Jagadhatri January 3rd Episode: 'జగద్ధాత్రి' సీరియల్: చిన్న ప్లాన్ తో ఆపద నుంచి గట్టెక్కిన ధాత్రి - నిజం నిరూపిస్తానంటూ చాలెంజ్ చేసిన కౌషికి!
Jagadhatri Today Episode: పెళ్లి కాలేదు అని కౌషికి వాదిస్తుంది అదే విషయాన్ని నిరూపించమని కేదార్ చెప్తాడు. నిజం నిరూపిస్తానంటూ కౌషికి, నిరూపిస్తే ఇంట్లోంచి వెళ్లిపోతాను అంటూ కేదార్ ఛాలెంజ్ చేస్తుంది.
Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సరే ఇప్పటికే ఆలస్యం అయింది వచ్చి పీటల మీద కూర్చుండి అని కేదార్ వాళ్ళకి చెప్తుంది కౌషికి.
కూర్చోవడానికి ధాత్రి వాళ్లు ఆలోచిస్తుంటే దగ్గరుండి ఇద్దరినీ పీటల మీద కూర్చో పెడుతుంది.
కౌషికి: మేము మీ పెళ్లి చూడలేదు కదా ఇదే పెళ్లి అని భావిస్తున్నాము అంటూ కేదార్ ని నల్లపూసల తాళి తీసుకొని ధాత్రి మెడలో వేయమంటుంది.
ధాత్రి: లేట్ అయిపోయింది ఈ ఫంక్షన్ పోస్ట్ పోన్ చేస్తుందేమో అనుకున్నాను కానీ వదిన పట్టు వదలటం లేదు అని అనుకుంటూ కంగారు పడుతుంది.
సరిగ్గా కేదార్ ధాత్రి మెడలో తాళి కట్టే సమయానికి నిషిక గిఫ్ట్ ఓపెన్ చేసేసరికి పాము బొమ్మ బయటికి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయ్యి అరుస్తుంది నిషిక. అందరూ కంగారుగా అటువైపు చూసేసరికి ధాత్రి కేదార్ చేతిలో తాళి తీసుకొని ముడులు వేసుకొని తన మెడలో వేసుకుంటుంది.
కంగారుగా వచ్చిన నిషిక ని ఏమైంది అని అందరూ అడుగుతారు.
నిషిక: ఆ బాక్స్ లో పాము ఉంది. వదిన గిఫ్ట్ ఇచ్చిందని ఎందుకు చెప్పావు అని ధాత్రిని అడుగుతుంది.
కౌషికి: నేను ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు అని అయోమయంగా చెప్తుంది.
ధాత్రి: కీర్తి కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను నీకు చెప్తే ప్లాన్ స్పాయిల్ అయిపోతుందని అలా అబద్ధం చెప్పాను అంటుంది.
అప్పుడే ధాత్రి మెడలో తాళి ఉండటం గమనిస్తుంది కౌషికి.
కౌషికి: నీ మెడలోకి ఆ తాళి ఎలా వచ్చిందిఅని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ధాత్రి: అదేంటి ఇప్పుడే కేదార్ కట్టాడు కదా అంటుంది.
ఈ నల్లపూసల ఫంక్షన్ నుంచి తప్పించుకోవటం కోసమేనా ఆ గిఫ్ట్ ప్లాన్ వేసావు అని అనుకుంటుంది కౌషికి. ఏమీ చేయలేక వాళ్లని ఆశీర్వదిస్తుంది.
అంతలోనే యువరాజ్ రావడంతో వాళ్లతో కూడా నల్లపూసల ఫంక్షన్ పూర్తి చేయిస్తారు కౌషికి వాళ్ళు.
ఆ తర్వాత రూమ్ లో కూర్చుని తాళి చూసుకుంటూ ఉంటుంది ధాత్రి. అక్కడికి వచ్చిన కేదార్ మంచి ప్లాన్ వేసావు లేదంటే దొరికిపోయే వాళ్ళం. అంత ప్రజర్ లో కూడా నీ బుర్ర బాగా పనిచేసింది అని మెచ్చుకుంటాడు.
ధాత్రి: ప్రజర్ లో ఉన్నప్పుడే నా బుర్ర మరింత ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకుంటూ తాళి వైపు చూస్తుంది. అమ్మ తప్పు చేయలేదు అని నిరూపించే వరకు ప్రేమ పెళ్లి అనేది నా జీవితంలోకి రానివ్వకూడదు అనుకున్నాను. కానీ అనుకోకుండా నా చేతులతో నేనే మెడలో తాళి,నల్లపూసలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది.
కేదార్: అలా ఎందుకు అనుకుంటావ్ ఇప్పుడు చెప్పు నా చేతులతో కట్టమంటే నేను తాళి కట్టేస్తాను అంటాడు. ఆ మాటలకి నవ్వుతుంది ధాత్రి. ఏదో ఒక రోజు ఈ మాట నీ కళ్ళల్లోకి చూసి చెప్తాను అని మనసులో అనుకుంటాడు కేదార్.
మరోవైపు కీర్తి ధాత్రి తాళి తన మెడలో తనే వేసుకుంది అని తల్లికి చెప్తుంది. విషయం అర్థం చేసుకున్న కౌషికి వీళ్ళు అబద్ధం చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు ఎలాగైనా వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని ధాత్రి వల్ల రూమ్ కి వస్తుంది.
అప్పటివరకు ఫ్రెండ్స్ లా మాట్లాడుకున్న ధాత్రి వాళ్లు కౌషికి ని చూడగానే భార్యాభర్తల్లాగా మాట్లాడుకుంటారు.
కౌషికి: మీ నటనకి నా జోహార్లు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా నిజంగానే భార్య భర్తలు అనుకుంటారు.
ధాత్రి: మేము నిజంగానే భార్యాభర్తలం. మేము భార్యాభర్తలం కాదు అనటానికి సాక్ష్యం ఏముంది అంటుంది.
కౌషికి: ఉంది అంటూ కూతుర్ని తీసుకువచ్చి ఆమె చేతే నిజం చెప్పిస్తుంది.
ధాత్రి: తను ఏదో చూసి ఏదో అనుకుంటుంది. మేము నిజంగానే పెళ్ళి చేసుకున్నాము అంటుంది.
కౌషికి: నువ్వు తప్పించుకోవడానికి నా కూతురు మీద నెపం వేయకు నా కూతురికి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకోలేదు అని నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ అంటుంది.
కేదార్: నువ్వు అలా నిరూపించినట్లయితే మేమే ఇంట్లోంచి వెళ్ళిపోతాము ఇది నా చాలెంజ్ అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.