుకు బయటకు రాకపోతే మీ అందరి పరువు తీస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది అనసూయమ్మ. తర్వాత దీప, కార్తీక్ వాళ్ల ఇంటికి వెళ్లి కార్తీక్‌ను నిలదీస్తుంది.
దీప: కార్తీక్ బాబు నా భర్త మీద పోలీస్ కేసు పెట్టారా?
కార్తీక్: అవును నేనే పెట్టాను
దీప: ఎందుకు పెట్టారు..? ఎవరిని అడిగి కేసు పెట్టారు? నేను కేసు పెట్టమని నీతో చెప్పానా?
కార్తీక్: మీరు చెప్పలేదు కాబట్టే ఇన్ని రోజులు ఊరుకున్నాను. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు.
అనగానే దీప బాధగా తన అత్తయ్య ఇచ్చిన వార్నింగ్ గురించి చెప్తుంది. మీరు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరసింహను విడిపించకపోతే మీ అత్తింటి పరువు బజారున ఉంటుంది. అని చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇంట్లో అందరూ చెప్పగానే నరసింహను విడిపించడానికి కార్తీక్, దీపతో కలిసి స్టేషన్‌కు వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'కల్కి 2898 AD' ప్రభాస్ బుజ్జిని చూశారా? - ఇదిగో ఈ స్పెషల్ వీడియో చూసేయండి!