అన్వేషించండి

Satyabhama Serial Today November 27th: సత్యభామ సీరియల్: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!

Satyabhama Serial Today Episode In Telugu: క్రిష్ తన బిడ్డ అని ధర్మా చేస్తున్న గంగ తనకి క్రిష్‌కి మహదేవయ్యకి డీఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ జరుగుతున్న విషయం గురించి ఆలోచిస్తుంటే సత్య అక్కడికి వెళ్తుంది. తండ్రి పరువు పోయే పరిస్థితి వచ్చిందని రాజీ పడే పనే లేదని ఎమ్మెల్యే టికెట్ కోసం అవసరం అయితే ప్రపంచం తల కిందులైనా చేస్తానని అంటాడు. గంగ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అంటాడు. 

సత్య: పోలీసుల కంటే మీరే బలవంతులు అనుకుంటారు కదా మరి ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తా అంటున్నావ్.
క్రిష్: ఎలక్షన్ టైం కదా మీడియా ముందు దురుసుగా పోకుండా కంట్రోల్‌గా ఉండమని నువ్వు చెప్పావు కదా. వాళ్లు అయితే గంగని అరెస్ట్ చేసి సెల్‌లో పెట్టి నాలుగు ఉతికితే నిజాలు బయటకు వస్తాయి. 
సత్య: ఇప్పుడు గంగ ఒంటరిది కాదు చుట్టూ ప్రజలున్నారు. గంగ మీద లాఠీ పడితే మీ నాన్న పరువు పోతుంది. అయినా కోర్టు అయినా పోలీసులు ఎవరైనా సరే డీఎన్ఏ టెస్ట్ చేయమని అంటారు.
క్రిష్: ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేయకూడదు.

సత్య క్రిష్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక భైరవి కిచెన్లో కూర్చొని బాధ పడుతుంది. అక్కడికి రేణుక వెళ్లి బాధ పడు అత్త నా పరిస్థితే నీకు వచ్చింది నా భర్తకి మామకి  వచ్చాయని అంటుంది. నాచుగ్గా లేరని మన భర్తలు మనల్ని వదిలేస్తున్నారని అంటుంది. అయినా భైరవి తన భర్త అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు అంటుంది. రేణుక తన భర్తని మామని పోల్చి చెప్తుంది. ఇక భైరవి పక్కనే రేణుక కూర్చొంటే ఏంటే అత్త అని లేకుండా కష్టంలో చుట్టరికం కలుపుతున్నావా అంటే ఈ పరిస్థితిలో ఇక అత్త ఎవరు కోడలు ఎవరు అని రేణుక చురకలేస్తుంది. డీఎన్‌ఏ రిపోర్ట్ వస్తే మీరు నా గదిలోకి రావాలి గంగ మీ గదిలోకి షిఫ్ట్ కావాల్సిందే అని అంటుంది. దాంతో భైరవి రేణుకని పంపేస్తుంది. ఇక పంకజం వచ్చి పెద్ద కోడలి మాటలు చేదుగా ఉన్నాయి కానీ అవే నిజాలని చెప్తుంది. 

మరోవైపు గంగకి సపోర్ట్‌గా మహిళా సంఘాలు వచ్చి గోల చేస్తారు. మహదేవయ్యని గంగ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎవరూ తన కొడుకు ఇక్కడ లేరని క్రిష్ అంటే గంగ మనిద్దరిదీ పేగు బంధం అని అది ఇదీ అని డ్రామా చేస్తుంది. తన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు చేతులు జోడించి దండం పెడతా వెళ్లిపో అని క్రష్ అంటే నేను నీకు దండం పెడతా అని గంగ అంటుంది. వెళ్లిపో అమ్మ అని క్రిష్ అంటే నన్ను అమ్మా అన్నావు అని గంగ నటిస్తుంది. ఇక నర్శింహ ఎవరి బిడ్డనో తీసుకొచ్చి నీ బిడ్డ అంటున్నావ్ సిగ్గు లేదా అని మహదేవయ్యని అడుగుతాడు. ఆయన నా తండ్రి కాకపోతే ఈయనే ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నారని క్రిష్ అంటే లోకంలో ఇంత మంది తండ్రులు ఉంటే మీ నాన్నే ఎందుకు పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు అని అడుగుతాడు. ఏదో ఒకరోజు మీ నాన్నకి మన గురించి తెలిసే ఇలా పచ్చబొట్టు వేసుకున్నాడని అంటుంది. ఇక క్రిష్ నన్ను నా బాపుని విడదీయాలని చూస్తావా చంపేస్తా అని అంటాడు. 

అందరూ క్రిష్‌ని గంగతో పంపాలని అంటే దానికి మహదేవయ్య చిన్నా గంగ కొడుకు అని తేలితే పంపేస్తా అంటాడు. క్రిష్‌ని గంగకి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తానని మహదేవయ్య అంటాడు. దానికి గంగ ఒక కండీషన్ ఉందని క్రిష్‌ని నేను నా కొడుకు అంటున్నా నువ్వు నీ కొడుకు అంటున్నావ్ కదా అందుకు నేను నువ్వు క్రిష్ ముగ్గురం డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకుందామని అంటుంది. తాను డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే క్రిష్ తన కొడుకు కాదని తెలిసిపోతుందని మహదేవయ్య టెన్షన్ పడతాడు. అందరూ క్రిష్ మహదేవయ్య కొడుకే టెస్ట్ చేసుకుంటాడని అంటుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి గెటప్‌లో అందరితో ఎమోషనల్‌గా మాట్లాడి మహాలక్ష్మీని పిచ్చిదాన్ని చేసిన సీత!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 12th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌కి ప్రమాదం..! అంతలోనే ప్రేమ జాకెట్ చింపేసి పరువు పొగొట్టిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 12th:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
నువ్వులేక నేను లేను:రాధను బయటకు తీసుకెళ్లి విక్కీ ఏం చేశాడు...రాధపై మరోమారు హత్యాయత్నం ఎలా జరిగింది..?
Karthika Deepam 2 Serial Today August 12th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ వస్తువులు తిరిగి ఇచ్చేసిన జ్యోత్స్న! సూరజ్‌కి జ్యోత్స్నలో మార్పు అర్థమవుతుందా!
Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  
‘బ్రహ్మముడి’ సీరియల్: శశి లోకేషన్‌ తెలుసుకున్న నందు – ఐషుకు నిజం చెప్పిన రేణు  

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget