Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మను ప్లాన్ సక్సెస్ - విషం పాలతో కాఫీ పెట్టిన భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode September 30th: ఇంట్లో ఏదైనా అనర్థం జరిగితేనే అమర్, ఆరు ఆస్థికలు గంగలో కలుపుతాడని మనోహరి ప్లాన్ చేస్తుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో ఉన్న ఆరు గుప్తను తిడుతుంది. అన్యాయంగా నన్ను చంపేశారు. ఇప్పుడేమో నా కుంటుంబం నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నారు అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మను భయపడుతూ వచ్చి కారులో వెళ్లిపోతుంది.
ఆరు: ఈ మను ఎక్కడికి వెళ్తుంది. నాకేదో డౌటు కొడుతుంది. మనోహరి టెన్షన్‌గా వెళ్లిపోతుంది. నా చెల్లెలి ముఖంలో భయం.. మీ గొంతులో వణుకు ఇదంతా చూస్తుంటే జరక్కూడదని ఏమైనా జరిగిందా..? అయ్యో గుప్త గారు చెప్పండి.. ఏం జరిగింది.. ఏం జరగబోతుంది. చెప్పండి.. అయ్యో దేవుడా..? నాకేంటి ఈ అగ్ని పరీక్ష
అనుకుంటూ ఆరు గట్టిగా అరుస్తుంది. గుప్త మౌనంగా చూస్తుంటాడు. కారులో వెళ్లిన మనోహరి నేరుగా రణవీర్ ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్లి వాటర్ తాఇగి సోఫాలో కూలబడిపోతుంది.
రణవీర్: ఏమైంది మనోహరి.. అరుంధతి గురించి భాగీ అమరేంద్రకు చెప్పేసిందా..?
మను: లేదు అ
రణవీర్: థాంక్ గాడ్ యువర్ సేఫ్
మను: నో అది చెప్పినా బాగుండు అనిపిస్తుంది రణవీర్
రణవీర్: అదేంటి మనోహరి అమరేంద్రకు తెలిస్తే నీకు ప్రమాదం కదా..?
మను: నాకు ప్రమాదమో కాదో అది అమరేంద్రతో చెప్పినప్పుడు కదా తెలిసేది
రణవీర్: ఎందుకు నీకు అంత కోపం
మను: అది చెప్తుందా లేదా..? అని నైట్ నుంచి టెన్షన్ తో చచ్చిపోతున్నాను. నరాలు తెగిపోతున్నాయి. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అక్కడ ఉంటే ఏ క్షణంలోనైనా హార్ట్ స్ర్టోక్ వచ్చి చచ్చిపోతానేమోనని భయం వేసి ఇక్కడికి వచ్చాను.
రణవీర్: కూల్ మనోహరి ఇంత వరకు భాగీ చెప్పలేదంటే తనకు చెప్పే ఉద్దేశమే లేదేమో..
మను: అసలు దానికి చెప్పే ఉద్దేశం ఉందో లేదో తెలియడం లేదే.. రాత్రి ఆరు ఫోటో చూసింది.. ఉదయం ఆరు ఆత్మను చూసింది. అయిన భాగీ నోరు విప్పడం లేదు.. అమర్ ఎంత అడిగినా చెప్పడం లేదు..
రణవీర్: ఓకే ఓకే ఒకవేళ భాగీ అమరేంద్రకు చెప్పింది అనుకుందాం.. కానీ అమర్ నమ్ముతాడా..?
మను: నమ్ముతాడు. ఆరు ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందని అమర్‌కు ఒక స్వామిజీ చెప్పాడు
రణవీర్: అమరేంద్ర నమ్మాడే అనుకో అప్పుడు అమర్ ఏం చేస్తాడు..
మను: భాగీతో ఆరును పిలిపించి మాట్లాడతాడు. ఆరు చనిపోక ముందు ఏం జరిగిందో నేను ఏం చేశానో చెప్తుంది
రణవీర్: అరుంధతి అలా చెప్పేదే అయితే అమరేంద్రకు ఎప్పడో చెప్పి ఉండాలి కదా..? భాగీకి తను ఆత్మగా రివీల్ అయిపోయింది కదా..? పైగా అరుందతి ఆత్మకు చాలా శక్తులు కూడా ఉన్నాయి.. ఘోర, చంభా, కాలా లాంటి వాళ్లను తిప్పికొట్టిన అరుంధతికి తనకు జరిగిన అన్యాయం గురించి ఇన్నాళ్లు భర్తకు చెల్లికి చెప్పకుండా ఎందుకు ఆగినట్టు..?
మను: అది నాకు అర్థం కావడం లేదు..
రణవీర్: ఏదో కారణం ఉండి ఉంటుంది మనోహరి. అదే నీ గురించి అరుంధతి చెప్పకుండా ఆపుతుంది
మను: అవును ఏదో కారణం ఉంది.. ఏదై ఉండొచ్చు
రణవీర్: అది ఏదైనా కావొచ్చు కానీ ప్రస్తుతానికి అదే నిన్ను ఇప్పుడు కాపాడుతుంది.
మను: అదేంటో తెలుసుకుంటే నేను ఇంకా సేఫ్‌గా ఉంటాను కదా
రణవీర్: మనకు తెలియని కొన్ని ప్రశ్నలను కాలానికే వదిలేయాలి. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి
మను: ఏంటి..? అప్పటి వరకు నేను ఈ టెన్షన్ అనుభవిస్తూనే ఉండాలా..? ఒకవైపు ఆ సరస్వతి వార్డెన్ భాగీకి నా గురించి అంతా చెప్పేసింది.. ఇంకోవైపు తను చూస్తుంది.. మాట్లాడుతుంది మనిషి కాదు ఆత్మ అని భాగీకి తెలిసిపోయింది. ఇప్పుడు దాని చేతిలో రెండు ఆయుధాలు ఉన్నాయి… నేనేమో హెల్ఫ్ లెస్‌గా ఉన్నాను..అందుకే వెంటనే ఆరు ఆస్థికలు గంగలో కలిపేయాలి రణవీర్.. అలా చేయాలంటే ఆ ఇంట్లో రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగాలి.
రణవీర్: ఆ ఇట్లో రెండు మూడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగాలంటే మన వల్ల అవుతుందా..?
చంభా: నా వల్ల అవుతుంది రణవీర్
అంటూ చంబా వస్తుంది. వెంటనే చంభా ఒక ప్లాన్ చెప్తుంది. దాని ప్రకారం అమర్ ఇంట్లోకి వెళ్లే పాల ప్యాకెట్లలో ఏదో కెమికల్ కలుపుతుంది. ఆవే పాలు అమర్ ఇంట్లోకి వెళ్తాయి. అవే పాలతో భాగీ టీ కాస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















