Jagadhatri Serial Today January 7th: హోంమినిష్టర్‌కు కౌషికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది..? ఆస్పత్రిలో మాధురి కొడుకుని ఎందుకు మార్చేశారు.
Jagadhatri Serial Today Episode January 7th: ల్యాండ్ కాంప్రమైజ్ కోసం వచ్చి డబ్బులు డిమాండ్ చేసిన హోంమినిస్టర్‌కు కౌషికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

Jagadhatri Serial Today Episode: మారువేషంలో కేదార్ వైజయంతితో మీనన్ మనిషిలా మాట్లాడితే తొలుత ఒప్పుకున్న వైజయంతి ఆ తర్వాత వెంటనే తేరుకుని నాకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడటం చూసి కేదార్, దాత్రికి అనుమానం వస్తుంది. అత్తయ్య కావాలనే మాట మార్చినట్లు ఉన్నారని జగధాత్రి అంటుంది. ఇంతలో హోంమినిస్టర్ తాయారు కౌషికి ఇంటికి వస్తుంది. ఎందుకొచ్చావని జగధాత్రి మినిష్టర్‌ను నిలదీస్తుంది. నోరుమూసుకుని వెళ్లి మినిస్టర్‌కు కాఫీ తీసుకుని రమ్మని నిషిక ధాత్రిని ఆదేశిస్తుంది. మనల్ని ఇంతలా అవమానించిన తాయరుకు మర్యాదలు చేయనని తెగేసి చెబుతుంది. దీంతో నిషికకు కోపం వచ్చి గట్టిగా ఆదేశించడంతో అక్కడికి కౌషికి వస్తుంది. ధాత్రి అన్న దానిలో తప్పేముందని నిలదీస్తుంది. ఇంతలో యువరాజు కలుగజేసకుని మినిష్టర్ ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు మాట్లాడుకుంటే తప్పేముందని అంటాడు.దీంతో కౌషికి సరేనంటుంది.
కౌషికి సారీ చెప్పి 50కోట్లు ఇస్తే జరిగిందంతా మర్చిపోతానని... ఆ ల్యాండ్ జోలికిరానని మినిస్టర్ తాయారు అంటుంది. దీనికి కౌషికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని తెగేసి చెబుతుంది .దీంతో హోంమినిస్టర్ నిషికపై మండిపడుతుంది. మాట్లాడుకుందామని మీరు పిలిస్తేనే వచ్చాను కదా...ఇలా అవమానిస్తారా అంటూ నిలదీస్తుంది. దీంతో నిషిక మాట జారుతుంది. పంతాలకు పోయి కాపురాన్నే చెడగొట్టుకుందని...ఇప్పుడు బిజినెస్ కూడా చెడగొట్టుకుంటోందని నిషిక అనగానే...ధాత్రి ఆమె చెంప పగులగొడుతుంది. ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే ఇక్కడే చంపేస్తానని హెచ్చరిస్తుంది. మేము ఏం తప్పు చేయలేదని...అలాగే నేరం కూడా చేయలేదని మీకు సారీలు చెప్పి డబ్బులు ఇవ్వడానికి అని జగధాత్రి అంటుంది.కాబట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోంండని చెబుతుంది. ఏం ఉన్నా సరే కోర్టులో తేల్చుకుందామని కౌషికి అంటుంది. నా పవర్ ఎంటో చూపిస్తానంటూ తాయరు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 50 కోట్లు కోసం మినిస్టర్‌తో గొడవలెందుకని వైజయంతి, యువరాజు అంటారు...నేను ఇప్పుడు డబ్బులిస్తే తప్పుచేసినట్లు ఒప్పుకున్నట్లు అవుతుందని కౌషికి అంటుంది. కోర్టులో ఓడిపోతామని తెలిసే మినిస్టర్ కాళ్లభేరానికి వచ్చిందని ధాత్రి అంటుంది.
మాధురికి అబ్బాయి పుట్టాడని తెలిసి అందరూ ఆస్పత్రికి వెళ్తారు. బాబు చూసి అందరూ ఆనందపడతారు. నర్సు చేతిలో నుంచి పిల్లాడిని తీసుకుని ధాత్రి ఎత్తుకుంటుంది. పిల్లాడికి తల్లి,దండ్రుల పోలికలు రాలేదంటి అని అడుగుతుంది. వాడిని మాధురి చేతికి ఇవ్వగానే చూసి వీడు మాబాబు కాదని అంటుంది. నా బిడ్డను తీసుకుని వేరే బాబును ఇచ్చారని ఏడుస్తుంది. వెంటనే నర్సు వెళ్లి డాక్టర్‌ను తీసుకుని వస్తుంది. మా ఆస్పత్రిలో అలాంటివి జరగవని డాక్టర్ అంటుంది. చెకప్‌కు తీసుకెళ్లిన మాధురి బాబు చేతిపై పుట్టుమచ్చ ఉంటుందని...ఇప్పుడు తీసుకొచ్చిన బాబుకు లేదని ధాత్రి నిలదీస్తుంది. పొరపాటు జరిగే ఛాన్స్ లేదని డాక్టర్ అంటుంది. పోలీసులను పిలుద్దామని యువరాజు ఫోన్ చేస్తాడు. ఇంతలో సీసీ కెమెరాలు చూద్దామని ధాత్రి అంటుంది. కంట్రోల్ రూంలో ఉన్న సీసీ ఫుటేజీ చూస్తుంది. మధ్యలో ఓ కెమెరా ఫుటేజ్ లేదేంటని అడిగితే..2 రోజులుగా ఆ కెమెరా పనిచేయడం లేదని డాక్టర్ చెబుతుంది. జనరల్ వార్డు నుంచి ఓ బామ్మ బ్యాగ్‌లతో బయటకు వెళ్తున్న విధానం చూసి ధాత్రికి అనుమానం వస్తుంది.





















