అన్వేషించండి

Jagadhatri December 20th Episode - 'జగద్ధాత్రి' సీరియల్: నిషికకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కౌషికి, మీనన్ ట్రాప్ నుంచి తప్పించుకున్న ధాత్రి దంపతులు!

Jagadhatri Today Episode : మీనన్ ధాత్రి వాళ్ళని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ గ్రహించి ధాత్రి దంపతులు తప్పించుకోవటంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి 

Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను ఎంత కష్టపడి వంట చేశాను తినకుండా వెళ్ళిపోతే ఎలా? తినండి అంటుంది నిషిక.

 కౌషికి : బాగోలేని తిండిని ఎలా తినమంటావు.

ధాత్రి : నేను నీకు వంట మెల్లిగా నేర్పిస్తాను ఇప్పుడు వాళ్ళు ఆకలి మీద ఉన్నారు వెళ్ళనీ.

నిషిక : నా విషయంలో నిన్ను తల దూర్చొద్దని చెప్పాను  కదా అని కోప్పడుతుంది. మళ్లీ తల్లి మాటలు గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోతుంది. సరే రెస్టారెంట్ కి వెళ్దాం కానీ కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్దాం.

ధాత్రి : మాక్కూడా పని ఉంది మేము రావటానికి కుదరదు అంటుంది.

దాంతో అందరూ రెస్టారెంట్ కి బయలుదేరుతారు.

ఇంట్లోనే ఉండిపోయిన కేదార్ ధాత్రితో ఆకలిగా ఉంది అంటాడు.

ధాత్రి : ఐదు నిమిషాలు ఆగితే వంట చేసి పెడతాను, లేదంటే నిషిక వంట ఉంది కదా అది తిను అని నవ్వుతుంది.

కేదార్: నేను బ్రతకటానికి తినాలనుకుంటున్నాను చావటానికి కాదు అయినా ఇంట్లో వంట తిని బోర్ కొడుతుంది పదా మనం కూడా బయటికి వెళ్లి భోజనం చేద్దాం అనటంతో ఇద్దరూ రెస్టారెంట్ కి బయలుదేరుతారు.

ఇంతలో సీనియర్ ఫోన్ చేసి ఎలక్షన్స్ లో పంచడానికి పెద్ద మొత్తంలో డబ్బులు మారుతుంది మీరు వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పి లొకేషన్ షేర్ చేస్తాడు.

మరోవైపు హోటల్లో దివ్యాంక, సురేష్ భోజనం చేస్తూ ఉంటారు. అదే రెస్టారెంట్ కి కౌషికి వాళ్ళు వస్తారు. కౌషికి వాళ్ళిద్దర్నీ చూసి ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ లో కూర్చోవాలి అనుకుంటుంది.

నిషిక :  మిమ్మల్ని అంత ప్రశాంతంగా ఎందుకు ఉండనిస్తాను అని మనసులో అనుకుంటూ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది వదిన, వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడే కూర్చుందాం అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సురేష్ వాళ్ళ ఆపోజిట్ టేబుల్ మీద కూర్చుంటారు.

అది గమనించిన దివ్యాంక సురేష్ తో చనువుగా ఉన్నట్లు ప్రవర్తిస్తుంది. మీలాంటి భర్తని వదులుకున్నందుకు మీ ఆవిడ మీద జాలేస్తోంది అంటూ సురేష్ నోటికి అంటుకున్న ఎంగిలిని తుడవటం కోసం అని సురేష్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంది. అది చూసిన కౌషికి ఇరిటేటింగ్ ఫీల్ అవుతుంది.

నిషిక కౌషికి పరిస్థితిని చూసి శాడిస్టులాగా నవ్వుకుంటూ ఉంటుంది.

కౌషికి: మీరు ఇక్కడ భోజనం చేయండి నేను మాత్రం భోజనం చేయలేను వేరే కౌంటర్లో చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే దివ్యాంక వస్తుంది.

దివ్యాంక : అరే మీరు ఎప్పుడు వచ్చారు అని సురేష్ ని పిలిచి ఈయనకి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది ఫంక్షన్ చేస్తున్నాము నువ్వు రా అని కౌశికిని ఇన్వైట్ చేస్తుంది.

కౌశికి : ఊర్లో జరిగే ప్రతి చీప్ ఫంక్షన్ కి వచ్చే అంత టైం నాకు లేదు అని అక్కడినుంచి వెళ్ళిపోతే నిషిక అడ్డొచ్చి ఇక్కడే కూర్చుందాం అంటుంది.

కౌషికి : ఆమెకి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.. ఇప్పటికే చాలా చేశావు ఇంక తగ్గించు.. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే నాకు నచ్చదని తెలిసి కూడా చాలా చేస్తున్నావు అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందరూ ఆమెని ఫాలో అవుతారు.

నిషిక : నన్ను అందరి ముందు ఇంతలా అవమానిస్తావు కదా నిన్ను ఆ జగద్ధాత్రిని ఇంతకింత అవమానపడేలాగా చేస్తాను అనుకుంటుంది.

అంతలో ధాత్రి వాళ్ళు ఆపరేషన్ కోసం అదే రెస్టారెంట్ కి వస్తారు. నిషిక వాళ్ళని చూస్తుంది. వాళ్లేనా కాదా అని తెలుసుకోవడానికి వెళుతుంది ఇంతలో వెనకే యువరాజ్ కూడా వస్తాడు.

యువరాజ్ :ఎక్కడికి వెళ్తున్నావు

నిషిక : ధాత్రి వాళ్లు ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నారు.

యువరాజ్ : పోలీసులు ఎవరో తెలుస్తుంది అని భాయ్ అన్నారు... కరెక్టుగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళు పోలీసుల అని అనుమాన పడతాడు.

నిషిక తమ దగ్గరికి వస్తుందని గ్రహించిన ధాత్రి వాళ్లు ఆమె నుంచి తప్పించుకోవటం కోసం మొహాలు కనిపించకుండా ఇద్దరు కలిసి కిస్ చేసుకుంటారు. అది చూసిన నిషిక మొహాలు చూడకుండానే వాళ్ళని అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యువరాజ్ అడిగితే వాళ్ళు ధాత్రి వాళ్ళు కాదు.. ఎవరిని చూసి ఎవరో అనుకున్నాను అంటుంది.

ఆ తర్వాత ధాత్రి వాళ్ళు రిలాక్స్ అవుతారు.. రౌడీలని వెతుకుతూ ఉంటే వాళ్ళని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు మనుషులు కనిపిస్తారు. ముఖాలకి కర్చీఫ్లు కట్టుకుంటారు.

మొహం కనిపించడం లేదు ఎలా అనుకుంటారు.. రౌడీలు ఒక రౌడీ సిసి ఫొటోస్ ఉంది కదా అందులో చూద్దాం అంటాడు. ధాత్రి కూడా అక్కడ సిసి ఫుటేజ్ ఉండడం చూసి కౌంటర్ దగ్గరికి వెళ్లి ఫుడ్ పార్సిల్  ఇస్తుంది అతను పార్సిల్ చెప్పటానికి  లోనికి వెళ్తాడు ఇంతలో కంప్యూటర్లో ఉన్న సిసి ఫుటేజ్ డిలీట్ చేసేస్తుంది.

తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఎలాంటి డబ్బు మార్పిడి జరగడం లేదు మనల్ని పట్టుకోవడానికి మీనన్ వేసిన ప్లాన్ ఇది అంటుంది ధాత్రి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget