(Source: Poll of Polls)
Jagadhatri Serial Today October 16th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్ కుటుంబానికి ముప్పు! మీనన్ వార్నింగ్.. రాత్రి ఏం జరగబోతుంది?
Jagadhatri Serial Today Episode October 16th మీనన్ యువరాజ్‌తో ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కేథార్ వంశీ చేసిన అప్పు తీర్చడానికి జగద్ధాత్రి నగలు, తన డబ్బు ఇస్తాడు. మిగతావి కౌషికి ఇస్తుందని అంటాడు. యువరాజ్ ఏం ఇవ్వలేదు అని రౌడీ అంటే దానికి కేథార్ నేను ఇచ్చినా నా తమ్ముడు ఇచ్చినా ఒక్కటే అని అంటాడు. మాధురి కేథార్‌ని పట్టుకొని ఏడుస్తుంది.
కౌషికి వంశీతో ఇప్పటికైనా వాళ్ల విలువ తెలిసిందా.. మాధురికి నువ్వే శ్రీరామరక్ష అన్నావ్.. నువ్వు కాపాడగలిగావా.. ఇప్పటికైనా వాళ్ల గొప్పతనం గుర్తించు వంశీ అని అంటుంది. వంశీ తల దించుకొని ఇద్దరి చేతుల్ని వంశీ కలిపి ఇద్దరినీ క్షమించమని అడుగుతాడు. ఇద్దరినీ కలిసి మాధురిని దీవించమని అడుగుతాడు. ఇద్దరినీ తీసుకెళ్లి మాధురిని దివించమని చెప్తాడు. కేథార్, యువరాజ్ చాలా సంతోషంగా దీవిస్తారు. మాధురి చాలా చాలా సంతోషపడుతుంది. అందరూ చాలా సంతోషపడతారు. కౌషికి మనసులో ఈరోజు కోసమే కదా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నది అని అనుకుంటుంది.
నిషిక, వైజయంతి మాత్రం కేథార్, యువరాజ్ కలిసి ఉండటం చూసి కుళ్లుకుంటారు. కేథార్‌ని చూసి యువరాజ్ కూడా నవ్వుతాడు. అంతలోనే నిషికని చూసి నిషిక చేయి పట్టుకొని రా నిషి అని గదిలోకి తీసుకెళ్తాడు. నిషి కేథార్ అందరి ముందు మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. నా సొంత చెల్లికి ఏం ఇవ్వలేకపోతున్నా.. నీ నెక్లెస్ ఏమైనా ఇస్తే నా చెల్లికి ఇస్తా అని అంటాడు. వచ్చేదేం లేదు కానీ అన్నీ పోతున్నాయ్ అని నిషి యువరాజ్‌కి నక్లెస్ ఇస్తుంది. యువరాజ్ సంతోషంగా మాధురికి నెక్లెస్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అది చూసి మాధురి చాలా సంతోషపడుతుంది. ఇది నీ కోసమే స్పెషల్‌గా చేయించానని యువరాజ్ అంటాడు.
వైజయంతి చూసి కేథార్ కేవలం అక్షింతలు మాత్రమే వేశాడు.. నా కొడుకు మంచి నెక్లెస్ ఇచ్చాడు అని అంటుంది. కేథార్ ఇచ్చిన దానితో పోల్చుకుంటే ఇది ఓ లెక్కా అని సుధాకర్ అంటాడు. దానికి వైజయంతి ఈయనొకడు పొంగనివ్వడు అని అంటుంది. ఇక మాధురి అత్తారింటికి బయల్దేరుతుంది. అందరికీ పేరు పేరునా చెప్పి మాధురి బయల్దేరుతుంది. వైజయంతి కన్నీరు పెట్టుకుంటుంది. యువరాజ్‌తో అబ్బోడా ఎలా అయితే ఏంటి నీ చెల్లి సీమంతంలో ఉన్నావ్ సంతోషమే కదా అని అడుతుంది. జగద్ధాత్రి కేథార్‌ని అడుగుతుంది.
వైజయంతి శ్రీవల్లిని చూసి కౌషికితో సీమంతం తర్వాత తనని పంపేస్తానని చెప్పావ్ అని అంటుంది. వెళ్తానని శ్రీవల్లి అంటే గాయం అయింది కదా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తావ్ అని అంటారు. అందరూ కాచిని అడిగితే కాచి సరే అంటుంది. కౌషికి శ్రీవల్లితో నువ్వు కోలుకున్న తర్వాతే వెళ్దువులే అని అంటుంది. వైజయంతి శ్రీవల్లిని కోపంగా చూడటం గమనిస్తుంది.
మీనన్ యువరాజ్‌కి కాల్ చేస్తాడు. మీనన్ యువరాజ్‌తో నీ చెల్లి సీమంతంలో చెప్పకుండా చేశా ఇప్పుడు చేయబోయేది చెప్తున్నా.. ఈ రోజు రాత్రికి నీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా చంపేస్తున్నా కుదిరితే కాపాడుకో అని అంటాడు. భాయ్ నిషికను చంపాలి అని ప్రయత్నించి ఒక తప్పు చేశావ్ ఇప్పుడు ఇంకో తప్పు చేయకు అని అంటాడు యువరాజ్. మీనన్‌కే వార్నింగ్ ఇచ్చే రేంజ్‌కి వెళ్లిపోయావా.. రక్తపు మడుగులో ఉండబోయే నీ ఫ్యామిలీని చూసుకో అని అంటాడు.
రాత్రి అందరూ తమ తమ గదుల్లో పడుకుంటారు. యువరాజ్కి మాత్రం మీనన్ ఇచ్చిన వార్నింగ్కి మాత్రం నిద్ర రాదు. సుధాకర్, వైజయంతి, కాచి, బూచి, కౌషికి, నిషిక, జగద్ధాత్రి, శ్రీవల్లి, కేథార్ ఇలా అందర్ని చూసి పడుకున్నారో లేదో చూసి ఏ ప్రమాదం లేకుండా నా ఫ్యామిలీని నేనే కాపాడుకోవాలి అని అనుకుంటాడు. కేథార్కి ఏమైనా సాయం అడుగుదామా అని అనుకొని వద్దలే అనుకుటాడు. నా ఫ్యామిలీని ఎలా అయినా కాపాడుకోవాలి అని బయటే కాపు కాస్తాడు. రౌడీలు రాగానే యువరాజ్ వాళ్లతో ఫైట్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















