Nindu Manasulu Serial Today September 30th: నిండు మనసులు: కాఫీ షాప్ కల నెరవేరేనా? ప్రేరణకు వీరస్వామి బెదిరింపులు! సిద్ధూ అనుమానం నిజమవుతుందా?
Nindu Manasulu Serial Today Episode September 30th ప్రేరణ పెట్టుబడి కోసమని రోజా చెప్పిన అడ్రస్‌కి వెళ్లడం అక్కడ వీరస్వామి ప్రేరణని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ కాఫీ షాప్ ఐడియా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటారు. అయితే పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా ట్రై చేద్దాం అని సిద్ధూ అంటాడు. ఇక ఒకసారి కాఫీ షాప్ పరిశీలిద్దామని ఇద్దరూ కాఫీ షాప్‌కి వెళ్తారు.
కాఫీ షాప్‌కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేస్తారు. బేరర్ వచ్చి ఇందాక ఇచ్చినట్లే తీసుకురమ్మంటారా మేడం అని అడుగుతాడు. సేమ్ అలాగే ఉండాలని ప్రేరణ అంటుంది. ఇక ఇద్దరూ కాఫీ షాప్ గురించి మాట్లాడుకుంటారు. మొత్తం పరిశీలించమని సిద్ధూ చెప్పడంతో ప్రేరణ చుట్టూ చూసి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్తుంది. మనం పెట్టబోయే కాఫీ షాప్ టార్గెట్ స్టూడెంట్స్ వాళ్లని అట్రాక్ట్ చేసేలా ఉండాలని సిద్ధూ అంటాడు. కాఫీ టేస్ట్‌తో పాటు వాళ్ల మన దగ్గరకు రావాలి అంటే ఏదో స్పెషల్‌గా చేయాలని ప్రేరణ అంటుంది. స్టూడెంట్స్‌ని టార్గెట్ చేయాలి అంటే టేస్టీ కాఫీతో పాటు వాళ్లకి కంఫర్ట్ ఇవ్వాలని.. కాఫీ తాగుతూ ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వాలని అంటుంది. ప్లాన్ బాగుందని అనుకుంటారు. పెట్టుబడి ఎలా అని అనుకుంటారు.
ఇంతలో పక్క బెంచ్‌లో కూర్చొన్న రోజా అనే ఒకామె క్లాప్స్ కొట్టి మీ ఐడియా సూపర్ అంటుంది. మా పర్మిషన్ లేకుండా మా మాటలు వింటున్నారా అని సిద్ధూ కోప్పడతాడు. దాంతో రోజా తప్పుగా అనుకోవద్దని చెప్పి తన భర్తకి ఫైనాన్స్ కంపెనీ ఉందని ఎదగాలి అనుకున్న మీ లాంటి వాళ్లకి పెట్టుబడి పెడతారని అంటుంది. ప్రేరణ చాలా సంతోషపడుతుంది. సిద్ధూ మాత్రం అనుమానంగా మీకు ఏంటి అంత సరదా అని అడుగుతాడు. అలా ఏం కాదు వచ్చే దానిలో సగం సగం అని రోజా చెప్తుంది. ఇక విజిటింగ్ కార్డు ఇచ్చి సాయంత్రం 7:30కి రమ్మని చెప్తుంది. ప్రేరణ ఇంట్రస్ట్‌గా ఉండి వస్తామని చెప్తుంది. రోజా వెళ్తూ వెళ్తూ సిద్ధూని చూపించి ఇతను చాలా నెగిటివ్ ఆలోచనలతో ఉన్నాడు.. మా ఆయనకు నెగిటివిటీ అంటే నచ్చదు అని చెప్పి వెళ్లిపోతుంది.
ప్రేరణ సిద్ధూతో ఎందుకు ప్రతీది అనుమానం నీకు అని అడుగుతుంది. ఎవరో ముక్కూముఖం తెలీని వాళ్లు వచ్చి పెట్టు బడి పెడతా అంటే ఎలా నమ్ముతారు అని అడుగుతాడు. నువ్వు నమ్మొద్దు నేను నమ్ముతా నేను వెళ్లి మాట్లాడుతా అని ప్రేరణ అంటుంది. సిద్ధూ వద్దని చెప్పినా వినదు. పైగా రోజా భర్తని నెగిటివిటీ నచ్చదు అని చెప్పి సిద్ధూని రావొద్దని అంటుంది. కనీసం వెళ్లే ముందు చెప్పి అయినా వెళ్లు మనం పార్టనర్స్ కదా అని సిద్ధూ అంటాడు.
ప్రేరణ బయటకు వెళ్తూ తల్లికి బయటకు వెళ్తా అని చెప్తుంది. విషయం ఏంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తున్నావ్ అని ఇందిర అడిగితే ప్రేరణ కాఫీ షాప్ గురించి చెప్తుంది. మనం ఇప్పుడు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం కదా అందుకే నేను సిద్ధూ కలిసి కాఫీ షాప్ పెట్టాలని అనుకుంటున్నాం అని అంటుంది. నీకు చదువుకోవడానికే టైం సరిపోదు కదా ఇప్పుడు ఇవన్నీ అంటే ఎలానే అని ఇందిర అడిగితే ఎవరికైనా టైం ఒకటే అమ్మ టైం వాడుకుంటే సక్సెస్ అవుతాం.. రెండూ చూసుకోగలనని నాకు నమ్మకం ఉంది.. నేను చూసుకుంటా అని అంటుంది. ఇందిర చాలా సంతోషపడుతుంది. మీ నాన్న ఎప్పుడూ నిన్ను తన పెద్ద కొడుకు అంటారు. నువ్వు ఆయన ఆశయంతో పాటు బాధ్యతలు పంచుకుంటున్నావు.. మీ నాన్న బాగుంటే మనతో ఉంటే మీకు ఇన్ని కష్టాలు వచ్చేవా అని ఇందిర ఏడుస్తుంది. పెట్టుబడి ఎలా ప్రేరణను ఇందిర అడిగితే దాని కోసమే వెళ్తున్నా అమ్మా మా ఐడియా నచ్చి ఒకామె రమ్మని చెప్పారని మాట్లాడటానికి వెళ్తున్నా అని చెప్పి ప్రేరణ వెళ్తుంది.
సిద్ధూకి ప్రేరణ రోజా వాళ్ల దగ్గరకి వెళ్లడం ఇష్టం ఉండదు. ఏమైందని కుమార్ అడిగితే రోజా మాటలు విని ఐడియా నచ్చింది అని పెట్టుబడి పెడతా అని చెప్తుంది. ప్రేరణ మాట్లాడుతా అని వెళ్తుంది నాకు ఇష్టం లేదురా అని చెప్తాడు. అయితే ప్రేరణకు కాల్ చేసి వెళ్లొద్దని చెప్పమని అంటాడు. ఇంతలో ప్రేరణ సిద్ధూకి కాల్ చేస్తుంది. సిద్ధూ వెళ్లొద్దని ఆవిడని నమ్మాలి అనిపించడం లేదు అని చెప్తాడు. ప్రేరణ వినకుండా నేను వెళ్తున్నా అని చెప్తుంది. ప్రేరణ రోజా వాళ్ల ఇంటికి వెళ్తుంది. మొత్తం చూసిన ప్రేరణ ఆఫీస్ అన్నారు ఇది గెస్ట్ హౌస్లా ఉంది అని అడుగుతుంది. దాంతో రోజా ఆఫీస్ తర్వాత మా ఆయన ఇక్కడే ఉంటారు అని చెప్తుంది. ఇక తన భర్త వీరస్వామికి పిలుస్తుంది. అతను లుంగీలో బయటకు వచ్చి ఇదే కంఫర్ట్ అని అంటాడు. ప్రేరణకు కాస్త తేడా కొడుతుంది. మీ గురించి మీ ఐడియా మొత్తం మా ఆవిడ చెప్పింది నేను పదిలక్షలు ఇస్తా అని అంటాడు. ప్రేరణ తాను ఐడియా చెప్తా అని అంటే వద్దని ఇప్పుడే డబ్బు ఇస్తా అని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమని అంటాడు. ప్రేరణ వాటిని చూసి బ్లాంక్ ఉన్నాయి వీటి మీద ఏం రాలేదు అంటే సంతకం పెట్టు అని వీరస్వామి బెదిరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















