అన్వేషించండి

Karthika deepam 2 Serial Today August 29th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: కాశీకి రాఖీ కట్టిన దీప – జ్యోత్స్న తో రాఖీ కట్టిస్తానన్న పారిజాతం

Karthika deepam 2 Today Episode: జ్యోత్స్న తో కాశీకి రాఖీ కట్టిస్తానని రేపు కాశీని ఇంటికి తీసుకురమ్మని పారిజాతం చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Karthika deepam 2 Serial Today Episode: ఇల్లు రిజిస్ట్రేషన్‌ కు రేపే వెళ్దామని అనసూయ, దీపకు చెప్తుంది. దీప ఎందుకులే అత్తమ్మ అన్నా తర్వాత కార్తీక్‌ చెప్పడంతో ఒప్పుకుంటుంది. అయితే కార్తీక్‌, దీప క్లోజ్‌ గా మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది. కోపంతో రగిలిపోతుంది. మరోవైపు కొడుకు దాసును కలిసి పారిజాతం ఎమోషనల్‌ అవుతుంది. నీ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నీ విషయంలో జరిగిన పొరపాటు నా మనవడి విషయంలో జరగకూడదు. రేపు రాఖీ పండుగ కదా కాశీని ఇంటికి తీసుకురా జ్యోత్స్నతో రాఖీ కట్టిస్తానని అంటుంది.

దాసు: నన్నే ఆ ఇంటికి  రానివ్వలేదు ఇప్పుడు నా కొడుకుని రానిస్తారా? జ్యోత్స్నకు కాశీ తమ్ముడని చెప్తున్నావా? అసలు రాఖీ కడుతుందా? నాకు ఎలాంటి అవమానం జరిగినా పరవాలేదు కానీ నా కొడుక్కి జరిగితే తట్టుకోలేను.

పారిజాతం: నేను అన్నీ ఆలోచించే రమ్మని పిలుస్తున్నాను దాసు.

దాసు: సరే తీసుకొస్తాను కానీ నేను నీకో విషయం చెప్పాలి అమ్మా..

అని పారిజాతాన్ని సస్పెన్స్ లో పెట్టేసి వెళ్ళిపోతాడు. నేను బిడ్డల్ని మార్చిన విషయం తెలిసిందేమోనని పారిజాతం టెన్షన్ పడుతుంది. మరోవైపు శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి ఎగురుతుంటే అనసూయ కంగారుగా తనను ఆపుతుంది. దీప అడిగితే కంగారులో నిజం చెప్పబోయి.. మాట మారుస్తుంది అనసూయ. రేపు మేము ఊరు వెళ్తున్నామని సుమిత్రమ్మ దగ్గర ఉండమని శౌర్యకు  చెప్తుంది అనసూయ. శౌర్యతో అనసూయ ప్రేమగా మాట్లాడటం చూసి దీప హ్యపీగా ఫీలవుతుంది. తర్వాత పారిజాతం, శివనారాయణ దగ్గరకు వెళ్లి రేపు నా మనవడికి నా మనవరాలితో రాఖీ కట్టించాలని అనుకుంటున్నానని చెప్తుంది.

శివ: దాసునే ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అంటే మళ్ళీ వాడి కొడుకును ఇంటికి తీసుకొస్తానంటావేంటి?

పారిజాతం: రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన అబ్బాయి ఎవరో కాదు నా మనవడు. యాక్సిడెంట్ సమయంలో అతడిని జ్యోత్స్న వదిలేసి వెళ్లిపోయిందని కార్తీక్  కోపంగా ఉన్నాడు. అదే కాశీకి జ్యోత్స్న రాఖీ కడితే కార్తీక్ మనసు మారుతుంది. జ్యోత్స్న మీద ప్రేమ పెరుగుతుంది.

శివ: సరే అయితే నీ ఇష్టం..

 అంటూ శివనారాయణ ఒప్పుకోవడంతో పారిజాతం సంతోషంగా వెళ్ళిపోతుంది. మరోవైపు దీప, అనసూయ మాట్లాడుకుంటుంటారు.

దీప: అత్తయ్యా మరోసారి ఆలోచించు నాకెందుకో భయంగా ఉంది అత్తయ్యా..

అనసూయ: నువ్వేం భయపడకు దీప. అది నీ ఇల్లు.. మీ నాన్న ఆస్థి వాడొచ్చి అమ్మేసుకుంటానంటే ఎలా చూస్తూ ఊరుకుంటాము చెప్పు. మీ నాన్న ఆస్థి నీకు మాత్రమే చెందాలి. ఆ విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ల నాలుక చీరేస్తాను.

దీప: అది కాదు అత్తయ్యా నేను చెప్పేది కూడా మీరు ఒకసారి వినండి.

అనసూయ: ఈ విషయంలో నేను రెండో మాట వినను అంటే వినను దీప. వీలైనంత త్వరగా ఆ ఇంటిని నీ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిందే..

 అని ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరుతుంటే ఇంతలో దాసు, కాశీ వస్తారు. వాళ్లను చూసిన దీప చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అయితే దాసు వాళ్ళు తన కోసం వచ్చారని దీప అనుకుంటుంది. కానీ దాసు కాదని చెప్పి  పారిజాతం తన తల్లి అని చెప్పడంతో దీప షాక్‌ అవుతుంది. ఇంతలో కాశీ ఈరోజు రాఖీ పండుగ కదా నీ చేత్తో నాకు రాఖీ కట్టు అక్కా అంటాడు. దీప సంతోషంగా కాశీకి రాఖీ కడుతుంది. తర్వాత స్వప్న, కాశీ ల ప్రేమ గురించి తలుచుకున్న దీప కార్తీక్ బాబు చాలా పెద్ద సమస్యలో పడ్డారని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: కౌషికి స్టేషన్ కు వెళ్లకుండా ఆపిన ధాత్రి – పరంధామయ్యను మర్డర్ చేసిన హంతకుల్ని పట్టుకున్న ధాత్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget