Jagadhatri Today January 4th: 'జగద్ధాత్రి' సీరియల్: అందరి ముందు సాక్ష్యాలు బయటపెట్టిన ధాత్రి దంపతులు.. కేదార్ ని చంపేయాలని చూస్తున్న యువరాజ్!
Jagadhatri Today Episode : సమస్యకు పరిష్కారం కేదార్ వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోవడం కాదు అసలు ఆ కేదార్ గాడిని లోకంలో నుంచి పంపించేయాలి అని యువరాజ్ అనుకోవటంతో కథ లో ఉత్కంఠ ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నిజం నిరూపిస్తే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం అని అక్కతో ఛాలెంజ్ చేస్తాడు కేదార్.
కౌషికి : నాతో చాలెంజ్ చేసి తప్పు చేశారు ఎలాగైనా నిజాన్ని నిరూపించి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ధాత్రి: వదినతో ఎందుకు చాలెంజ్ చేసావ్, జరగని పెళ్ళికి లేని సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెస్తాం అంటుంది.
ఆ తర్వాత ఎక్సర్సైజులు చేస్తున్న కేదార్ దగ్గరికి వచ్చి మనం ఒక గేమ్ ఆడుకుందామా నేను ఒక పంచ్ ఇస్తాను, నువ్వు కింద పడిపోకపోతే అప్పుడు నాకు ఒక పంచ్ ఇవ్వు అంటాడు బూచి.
కేదార్: వద్దులే బావ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బూచి ఆపి ఏంటి నా మీద జాలి చూపిస్తున్నావా అని అడుగుతాడు.
ధాత్రి కూడా వద్దని చెప్తుంది అయినా అవి వినిపించుకోకుండా బూచి కేదార్ కి పంచ్ ఇస్తాడు. కేదార్ ఒక ఇంచ్ కూడా కదలడు సరి కదా బూచి చెయ్యే నొప్పి పుడుతుంది. అప్పుడు కేదార్ పంచ్ ఇచ్చేసరికి బూచి కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి.
ధాత్రి : ఏంటన్నయ్య కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి అని నవ్వుదాచుకుంటూ అడుగుతుంది.
బూచి: పొద్దున్నుంచి ఏం తినలేదు అమ్మ అని కవర్ చేసుకుంటూ కీర్తిని తనని ఇంటి లోపటికి తీసుకు వెళ్ళమని అడుగుతాడు.
వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లిపోయిన తర్వాత ధాత్రి దంపతులిద్దరూ బూచి కండిషన్ కి నవ్వుకుంటారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ధాత్రికి డాక్యుమెంట్స్ ఎవరు కొన్నారు అని అడిగారు కదా మేడం ఆ ప్రూఫ్ తీసుకొచ్చాను అని ప్రూఫ్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు.
కేదార్ : మనం అనుకున్నట్లే అయింది ఇది యువరాజ్ పనే, వాడికి మనం అంటే కోపం అని తెలుసు కానీ మరి ఇంత కోపం అని తెలియదు అంటాడు.
ధాత్రి: పదండి ఇప్పుడే మావయ్య గారికి సాక్షాలతో సహా మనం తప్పు చేయలేదని నిరూపిద్దాం అనటంతో ఇద్దరు అక్కడినుంచి సుధాకర్ దగ్గరికి వెళ్తారు.
సుధాకర్ కి సాక్ష్యాలు చూపించి నా భర్త ఈ ఇంటికి మంచి చేసే వాడే గాని చెడు చేసేవాడు కాదు అని చెప్తుంది ధాత్రి.
సుధాకర్: సాక్ష్యాలు చూసి కోపంతో ఊగిపోతాడు యువరాజ్ ని పిలిచి ఫైల్లో డాక్యుమెంట్స్ పెట్టింది నువ్వే కదా అని అడుగుతాడు.
యువరాజ్: నేను కాదు అంటాడు.
అప్పుడు సుధాకర్ సాక్ష్యం చూపించి ఇది నీ సంతకమే కదా అని చెప్పి కోపంతో యువరాజ్ చెంప పగలగొడతాడు.
వైజయంతి భర్తని మందలిస్తుంది.
నిషిక: నా భర్తనే కొడతారా అయినా ఆయనే సంతకం చేశారని ఏంటి సాక్ష్యం అని అడుగుతుంది.
ధాత్రి : ఈ పని నేను చేయలేదు అని యువరాజ్ ని చెప్పమనండి సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్తుంది.
ఆ మాటలకి కంగారు పడిన యువరాజ్ ని చూసి నీ కంగారే చెప్తుంది నువ్వు ఈ తప్పుడు పని చేశావని. ఇలా చేస్తావ్ అని అనుకోలేదు అని కౌషికి కూడా యువరాజ్ ని మందలించి లోపలికి పొమ్మంటుంది.
నిషిక : ఎంత తప్పు చేస్తే మాత్రం ఇలా కొడతారా అయినా ఈ ఇంట్లో బయటవాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది అని చెప్పి కోపంగా అత్తా కోడలు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సుధాకర్ కేదార్ కి క్షమాపణ చెప్తాడు.
క్షమాపణలు ఎందుకు మేము యువరాజ్ ని చెడ్డవాడిని చేయడానికి ఇదంతా చేయలేదు మా తప్పేమీ లేదు అని నిరూపించుకోవటానికి ఇదంతా చేసాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధాత్రి దంపతులు.
గదిలో యువరాజ్ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ధాత్రివాళ్ల వల్లే వచ్చింది అంటాడు యువరాజు వాళ్ళ బాబాయ్. వైజయంతి, నిషిక కూడా ధాత్రి వాళ్ళని కౌషికిని తిట్టుకుంటారు.
యువరాజ్: చెంప తడుముకుంటూ దక్కాల్సిన బహుమానం తగ్గింది కదా ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ అంతా అని చిరాకు పడతాడు.
నిషిక: వాళ్లని ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అంటుంది.
యువరాజ్: వాళ్లని పంపించాల్సిందే ఇంట్లోంచి కాదు ఆ కేదార్ గాడిని ఈ లోకంలోంచి పంపించేయాలి అని మనసులో అనుకుంటాడు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.