Illu Illalu Pillalu Serial Today October 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యబాబోయ్ అంటూ మళ్లీ మంట పెట్టేసిన వల్లీ! భాగ్యం, ఇడ్లీబాబాయ్‌కి కొత్త సమస్య!
Illu Illalu Pillalu Serial Today Episode October 16th ప్రేమకి ధీరజ్ సారీ చెప్పడం ప్రేమ ధీరజ్‌ని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ తన ఫ్యామిలీకే సపోర్ట్ చేసిందని ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ విసిరి కొట్టి వెళ్లిపోతాడు. ప్రేమ చాలా చాలా ఏడుస్తుంది. కోపంలో ఎన్నో మాటలు అనేశా అలా అనకుండా ఉండాల్సింది.. ప్రేమ ఎంత బాధ పడుతుందో ఏంటో అని ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళ్తాడు.
ప్రేమ దగ్గర కూర్చొని సారీ చెప్తాడు. నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు.. నువ్వు మధ్యలోకి రాకపోయి ఉంటే నేను అలా అనేవాడిని కాదు అని సారీ చెప్తాడు. ప్రేమ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. కోపంలో అన్నా ప్రేమ.. కోపం వస్తే ఒక దెబ్బ కొట్టు అంతే కానీ నాతో మాట్లాడకుండా ఉండకు అని ధీరజ్ అంటే 32 పళ్లు రాలిపోయేలా ప్రేమ కొడుతుంది. ఇంత గట్టిగా కొట్టావేంటే అదే నీ చేతిలో కత్తి ఉంటే నన్ను పొడిచేదానివే అని ధీరజ్ అంటాడు.
ప్రేమ వెళ్లిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి అక్కడే ఉన్న క్లాత్ తీసుకొని ధీరజ్ చేతికి అయిన గాయానికి కట్టు కడుతుంది. నా చేతికి కట్ట కట్టావ్ అంటే కోపం పోయింది.. ఇంకా ఏమైనా కోపం ఉంటే నన్ను కొట్టు అని ధీరజ్ అనడంతో తబాలా వాయించినట్లు ప్రేమ వాయించేస్తుంది. 
భాగ్యం, ఆనంద్‌రావు బజ్జీ వ్యాపారంలో బాగా సంపాదించేస్తారు. ఇడ్లీ బాబాయ్, భాగ్యం ఆనందంగా ఉంటే శ్రీవల్లి కాల్ చేసి అమ్మా.. మిమల్ని మా మామయ్య రమ్మన్నారే అని అంటుంది. ఎన్ని సార్లు వస్తాం అమ్మా మరి రాం అని భాగ్యం అంటే ఫుల్లు కోపంగా ఉన్నారే రండీ.. మీ వాళ్ల కోసం చాలా విషయాలు తెలిశాయి.. నాకు చాలా టెన్షన్‌గా ఉంది త్వరగా రండి అని అంటుంది. మళ్లీ ఏమైందా అని ఆనంద్ రావు గజగజా వణికి పోతాడు. 
తిరుపతి వేదవతికి వంటలో సాయం చేస్తూ ముగ్గురు కోడళ్లు ఉంటే నాకు పని చెప్తావేంటి అక్క అని అంటాడు. వాళ్లు వాళ్ల బిజీలో ఉన్నారని అంటుంది. అక్క లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అక్క.. ప్రేమ పెళ్లి చేసుకుంటే పుట్టింటి మీద మమకారం చంపుకోవాలని అనడంతో వేదవతి తమ్ముడికి వాతలు పెడుతుంది. అక్క నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నా ఈ కోపిష్టోడిని ఎందుకు చేసుకున్నావ్ అక్క అంటాడు. ఆయన మంచోడురా అని వేదవతి అంటుంది.అందుకే కదా నేను బావని వదలడం లేదు.. అయినా ఎందుకు అక్క బావ అంత రగిలిపోతున్నాడు అని అంటాడు. ఆయన కోపంతో కష్టం అనే త్వరగా వండేస్తున్నా.. ఈ టైంలో ఎవరైనా కదిలిస్తే భస్మమే అని అంటుంది. 
రామరాజు ఫుల్ ఫైర్ మీద హాల్‌లో కూర్చొని ఉంటే నర్మద గురించి తగిలించేద్దాం అనుకొని వల్లి వెళ్తుంది. ఇంతలో సాగర్ తండ్రి దగ్గరకు వస్తాడు. నాన్న అనడంతో రామరాజు రియాక్ట్ కాకపోవడంతో సాగర్ వెళ్లిపోతుంటే వల్లి ఆపి నువ్వు ఎందుకు నర్మద పుట్టింటికి వెళ్లావ్.. మామయ్యని వాళ్లు అవమానించారు.. సాగర్‌ని ఇల్లరికం రమ్మన్నారు.. నర్మద వల్లే గౌరవం వచ్చింది అని అన్నీ గుర్తు చేస్తుంది.. ఇక సాగర్‌తో మరిది గారు మీకే ఇల్లరికం వెళ్లాలి అనే ఆలోచన ఉందా అని అడుగుతుంది. వేదవతి కోపంగా ఏం మాట్లాడుతున్నావ్ నీకు బుద్ధి ఉందా అని వల్లీని తిడుతుంది.
మరిది మనసులో అలా లేకపోతే వాళ్లు అలా అనరు కదా.. పైగా నర్మద ఇక్కడ సంతోషంగా లేదు అన్నారు అంటే నర్మద చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు వదిన అని సాగర్ అడిగితే తప్పేముందిరా అని రామరాజు అడుగుతాడు. నర్మదతో నువ్వు నాలో మీనాన్నని చూసుకుంటున్నా అన్నావ్ మరి మీ నాన్న ఎందుకు అలా అన్నారు అని రామరాజు నర్మదని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















