Jagadhatri Serial Today August 29th: ‘జగధాత్రి’ సీరియల్: కౌషికి స్టేషన్ కు వెళ్లకుండా ఆపిన ధాత్రి – పరంధామయ్యను మర్డర్ చేసిన హంతకుల్ని పట్టుకున్న ధాత్రి
Jagadhatri Today Episode: పరంధామయ్య మర్డర్ కేసులో నిందితుల్ని ధాత్రి, కేదార్ కనిపెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ధాత్రి, కేదార్ వెళ్లి కీర్తిని స్టోర్ రూం నుంచి తీసుకుని వస్తారు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి కౌషికిని కస్టడీలోకి తీసుకోమ్మని మా ఎస్సై గారు చెప్పారని.. కౌషికిని స్టేషన్‌కు వెళ్దామని అడగ్గానే ధాత్రి ఆగండని కండీషన్ బెయిల్ మీద బయట ఉన్నవాళ్లు పోలీసుల సమక్షంలో వేరే కేసులో ఉంటే సంతకం చేయకపోయినా పర్వాలేదని నేను విన్నాను. అని ధాత్రి చెప్తుంది. అయితే అంతకుముందే కౌషికి చేత పెట్రోలింగ్ పోలీసులకు కౌషికి చేత కీర్తి మిస్సింగ్ కంప్లైంట్ ఇప్పిస్తుంది ధాత్రి. అదే విషయం మీరు కన్‌ఫం చేసుకోండని కానిస్టేబుల్ కు చెప్తుంది. దీంతో కానిస్టేబుల్ వివరాలు తెలుసుకుని వెళ్లిపోతాడు. తర్వాత కేదార్ పరంధామయ్య మర్డర్ గురించి ఆలోచిస్తుంటాడు.
ధాత్రి: వదిన బెయిల్ గురించి ఆలోచిస్తు్న్నావా? కేదార్.
కేదార్: అవును ధాత్రి. రేపు సాయంత్రం లోపు మనం నిజం కనుక్కుని నేరస్థుడు ఎవరని తెలుసుకోవాలి లేకపోతే అక్క పరువుతో పాటు కంపెనీ కూడా చేజారిపోతుంది.
ధాత్రి: వదిన బాధ, ప్రేమ, త్యాగం ఇవన్నీ ఇంట్లో వాళ్లకు ఎందుకు అర్థం కావడం లేదు కేదార్. మధ్యలో వచ్చిన మనకే ఇంతలా అర్థం అవుతుంటే మరి వాళ్లేందుకు చూడలేకపోతున్నారు.
కేదార్: వాళ్లు అక్కను పక్కన పెట్టి ఆస్థిని కోరుకున్న ప్రతిసారి అక్క పడే బాధ వాళ్లకు అర్థం కావడం లేదు ధాత్రి.
ధాత్రి: వదిన ప్రేమ ఇచ్చి అలసిపోయిన రోజే ఇంట్లో వాళ్లకు ఆమె ప్రేమ అర్థం అవుతుంది.
అంటూ ఇద్దరూ కలిసి కౌషికిని ఎలా కాపాడుకోవాలా? అని ఆలోచిస్తారు. ఎలాగైనా రేపు సాయంత్రం వరకు నేరస్థుడిని పట్టుకుందామని డిసైడ్ అవుతారు. ముందు మనం యువరాజ్, కమలాకర్ అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటే హత్య ఎవరు చేశారో తెలుసుకోవచ్చని నిర్ణయం తీసుకుంటారు. మరుసటి రోజు పరంధామయ్య ఇంటికి వెళ్తారు ధాత్రి, కేదార్.
ఆదిలక్ష్మీ: ఆగండి భాగ్య ఎవరు వీళ్లు..?
భాగ్య: పోలీసులు అమ్మా..
ఆదిలక్ష్మీ: మీ పోలీసులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా ఆయన్ని చంపినొళ్లని మాత్రం పట్టుకోవడం లేదు.
ధాత్రి: మీ బాధని కోపాన్ని ఆవేశాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ కేసు రోజు రోజుకు చాలా కాంప్లికేటెడ్ గా మారుతుంది.
కేదార్: హంతకుల్ని పట్టుకోవడం మీకు ఎంత ఇంపార్టెంటో మాకు అంతే ఇంపార్టెంట్..
ఆదిలక్ష్మీ: పట్టుకున్న హంతకురాలిని వదిలేసి ఇంకెవర్ని పట్టుకుంటారండి.
ధాత్రి: మీ కోడలి గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. నిజమైన హంతకుడు దొరికినప్పుడు మీరు చాలా బాధపడతారు.
భాగ్య: సరే మేడం ఇప్పుడు ఏం కావాలి
అని అడగ్గానే మీ ఇంటిని ఒకసారి సెర్చ్ చేయాలి అంటుంది ధాత్రి. దీంతో ఆదిలక్ష్మీ, భాగ్య సరే అంటారు. ధాత్రి, కేదార్ ఇంటిని సోదా చేస్తుంటారు. వాళ్లకు ఒక బ్యాగులో దేవుడి విగ్రహం, డబ్బు, నగలు కొన్ని సర్టిఫికెట్స్ దొరుకుతాయి. వాటి గురించి ఆరా తీస్తారు. తర్వాత కారులో వెళ్తూ.. ధాత్రి ఈ హత్య యువరాజ్ చేయలేదని.. కానీ విగ్రహం కోసం యువరాజ్, కమలాకర్ ఆ ఊరికి వచ్చారని జరిగిందంతా కరెక్టుగా గెస్ చేస్తుంది ధాత్రి. తర్వాత మర్డర్ జరిగిన రోజు ఫోటోలు చూస్తూ.. ఒక ఎవిడెన్స్ ను గ్యాదర్ చేస్తుంది. భాగ్యకు లవ్ లెటర్ రాసిన గణేష్‌ను అనుమానిస్తుంది. వెంటనే గణేష్‌ను పట్టుకుని కొడుతూ పరంధామయ్యను ఎందుకు చంపావు అని అడుగుతుంటే భాగ్య దొంగచాటుగా చూస్తుంది. దీంతో ధాత్రి, భాగ్యను చూసి పిలుస్తుంది. చంపింది మీరే అని తెలిసిపోయింది. కానీ ఎందుకు చంపారో చెప్పండి అని ధాత్రి అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘సత్యభామ’ సీరియల్ టైమింగ్ మార్పు - ఆ తేదీ నుంచి ‘గుప్పెడంత మనసు’కు ఎండ్ కార్డ్?