Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఊరి జాతరలో ఊహించని ట్విస్ట్! వీర్రాజు, అంబికలకు అమ్మిరాజు చెప్పిన ప్లానేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 16th అంబిక, వీర్రాజు, అమ్మిరాజు కలిసి ఊరి జనం పంట పోవాలని మందు కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఫ్యామిలీ మొత్తం సిటీకి వెళ్లిపోవాలని రెడీ అవుతారు. వీర్రాజు ఎదురు పడి వెళ్లిపోతున్నారా పెద్దనాన్న వచ్చిన పని అయిపోయింది కదా వెళ్లిపోతారులే అని అంటాడు. వీహారితో బాబు నువ్వు లేకపోయినా నీ ఆర్గానిక్ వ్యవసాయాన్ని నేను చూసుకుంటా అని అంటాడు. నీకు ఎందుకులే అని భక్తవత్సలం అంటాడు.
వీర్రాజు లక్ష్మీతో ఇప్పటి వరకు చాలా చేశావ్ అమ్మా ఇక వెళ్లమ్మా అని అంటాడు. ఇంతలో పోచమ్మతో పాటు ఊరి జనం మొత్తం వస్తారు. అందరితో పాటు యమున కావేరిని చూస్తుంది. తర్వాత చూసే సరికి కావేరి కనిపించదు. యమున కావేరి కోసం చూడటం లక్ష్మీ చూసి ఏంటమ్మా వెతుకుతున్నారని అడుగుతుంది. భక్తవత్సలం ఊరి జనంతో వెళ్లిపోతున్నాం అంటే ఉండండి అయ్యా అని అంటారు. వెళ్లిపోతాం అని అందరూ అంటే ఊరి జాతర వస్తుంది అది చూసి వెళ్లండి అని చెప్తారు. భక్తవత్సలం కూతుళ్లతో జాతర అయ్యాక వెళ్దాం అని అంటాడు.
వీర్రాజు ఊరి జనంతో అమ్మవారి జాతర గురించి అడుగుతున్నారు కానీ కొండ మీద అమ్మవారికి దీపం వెలిగించలేదు దాని పరిస్థితి ఏంటి.. యమునమ్మని మా అన్న పెళ్లి చేసుకున్నాడని ఊరి నుంచి పంపేశారు. అప్పటి నుంచి దీపం వెలిగించడం లేదు. కొండ మీద అమ్మ ఆగ్రహాన్ని పట్టించుకోండిరా.. ఆ అమ్మ ఆగ్రహానికి మా పెద్దనాన్న కుటుంబాన్ని బలి చేయకండి వాళ్లని వెళ్లిపోనివ్వండి అని అంటాడు. దానికి పోచమ్మ మన ఊరి వారికి అమ్మవారి నుంచి సంకేతం రాలేదు. ఇన్నేళ్లుగా కిందే కదా జాతర చేస్తున్నాం.. అమ్మవారి ఆజ్ఞ లేకుండా అమ్మవారి గుడికి వెళ్లడం అసాధ్యం. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు అవసరం లేదని చెప్పి జాతరకు భక్తవత్సలం వాళ్లని ఉండమని పోచమ్మ చెప్తుంది.
అమ్మిరాజు అక్కడికి వచ్చి తండ్రిని తీసుకెళ్లిపోతాడు. విహారిని చూపించి వాడే నన్ను కొట్టాడని చెప్తాడు. అమ్మిరాజు విహారిని కొట్టడానికి వెళ్తే విహారి చితక్కొడతాడు. వీర్రాజు కొట్టొద్దని అంటాడు. వీర్రాజు అమ్మిరాజుని తీసుకెళ్లిపోతాడు. తండ్రీ కొడుకులు మందు తాగుతారు. అమ్మిరాజు నన్ను ఎందుకు ఆపావ్ అని తండ్రిని అడిగితే నిన్ను ఆపకపోతే ఈ మందు కాదురా హాస్పిటల్‌లో మందులు తీసుకునే వాడివి అని అంటాడు. ఇంతలో అంబిక వీర్రాజు దగ్గరకు వస్తుంది. అంబికకు అమ్మిరాజుని పరిచయం చేస్తాడు వీర్రాజు. ఊరి జనాన్ని మార్చేస్తాం అని అమ్మిరాజు తన ప్లాన్ చెప్తాడు. ప్లాన్ అదిరిపోయిందని అంబిక వాళ్లు అనుకుంటారు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా పని పూర్తి చేయ్ అని అంటుంది.
అమ్మిరాజు తండ్రి, పానకాలలతో కలిసి పంట పొలాలకు పురుగు పట్టేలా మందు కొడతారు. చేతికందిన పంట నాశనం అయితే అందరూ పొలాలు అమ్మేస్తారని ప్లాన్ చేస్తారు. పానకాలు పొలాల మొత్తం మందు చల్లుతాడు. ఉదయం అంబిక పార్థసారథితో మాట్లాడుతుంది. అన్నీ రెడీ మీరే లేటు అని పార్థసారథి చెప్పడంతో త్వరలోనే అన్ని పూర్తయిపోతాయని అందులో భాగంగా ఓ ప్లాన్ కూడా వేశామని చెప్తుంది. అంబిక మాటలు లక్ష్మీ వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















