Illu Illalu Pillalu Serial Today September 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ డబ్బు తీసుకుంది చందు కోసమే అని చెప్పేసిన ప్రేమ! కొట్టుకున్న కోడళ్లు!
Illu Illalu Pillalu Serial Today Episode September 30th ధీరజ్ డబ్బు చందు కోసం తీసుకున్నాడని ప్రేమ వల్లీతో పాటు ఇంట్లో అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ లక్ష పంపించుకున్నట్లు రామరాజుకి తెలిసిపోతుంది. లక్ష అవసరం ఏం వచ్చిందని ధీరజ్‌ని కొడుతూ రామరాజు అడుగుతాడు. రామరాజు ధీరజ్‌ని కొడుతుంటే ప్రేమ రామరాజు చేయి పట్టుకొని ఆపుతుంది. అచ్చబాబోయ్ దేవుడి లాంటి మామయ్య గారి చేయి పట్టుకొని ఆపావ్ అంటే నీకు మామయ్య గారు అంటే గౌరవం లేదు.. మామయ్య గారిని అవమానించావ్ అని వల్లీ కూని రాగాలు తీస్తూ ప్రేమని రామరాజు తప్పుగా అనుకోవాలని రెచ్చ గొడుతుంది.
ప్రేమ కోపంగా ఏయ్ ఆపు పోనీలే అని ఊరుకుంటే రెచ్చిపోతున్నావ్ అని ప్రేమ వల్లీ మీద కోప్పడుతుంది. తను మాట్లాడినదాంట్లో తప్పేముంది అమ్మా అని రామరాజు ప్రేమని అడుగుతాడు. జరిగింది తెలుసుకోకుండా ఎవరూ మాట్లాడినా తప్పే మామయ్య అని ప్రేమ అంటుంది. మీ ఆయన విలాసాల కోసం మామయ్య గారి అకౌంట్‌లో డబ్బులు కొట్టేయడం తప్పు కాదా అని వల్లి ప్రశ్నిస్తుంది. దాంతో ప్రేమ ఆయన విలాసాల కోసం డబ్బు తీసుకున్నాడని అంటున్నావ్ కదా కానీ ఆయన డబ్బు తీసుకుంది మీ ఆయన కోసం అని ప్రేమ చెప్పగానే వల్లీ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. మిగతా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం అంటున్నావ్ అమ్మా అని రామరాజు అడుగుతాడు. అవసరం అయితే చందు బావని అడగండి మామయ్య మీకే నిజం తెలుస్తుందని ప్రేమ అంటుంది.
రామరాజు చందుని పిలుస్తే ఆయన ఇంకా రాలేదని వల్లీ అంటుంది. దాంతో రామరాజు చందుకి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు. ధీరజ్ కూడా చాలా టెన్షన్ పడతాడు. ఇంతలో చందు వస్తాడు. వాడు నీకు లక్ష ఇచ్చాడా.. నా అకౌంట్‌లో లక్ష దొంగతనం చేశాడు అది నీకోసమేనా సమాధానం చెప్పరా అని అడుగుతాడు. ధీరజ్ చెప్పొద్దని చందుతో సైగ చేస్తాడు. చందు మాత్రం ఇచ్చాడని చెప్తాడు. నాన్న నాకు వీడి సాయం చేసి అందరి ముందు దొంగలా నిలబడటం నాకు ఇష్టం లేదు అందుకే నిజం చెప్పేశా అంటాడు.
లక్షతో నీకు అవసరం ఏంట్రా అని రామరాజు అడుగుతాడు. మీకు తెలీకుండా క్షమించరాని తప్పు చేశాను నాన్న మీకు చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. మీకు చెప్పకముందే ఆ సమస్య క్లియర్ చేయాలి అనుకున్నా.. కానీ ఇంత వరకు వస్తుంది అనుకోలేదు నాన్న.. మీకు తెలీకుండా మీకు చెప్పకుండా వల్లీ వాళ్ల అమ్మానాన్నలకు నేను డబ్బు ఇచ్చాను నాన్న అని చందు నిజం చెప్పేస్తాడు. ఏంట్రా వల్లీ వాళ్ల అమ్మానాన్నలకు డబ్బు ఇచ్చావా ఈ విషయం ముందే చెప్పాలి కదా కన్న వాళ్లకి ఒక్క మాట చెప్పాలి అని మీ అన్నాదమ్ములకు లేదు అంటుంది. రామరాజు చందుతో ఎంత ఇచ్చావ్ అని అడుగుతాడు. చందు పది లక్షలు అని చెప్పేలోపు వల్లీ ఆపి ధీరజ్ దగ్గర తీసుకున్న లక్ష ఇచ్చారని అంటుంది.
ప్రేమ ఎంట్రీ ఇచ్చి చూశారా మామయ్య తనకు అంతా తెలిసే నా భర్త నా విలాసాల కోసం డబ్బు దొంగతనం చేశాడని చెప్పింది. నా భర్త తన భర్త కోసం డబ్బు తీసుకున్నాడని తెలిసి కూడా నా భర్త మీద నిందలు వేసింది అని చెప్పి ఎందుకు అలా చేశావ్ అని వల్లీని అడుగుతుంది. వల్లీ ఏం మాట్లాడకుండా తల దించుకుంటుంది. మామయ్య ధీరజ్‌ని కొడుతూ ఉన్నా నిజం తెలిసి చెప్పకుండా ఎందుకు ఉన్నావ్.. పైగా అడ్డుకున్న నన్ను నేను మామయ్యకి ఎదురు తిరిగానని రెచ్చగొట్టావ్ ఎందుకు ఇలా చేశావ్.. ఏ ఉద్దేశంతో ఇంత చేశావ్.. నీ మనసులో ఏం ఉంది చెప్పు అని అడుగుతుంది. వల్లీ ఏడుపు నటిస్తుంది. నన్ను కొట్టడానికి వస్తున్నావ్ అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. మామయ్య గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఊరుకున్నావ్ లేదంటే కొట్టేదానివి.. మా ఆస్తి అంతా పోయింది.. మేం కూటికి గతిలేని వాళ్లం అని నువ్వు కోటీశ్వరురాలివి అని నా మీదకి వస్తున్నావ్ అంటుంది.
ఇంతలో నర్మద వచ్చి తను నిజం చెప్పమని ధీరజ్ మీద దొంగ అని నింద వేస్తున్నావ్ అని అడిగితే నువ్వేంటి టాపిక్ మార్చేస్తావ్ అని అడుగుతుంది. సెంటిమెంట్ డ్రామా ఆడితే వదిలేస్తా అనుకోకు నీ అసలు రంగు మామయ్య గారి ముందు చెప్పకపోతే నా పేరు ప్రేమే కాదు అని అంటుంది. ఇద్దరూ నా మీదకి వచ్చేస్తున్నారని వల్లీ దొంగ ఏడుపు నటిస్తుంది. దారుణంగా అవమానిస్తున్నారని అంటుంది. మొత్తానికి ముగ్గురు కోడళ్లు కొట్టుకుంటారు. ఏయ్ ఆగండి అని రామరాజు అరుస్తాడు. ఇది ఇళ్లు అనుకున్నారా మార్కెట్ అనుకున్నారా అని లోపలికి వెళ్లమని అంటాడు. ఈ విషయం నేను చూసుకుంటా మీరు లోపలికి వెళ్లండి అని అందరి మీద అరుస్తాడు.
గొడవకి తల వేడేక్కిపోయిందని తిరుపతి బయటకు వెళ్లి బిందె నీరు పోసుకుంటాడు. ఏంట్రా నాయనా భూకంపం వచ్చినట్లు చేశారు.. బావ ఆపాడు కాబట్టి సరిపోయింది లేదంటే యుద్ధం జరిగేదు ఓరేయ్ అల్లుళ్లు మీ భార్యలు ఇలా ఉన్నారేంట్రా అని ముగ్గురిని అడుగుతాడు. రేయ్ చిన్నోడా ఎందుకు ఇలా చేశావ్‌రా నాన్న దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావ్‌రా.. దీని వల్ల నాన్నకి నీ మీద ఇంకా కోపం ద్వేషం పెరిగిపోతుంది కదరా అని అడుగుతాడు. నీ కోసం అన్నయ్య ఆ లక్ష లేకపోతే నువ్వేం చేసుకుంటావ్ అని భయం వేసింది అసలే నువ్వు అమాయకుడివిరా.. నాకు నాన్నకి మధ్య ఎంత ఉన్నా మా అన్నయ్య బాగుండాలి అదే నేను ఆ క్షణం ఆలోచించానురా అని అంటాడు. చందు ఏడుస్తూ ధీరజ్‌ని హగ్ చేసుకోవడం సాగర్ కూడా హగ్ చేసుకుంటాడు. తిరుపతి ముగ్గురిని విడదీసి ఓరేయ్ మీరేంట్రా మీ పెళ్లాలను కంట్రోల్ చేయాల్సింది పోయి ఇలా హగ్‌లు చేసుకుంటారా వెళ్లి అడిగి కడిగేయండిరా అంటే వాళ్లు ఎంత ఫైర్‌లో ఉన్నావో చూశావా ఇప్పుడు వెళ్తే అంతే అని బయటకు వెళ్లిపోతారు.
రామరాజు వేదవతి మీద అరుస్తాడు. ఇంటి పెద్దా ఇంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావ్ అని అంటాడు. చిన్నోడు నా ఫోన్‌లో డబ్బులు తీసుకుంటే తెలీదా అంటాడు. అంటే అంటాను అంటారు కానీ మీ ఫోన్‌లో డబ్బులు తీస్తే మీకే తెలీదు నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. కోడళ్లని అదుపులో పెట్టమని అంటే గారాభం చేశావ్ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















