అన్వేషించండి

Jagadhatri Serial Today September 30th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిపై వైజయంతి కుట్ర! బూచి నిజంగానే ఆ తప్పుడు పని చేశాడా?

Jagadhatri Serial Today Episode September 30th శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపిచాలని వైజయంతి తాగిన మైకంలో ఉన్న బూచి శ్రీవల్లి మీద అఘాయిత్యం చేశాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సురేశ్ తప్పు చేశాడని నిషిక మాట్లాడటం అందుకు వైజయంతి కూడా మాటలు అనడంతో సుధాకర్ సీరియస్ అవుతాడు. గొడవ ఆపాల్సింది పోయి రెచ్చిపోతున్నావ్ ఇంకెప్పుడు మారుతావ్ చచ్చాకా.. అని అడుగుతాడు. అలా మాట్లాడుతావేంటి అని వైజయంతి అడిగితే చెంప పగలగొట్టలేదు జాగ్రత్తగా .. అల్లుడు గారు బాధ పడుతుంటే కుదిరితే ఓదార్చండి లేదంటే నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోండి అని అరుస్తాడు. 

కౌషికితో అల్లుడిని లోపలికి తీసుకెళ్లమని అంటాడు. కన్నకొడుకు మీకు నచ్చడు కదా అని యువరాజ్ అంటే బుద్ధులు బట్టే ఉంటుందని అంటాడు. ఇక వైజయంతి శ్రీవల్లిని కోపంగా చూసి ఈ మహాతల్లి ఏ ముహూర్తాన ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడు నుంచే గొడవలు మాటలు నిందలు అని అంటుంది. సుధాకర్ కోపంగా ఏమే అటు అయిపోయింది ఇప్పుడు ఇటు పడ్డావా.. ఆ నోరు ఆగదా ఆ పిల్ల మీద పడతావేంటే.. ఆ పిల్ల ఏం చేసిందే ఇదే వయసులో మన కూతురు ఉంటే అలాగే అంటావా అని అడుగుతాడు. అవునా అయితే నా వయసులో ఉన్న వారిని చూస్తే భార్య అనుకుంటావా అని వైజయంతి అడగటం ఈ నాలుక కోసేస్తే గానీ పీడ పోదు అని సుధాకర్ వెళ్లిపోతాడు.

జగద్ధాత్రి, కేథార్ జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటారు. పిన్ని కొడుకు మీద ప్రేమతో యువరాజ్ ఎంత చేసినా వెనకేసుకొస్తుంది. యువరాజ్ ఆరు నెలల్లో మారుతాడు అని నమ్మకం లేదని కేథార్ అంటాడు. తల్లికి భార్యకి మార్చుకోవాలని లేనప్పుడు మనకు ఎందుకు అని జగద్ధాత్రి అంటుంది. పిన్ని దారుణంగా మాట్లాడుతుంది జగద్ధాత్రి అయినదానికి కాని దానికి శ్రీవల్లిని అంటుందని కేథార్ అంటాడు. శ్రీవల్లి వచ్చినప్పటి నుంచి తనని చూస్తే టెన్షన్‌ పడుతుంది. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు నిన్ను ఎలా టార్గెట్‌ చేశారో అలాగే ఇప్పుడు శ్రీవల్లిని టార్గెట్ చేస్తున్నారని జగద్ధాత్రి అంటుంది. అయితే నాకు లాగానే శ్రీవల్లికి ఈ ఇంటితో ఇంటి మనుషులతో ఏమైనా సంబంధం ఉంది అంటావా అని కేథార్ అడుగుతాడు. ఏమో తెలీదు అని జగద్ధాత్రి అంటుంది. 

కేథార్ హాల్‌లో లైట్ ఆఫ్ చేస్తా అని బయటకు వెళ్తాడు. హాల్‌లో శ్రీవల్లి పడుకొని వణుకుతూ తల్లి ఫొటో చూస్తుంది. కేథార్ వెళ్లి ఇక్కడ పడుకున్నావ్ ఏంటి అని అడుగుతాడు. అక్కా, బావగారు కూడా వాళ్ల గదిలోనే పడుకోమన్నారు కానీ బావగారికి దెబ్బలు తగిలాయని నేనే ఇక్కడికి వచ్చానని చెప్పి దుప్పటి ఇవ్వమని అంటుంది. ఇక కేథార్ శ్రీవల్లి చూస్తున్న ఫొటో గురించి అడిగితే మా అమ్మది అని చెప్తుంది. కేథార్ చూసే టైంకి కరెంట్ పోతుంది. ఇంతలో జగద్ధాత్రి కూడా వస్తుంది. జగద్ధాత్రి శ్రీవల్లితో మా అత్తయ్య ఈ సారి నీతో మంచిగా మాట్లాడితే నాకు చెప్పు అని అంటుంది. ఇక కేథార్ దుప్పటి ఇస్తాడు. జగద్ధాత్రి, కేథార్ శ్రీవల్లితో మాట్లాడి వెళ్లిపోతారు. నాకు సొంత అన్నయ్య ఇస్తే ఇలాగే చూసుకునేవాడేమో అని శ్రీవల్లి అనుకొని పడుకుంటుంది. 

వైజయంతి శ్రీవల్లిని చూసి ఎలా అయినా దీన్ని పంపేయాలని అనుకుంటుంది. ఏం చేయాలా  అని అనుకుంటుంది. ఇంతలో బూచి ఫుల్లుగా మందు తాగి వచ్చి డోర్ తీయమని అరుస్తాడు. వైజయంతి మాటలు విని తాగుబోతు చచ్చినోడు వచ్చాడా.. ఇప్పుడు తలుపు తీస్తే నా మీద వీరంగం ఆడుతాడు. అస్సలు తలుపు తీయను అని అనుకొని వెళ్లిపోతూ శ్రీవల్లిని చూసి దీన్ని ఇంటి నుంచి గెంటేయాలి అని అల్లుడిని వాడుకుంటా అని తలుపు తీస్తుంది. అల్లుడు రా లోపలికి తీసుకెళ్తా అని తూగుతూ ఉన్న బూచిని శ్రీవల్లి వైపు తీసుకెళ్తుంది. కావాలనే శ్రీవల్లి మీద తోసేస్తుంది. శ్రీవల్లి షాక్ అయి లేస్తుంది. బూచి మత్తులో అక్కడే పడుకొని వాగుతూ ఉంటాడు. 

శ్రీవల్లిని పాడు చేయాలని బూచి ప్రయత్నించాడని అరుస్తుంది. అందరూ బయటకు వస్తారు. కాచి చూసి అమ్మాయిని ఇబ్బంది పడతావా అని చితక్కొడుతుంది. శ్రీవల్లి మీద నేను పడలేదు అని బూచి అంటాడు. శ్రీవల్లి ఏడుస్తుంది. అత్తా నువ్వే కదా అని బూచి చెప్పబోతే వైజయంతి ఆపి ఈడొచ్చిన పిల్లని ఇంట్లో ఉంచొద్దని అన్నాను కదా అయినా ఉంచారు.. అల్లుడు ఆ పిల్ల మీద పడ్డారో.. లేదంటే ఆ పిల్లే పిలిచిందో.. ఈ ఇంట్లో ఉండిపోవడానికి ఇలా ప్లాన్ చేసిందేమో అని వైజయంతి అంటుంది. అంత దారుణంగా ఎలా మాట్లాడుతారు అని కౌషికి, కేథార్, జగద్ధాత్రి అంటారు. వయసులో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఉంచొద్దు అని నిషిక, వైజయంతి అని అంటారు.

కాచితో మీ ఆయన్ను తీసుకెళ్లు అని కౌషికి అంటుంది. నేనేం చేయలేదు కాచీ అని బూచి అంటాడు. నువ్వే అత్త నీ సంగతి చెప్తా అని బూచి వెళ్లిపోతాడు. వైజయంతి శ్రీవల్లికి దుప్పటి కప్పి జాగ్రత్తమ్మా అని వెళ్లిపోతుంది. కౌషికి శ్రీవల్లితో ఏడ్వకు నీకు నా ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది అంటే నమ్మలేకపోతున్నా మా బూచి అలాంటి వాడు కదమ్మా ఏదో జరిగింది అని కౌషికి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 17:భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ
నువ్వులేక నేను లేను: భరత్ నిజస్వరూపం తెలుసుకుని రాధ షాక్‌...అనసూయకు పెళ్లి ఇష్టంలేదని విక్కీకి చెప్పేసిన రాధ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Travis Head Exit:  SRH అభిమానులకు హెడ్ షాక్ .. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
SRH అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన హెడ్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
Embed widget