అన్వేషించండి

Prabhas Kalki 2898 AD: 'కల్కి 2898 AD' ప్రభాస్ బుజ్జిని చూశారా? - ఇదిగో ఈ స్పెషల్‌ వీడియో చూసేయండి!

Introducing Bujji From Kalki 2898 AD:పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బుజ్జి వీడియో వచ్చేసింది. కొద్ది రోజులుగా బుజ్జి బుజ్జి అంటూ 'కల్కి 2898 AD' టీం ఊరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Introducing Bujji From Prabhas Kalki 2898 AD: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బుజ్జి వీడియో వచ్చేసింది. కొద్ది రోజులుగా బుజ్జి బుజ్జి అంటూ 'కల్కి 2898 AD' టీం ఊరిస్తూ వస్తుంది. మన డార్లింగ్‌ ప్రభాస్‌ అయితే మన బుజ్జిని పరిచయం చేసేవరకు వేయిట్‌ చేయలేకపోతున్నా అంటూ ఫ్యాన్స్‌లో‌ క్యూరియాసిటి పెంచాడు. దాంతో ఇంతకి బుజ్జి ఎవరా అని ఆరా తీశారు. ఇక చివరిగా బుజ్జి ఎవరో క్లారిటీ ఇవ్వకుండా చిన్న శాంపుల్‌ వీడియోతో హింట్‌ ఇచ్చింది మూవీ టీం. ఇక బుజ్జి అంటే కల్కి సినిమాలో ప్రభాస్‌ వాడే కారు అని తేలిపోయింది. అయితే కారుని మాత్రం చూపించలేదు. ఈ క్రమంలో నేడు(మే 22) రామోజీ ఫిలింలో గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించి ఏకంగా బుజ్జినే లైవ్‌లోకి దింపింది మూవీ టీం.

ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ కల్కి లుక్‌లో సందడి చేశాడు. ఇక ఈ సినిమాలో వాడే తన కారును (బుజ్జిని) కూడా లైవ్‌లోకి తీసుకువచ్చారు. అక్కడ విశాలమైన గ్రౌండ్‌ ఆ కారు నడుపుతూ ప్రభాస్‌ తెగ సందడి చేశాడు. ఇక తాజాగా మూవీ టీం కూడా బుజ్జికి సంబంధించిన స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది. అయితే ఈ వీడియోను అన్ని భాషల్లో మిక్స్‌ చేసి రిలీజ్‌ చేయడంతో ఆడియన్స్‌ అంతా కాస్తా కన్‌ఫ్యూజ్‌నికి గురయ్యారు. కానీ బుజ్జిని చూసి మాత్రం ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక ప్రభాస్‌ బుజ్జికి మహానటి కీర్తి సురేష్‌ వాయిస్‌ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం బుజ్జి వీడియోను ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

కాగా కల్కి సినిమా కోసం నాగ్‌ అశ్విన్‌ స్పెషల్‌గా కారును తయారు చేయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం వ్యాపార దిగ్జం టెక్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా సాయం తీసుకున్నారు. ఆయన టైర్ల కంపెనీ తీసుకుని ప్రత్యేకంగా ఈ కారు డిజైన్‌ చేయించారు. ఈ సినిమాలో ఈ వాహనం కీలకం కానుంది. ఎందుకంటే కల్కి మూవీ సోషియో ఫాంటసి, సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా అనే విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌ టైం ట్రావేల్‌ చేస్తాడట. అంటే ఈ కారు ద్వారానే ఒక లోకం నుంచి మరో లోకం ప్రయాణం చేస్తాడని టాక్‌. ఇక బుజ్జి పరిచయం చేసేందుకు మూవీ టీం ప్రమోషన్స్‌ని భారీగానే ప్లాన్‌ చేసింది.

Also Read: పవిత్ర నా భర్తను బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరుచుకుంది - చందు భార్య షాకింగ్‌ కామెంట్స్‌

రామోజీ ఫిలిం సిటీ గ్రాండ్‌ ఈవెంట్‌ని నిర్వహించి ఏకంగా గ్రౌండ్‌లోకి బుజ్జినే దింపాడు నాగ్‌ అశ్విన్‌. ఇలా వినూత్నంగా మూవీ ప్రమోషన్స్‌ చేసి కల్కిపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది మూవీ టీం. ఇదిలా ఉంటే సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి భారీ తారగణం నటిస్తుంది. ఇండియాలోనే అత్యంతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ విజువల్‌ వండర్‌ రూపొందిస్తున్నాడు. ఇందులో కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. దాదాపు రూ. 500 నుంచి రూ. 600 కోట్ల వ్యయంతో సినిమాను నిర్మిస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక కల్కి సినిమాను జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Rajinikanth Biopic: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ జర్నీ... వెండితెరపైకి రజనీకాంత్ ఆత్మకథ
బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ జర్నీ... వెండితెరపైకి రజనీకాంత్ ఆత్మకథ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget