Jagadhatri Serial Today November 27th: ‘జగధాత్రి’ సీరియల్: మధుకర్ రూం చెక్ చేసిన హోంమంత్రి – ధాత్రి, కేదార్ లను వెళ్లగొట్టేందుకు వైజయంతి ప్లాన్
Jagadhatri Today Episode: తాము ఇక ఇంట్లో ఉండమని బట్టలు సర్దుకుని వెళ్లిపోతుంటారు యువరాజ్, నిషిక, వైజయంతి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: సుధాకర్ వాళ్ల ఇంటికి వచ్చిన హోమంత్రి మధుకర్ రూం చూడాలని లోపలికి వెళ్తాడు. అతన్ని చూసిన ధాత్రి అనుమానంగా అసలు ఎవరు ఇతను అని అనుమానిస్తుంది. దీంతో ప్లాష్ బ్యాక్ వస్తుంది. నిధి విషయంలో మధుకర్ సాయం అడుగుతారు కమీషనర్ సత్యప్రసాద్, మీనన్, ఇప్పటి హోం మంత్రి.. అప్పటి కార్పోరేటర్. దీంతో మధుకర్ సరే ఏ ప్రాబ్లమ్ రాకుండా మీరు చూసుకుంటానంటే నేను సాయం చేస్తాను అంటాడు. అందులో ఉన్న దేవనాగరి లిపి శాసనాలు చదువుతాడు మధుకర్.
సత్యప్రసాద్: నేను చెప్పాను కదా సార్. ఆ రాగి రేకు మీద ఉన్న లిపి అ ప్రొఫెసర్‌కు అర్థం అవుతుందని..
కార్పోరేటర్: చెప్పండి ప్రొఫెసర్..
మధుకర్: ఇందులో ఉన్న సమాచారం మీకు చెప్పాల్సింది కదు. ప్రభుత్వానికి చెప్పాలి. ఇందులో ఉన్న నిధులన్నీ ప్రభుత్వానికి చెందాల్సినవి.
కార్పోరేటర్: గవర్నమెంట్ అంటే మేమే కదా..? ప్రొఫెసర్.
మీనన్: ఏంటి ప్రొఫెసర్ మీకు మాలో గవర్నమెంట్ కనిపించడం లేదా..?
Also Read: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!
మధుకర్: మీ ముగ్గురు కూడా కరుడ గట్టిన గుండాలు.. ఎట్టి పరిస్థితుల్లో సమాచారం మీకు ఇవ్వను.
అనగానే మీనన్ వచ్చి తనను చంపినట్టు కలగని భయంతో వణికిపోతూ.. ఈ సమాచారం వీళ్లకు ఇచ్చినా నన్ను చంపేస్తారు. ఇవ్వకున్నా చంపేస్తారు. కాబట్టి ఇది వీళ్లకు చెందకుండా చూడాలి అనుకుని గడువు తీసుకుని మధుకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా గుర్తు చేసుకున్న హోంమంత్రి మధుకర్ ఫోటో చూసి ఓం శాంతి అంటూ రూం చూస్తుంటాడు.
కేదార్: ఈయన ఇల్లు చూస్తున్నట్టు లేదు ఆయన కళ్లు ఇంకా దేని గురించో వెతుకుతున్నట్లు ఉన్నాయి ధాత్రి.
ధాత్రి: అవును ఎప్పుడూ రాని హోంమంత్రి పని గట్టుకుని ఇంటికి రావడం. రాగానే ఎప్పుడో చనిపోయిన మధుకర్ మామయ్య రూం చూడాలనుకోవడం. ఈయన దేనికోసమే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ముందు ఈయనను డైవర్ట్ చేయాలి పద.
సుధాకర్: ఇవన్నీ అన్నయ్య ఫైల్స్ సార్.
కౌషికి: ఇవన్నీ నాన్నగారి గుర్తుగా అలాగే ఉంచుకున్నాం.
హోంమంత్రి: మంచిపని చేశాము.
సుధాకర్: అన్నయ్యా ఆరోజుల్లో రిసెర్చ్ చేసేవాళ్లు కదా దానికి సంబంధించిన ఫైల్స్.
అని సుధాకర్ చెప్పగానే రూంలో అన్ని చెక్ చేస్తూ ఒక బాక్స్ దగ్గరకు వెళ్లి ఓపెన్ చేసి చూడబోతుంటే.. ఇంతలో ధాత్రి జ్యూస్ తీసుకుని వచ్చి తీసుకోమ్మని చెప్తుంది. దీంతో తాను ఉపవాసం ఉన్నానని చెప్తాడు. కేదార్ వచ్చి కనీసం మంచి నీళ్లైనా తీసుకోమ్మని చెప్తాడు. వద్దని హోంమంత్రి బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో డైరీని చూసి చదవబోతుంటే కౌషికి వద్దని చెప్పడంతో సరేనని వెళ్లిపోతాడు హోంమంత్రి.
ధాత్రి: హోంమంత్రి అదికేశవులు గారికి మధుకర్ మామయ్యా గారికి ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనుమానం ఉంది కేదార్.
కేదార్: నాకైతే మధుకర్ పెద్దనాన్నతో కాకుండా పెద్ద నాన్న డెత్ కు హోం మంత్రికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది ధాత్రి.
Also Read: భూమికి ప్రపోజ్ చేయాలనుకున్న గగన్ – వంశీ, ఇందులకు వార్నింగ్ ఇచ్చిన రమేష్
ధాత్రి: అలా కూడా అనుకోవచ్చు. మధుకర్ మామయ్య రూంలోకి క్యాజువల్ గా హోంమంత్రి వెళ్లలేదు. అసలు ఏం జరగుతుందో మనం తెలుసుకోవాలి.
అని మాట్లాడుకుంటారు. మరోవైపు
నిషిక: ఇంకా ఆలస్యం చేయకూడదు అత్తయ్యా ధాత్రి కేదార్‌లను ఇప్పుడే ఇంట్లోంచి పంపించేయాలి.
యువరాజ్: అవునమ్మా ఇప్పుడే పంపించేయాలి.
వైజయంతి: పంపించేద్దాం అబ్బోడా. మీరెల్లి మీ బట్టలు సర్దుకుని సూట్ కేసులతో వచ్చేయండి.
అని చెప్పగానే సరేనని బట్టలు సర్దుకుని నిషిక, యువరాజ్ వస్తారు. ఆ బ్యాగులు తీసుకుని ముగ్గురు కిందకు వస్తారు. వాళ్లను చూసిన కౌషికి ఏంటి పిన్ని సడెన్ గా ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతుంది. దీంతో మా ఇంటికి వెళ్తున్నాను వదిన అంటుంది నిషిక. దీంతో కౌషికి షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!