Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: ప్రేరణని హగ్ చేసుకున్న సిద్ధూ! ఐశ్వర్య రంజిత్‌ని ప్రశ్నించడానికి కారణమేంటి?
Nindu Manasulu Serial Today Episode October 16th సిద్ధూ ప్రేరణకు థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode మంజుల విజయానంద్ దగ్గరకు వెళ్లి చెప్పకుండా వెళ్లినందుకు బాధ పడుతున్నారా అని అడుగుతుంది. లోలోపల విజయానంద్ రగిలిపోతున్నా పైకి మాత్రం నాకు వెళ్లే అదృష్టం లేదు కనీసం నువ్వు అయినా వెళ్లావ్ నాకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. 
సిద్ధూ జీవితంలో ఒక అడుగు ముందుకు వేశాడు.. అది నువ్వు కల్లారా చూశావ్ అంతకంటే ఏం కావాలి అని అంటాడు. భర్త మాటలు నిజమని నమ్మేసిన మంజు ఇదే అండీ మీ గొప్పతనం కానీ మీ మనసు వాడికి అర్థం కావడం లేదు అదే నా బాధ అని అంటుంది. సిద్ధూ మీద నాకు ఎంత మమకారం ఉందో నాకు తెలుసు.. నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ ఎవరో మూడో వ్యక్తిగా ఒకమ్మాయి వచ్చి చెప్తే నువ్వు వెళ్లడం నాకు బాధగా ఉంది.. మన బిడ్డని ఎలా చూసుకోవాలో మనకి తెలుసు కదా.. అసలు ఆ అమ్మాయి మనకి ఏం చెప్పాలి అనుకుంది.. కొడుకు మనసు నీకు తెలీదు.. తప్పు అంతా నీదే అని చెప్పాలి అనుకుందా.. లేదంటే నీకు ప్రపంచమే తెలీదు అనుకుందా.. నీ ఆలోచనలకు నీ నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటాను.. అలాంటి నిన్ను ఆ పిల్ల వచ్చి మాయ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.. పరాయి వ్యక్తి కదా మంజు అని అంటాడు. 
మంజుల భర్తతో మీరు చెప్పింది కరెక్టే అండీ కానీ నేను వెళ్లింది ఎవరో చెప్పారు అని కాదు.. మనకు మన బిడ్డకు మధ్య ఏ దూరం లేదని తెలియ చెప్పడానికి.. మన బంధాల మధ్య మూడో వ్యక్తికి స్థానం లేదని నిరూపించడానికి అని అంటుంది. విజయానంద్ రగిలిపోతాడు. సిద్ధూ కోసం ఆ అమ్మాయి వచ్చింది సిద్ధూ బాధ చూడలేక వచ్చిన ఆ అమ్మాయి సిద్ధూ విషయంలో ఎంత దూరం వెళ్లిందా అని అబ్బాయిని ఇంకెంత మార్చిందా అని అనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో కలిసి కోచింగ్, కలిసి రైడింగ్, కలిసి కాఫీ షాప్ పెట్టడం పైగా ప్రేరణ పేరు పెట్టడం మన అబ్బాయి మారిపోతే మనం ఏం చేయలేం వదిలేయ్ మంజు అని అంటాడు. మంజు ఆలోచనలో పడుతుంది. 
కుమార్ అందరికీ కాఫీ ఇస్తూ ఉంటాడు. ఓ చోట సిద్ధూ హ్యాపీగా ఉండటం కుమార్ చూసి వెళ్తాడు. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావ్ అని అడుగుతాడు. సిద్ధూ హ్యాపీగా ఈ రోజు కేఫ్ ఓపెనింగ్‌కి అమ్మ రావడం చాలా చాలా సంతోషంగా ఉందిరా.. అమ్మరాదని తెలుసు కానీ ఎక్కడో చిన్న నమ్మకం ఈరోజు ఆ నమ్మకం నిజమైందని అంటాడు. దానికి కుమార్ నీ నమ్మకం నిజం అవ్వడానికి ప్రేరణ గారు కారణంరా.. అమ్మకి నీ మీద ప్రేమ లేదు అనను కానీ అమ్మ తనకు తానుగా రాలేదు.. నీ బాధ చూడలేక ప్రేరణ వెళ్లి పిలిస్తే వచ్చిందిరా.. నేను ప్రేరణగారికి మీ ఇంటికి తీసుకెళ్లా అని చెప్తాడు. 
గణ ప్రేరణకు కాల్ చేసి కేఫ్ పెట్టారంట కదా.. నీ పేరు పెట్టారంట.. ఓ మగాడితో కలిసి బిజినెస్ నువ్వు మీ అమ్మని మించిపోయావ్.. మీ అమ్మ మా నాన్నని బుట్టలో వేసుకోవడానికి చాలా ఏళ్లు తీసుకుంది.. నువ్వు మాత్రం మూడు నెలల్లో వాడిని నీ వెంట తిప్పుకున్నావ్ అంటే సూపర్ నువ్వు.. ఎక్కడికి పోతాయ్ తల్లి పోలికలు అని గణ ప్రేరణని అవమానిస్తాడు. మా నాన్న కొడుకు అంటావ్ మా నాన్న లక్షణాలు ఒక్కటీ నీకు రాలేదు అని ప్రేరణ అంటుంది. ఏయ్ మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని గణ అంటే మరి మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదిరా అని ప్రేరణ అడుగుతుంది. అహంకారంతో మూసుకుపోయిన నీ కళ్లు తెరిపించే రోజు ఎంతో దగ్గర్లో లేదు.. మా నాన్న లేచి నిలబడే లోపు నేను కలెక్టర్ అయి నీ అంతు చూస్తా అని అంటుంది. 
రంజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఇందిర వడ్డిస్తుంది. కేఫ్ దగ్గరకు వచ్చి కాసేపటి తర్వాత కనిపించలేదు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది. చాలా సేపు అక్కడే ఉన్నాను అని రంజిత్ అంటాడు. ఐశ్వర్య రంజిత్‌కి వడ్డిస్తూ ఏంటి మీరు అక్కడున్నారా.. కవర్ చేయకండీ నాకు తెలుసు మీకు విశ్వనాథ్ గారి మధ్య ఏదో ఉంది అని అంటుంది. రంజిత్ పేరు వినగానే ఉలిక్కిపడతాడు. పేరు చెప్పగానే ఉలిక్కి పడ్డారు అని అడుగుతుంది. విశ్వనాథ్ గారు ఎవరు అని రంజిత్ అంటాడు. కవర్ చేయొద్దు మీకు విశ్వనాథ్ గారికి గతంలో ఏదో గొడవ జరిగింది.. మీరు కచ్చితంగా ఏదో తప్పు చేశారు కదా అంటుంది. నువ్వు సూపర్ అని రంజిత్ అంటాడు. పెద్ద తప్పే చేశా అని అంటాడు. మీరు చిన్న తప్పు చేస్తే తప్పు లేదు మేం చేస్తే తప్పా అంటుంది. నేను తప్పు చేశాను కాబట్టే ఇంకెవరూ చేయకుండా కాపాడుతున్నా అంటాడు. ఇక ఐశ్వర్య ఆ తప్పు ఏంటి అని అడిగితే దానికి రంజిత్ నువ్వు పెద్ద సైంటిస్ట్‌వి కదా నువ్వే కనిపెట్టు అంటాడు. 
సిద్ధూ కుమార్ చెప్పి మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేరణ సిద్ధూ దగ్గరకు వస్తుంది. సిద్ధూని ప్రేరణ పిలుస్తుంది. సిద్ధూ అలా చూస్తూ ఉంటే అలా చూడొద్దు నాకు ఇబ్బందిగా ఉంది అంటే నాకు బాగుంది అని సిద్ధూ అంటాడు. ఏంటి అని ప్రేరణ అంటే తల్లికి దూరంగా ఉన్న బిడ్డ బాధ అర్థం చేసుకొని బాధ తొలగించినందుకు.. మా అమ్మ రాదని తెలిసినా గేటు వైపు ఆశగా చూసిన నాకు అమ్మని తీసుకొచ్చి కేఫ్ ఓపెన్ చేయించిన నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటాడు. ఇంత చిన్న విషయానికి అంత ఫీలవ్వాలా అని ప్రేరణ అడిగితే ఇది చిన్న విషయం కాదండీ చాలా పెద్ద విషయం ఇన్నేళ్లలో ఇలా ఏ కార్యక్రమంలో మా అమ్మతో కలిసి లేనండీ అని సిద్ధూ చెప్తాడు. ప్రేరణ జాలిగా చూస్తుంది. మా అమ్మతో కలిసి నేను ఏ పండగ కూడా చేసుకోలేదండీ థ్యాంక్స్ అని చెప్పి సిద్ధూ ప్రేరణని హగ్ చేసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















