అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి గెటప్‌లో అందరితో ఎమోషనల్‌గా మాట్లాడి మహాలక్ష్మీని పిచ్చిదాన్ని చేసిన సీత!

Seethe Ramudi Katnam Today Episode హాల్లో సుమతి ఫొటో ప్లేస్‌లో విద్యాదేవి ఫొటో చూసి మహాలక్ష్మీ రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode హాల్‌లో అందరూ కూర్చొని ఉంటే సీత పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంది. అందరూ ఎక్కడనుంచి వస్తున్నావ్ అని అడిగితే సీత పోలీస్ స్టేషన్‌కి వెళ్లానని చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి సీత పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విద్యాదేవిని కలిసి వచ్చిందని చెప్తుంది. దాంతో రామ్ సీత మీద కోప్పడతాడు. ఆవిడను కలవొద్దని చెప్పినా వినలేదు ఎందుకని అడుగుతాడు. అందరూ సీతని ప్రశ్నిస్తారు. 

జనార్థన్: నీకు మహా అంటే ఎలాగూ విలువ లేదు రామ్ మాటకు కూడా విలువ ఇవ్వవా సీత.
మహాలక్ష్మీ: నిన్ను ఇందుకే విడిపించానా.
సీత: మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తా రెండు నిమిషాలు ఓపిక పట్టండి అని గదిలోకి వెళ్తుంది.
చలపతి: సీత అలా వెళ్లింది అంటే ఏదో గెటప్ వేసి మీ అందర కళ్లు తెరిపిస్తుందని అర్థం.
అర్చన: ఇప్పుడే గెటప్‌లో వస్తుందో. 

సీత విద్యాదేవిలా చీర కట్టుకొని ఆమెలా రెడీ అయి వస్తుంది. ఇప్పుడు నేను సుమతిని ఈ ఇంటికి యజమానురాలిని అని చెప్తుంది. జనార్థన్ దగ్గరకు వెళ్లి నా రూపం మారిపోయి ఉండొచ్చు కానీ నా ప్రవర్తన మనసు ఏం మారలేదు కదా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అడుగుతుంది. రాఖీ కడుతుంటే దూరంగా జరిగాను అప్పుడు కూడా అర్థం చేసుకోలేదా అని సీత సుమతిలా జనార్థన్‌ని ప్రశ్నిస్తుంది. బ్రాస్‌లెట్ ప్రేమతో కట్టాను అప్పుడు పసి గట్టలేదా అని అడుగుతుంది. నేను మీ కళ్ల ముందు ఉన్నా మీరు గుర్తు పట్టలేదు అంటే మీ ప్రేమ గుడ్డిదే అంటుంది. ఇక రామ్‌తో నిన్ను కన్న తల్లిలా చూసుకున్నా కథ రామ్ నువ్వు సీత కలిసి ఉండాలి అనుకున్నా ప్రీతి మంచి కోరుకున్నా ప్రీతి పెళ్లి నా చేతిలో జరగాలి అనుకున్నా పురాణాల్లో భార్యని మర్చిపోయిన భర్తలు ఉన్నారు కానీ తల్లిని మర్చిపోయిన కొడుకులు లేరని అంటుంది. ఇక మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి దరిద్రంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి నా అదృష్టం పంచి నిజంగా మహాలక్ష్మీలా మార్చాను కదా మహాలక్ష్మీ. నీ జాతకాన్నే మార్చేశాను కదా అలాంటి నువ్వు అయినా నేను చేసిన సాయం గుర్తు చేసుకోవాలి కదా అని అడుగుతుంది. 

మహాలక్ష్మీ చాలు ఆపు అని సీతని తిడుతుంది. గెటప్ వేసుకొని వస్తే నువ్వు సుమతి అయిపోతావా అని అడుగుతుంది. దాంతో సీత సుమతి అత్తమ్మ ఇక్కడుంటే ఇవే చెప్పేది అందుకే అత్తమ్మ తరఫున నేను చెప్పాను అని అంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎవరూ నమ్మరు అని సీతతో మహాలక్ష్మీ అంటుంది. ఏదో ఒక రోజు విద్యాదేవి టీచరే సుమతి అని తెలుసుకుంటారని సీత అంటుంది. మహాలక్ష్మీ దానికి ఆ టీచర్‌ని జైలులో తప్ప ఎక్కడా చూసుకోలేరని చెప్పి అందరినీ వెళ్లి పనులు చేసుకోమని అంటుంది. జైలులో సుమతిని ఓ కానిస్టేబుల్ కలిసి మీరు నా పాపకి నాట్యం నేర్పించారు మీరు మంచోళ్లు ఇక్కడ ఏం తప్పు చేసి వచ్చారని అడుగుతుంది.

దానికి సుమతి అతి మంచితనం నా పాలిట శాపం అయిందని అంటుంది. ఇక ఇంట్లో మహాలక్ష్మీ ఫోన్ మాట్లాడుతూ ఉండగా హాల్‌లో విద్యాదేవి ఫొటో చూసి షాక్ అయిపోతుంది. కోపంతో ఫొటో విసిరి కొట్టి అందరిని కిందకి పిలుస్తుంది. సుమతి ఫొటో ఎవరు పెట్టారని అడుగుతుంది. గతంలో మీరే పెట్టారు కదా అని అందరూ సుమతి మొదటి రూపం ఫొటో గురించి చెప్తారు. దాంతో మహాలక్ష్మీ ఆ ఫొటో కాదు హాల్లో విద్యాదేవి ఫొటో ఎవరో పెట్టారని అంటుంది. సుమతిని చంపిన ఆ హంతకురాలి ఫొటో ఎవరు పెట్టారని ప్రశ్నిస్తుంది. మహాలక్ష్మీ విసిరేసిన ఫొటో చూస్తే అది సుమతి ఫొటో ఉంటుంది. దానికి సీత ఇదా మీరు విసిరిన ఫొటో ఇదా మీరు అన్న విద్యాదేవి ఫొటో అని అడుగుతుంది. అందరూ మహాని పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావ్ అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: సత్యభామ సీరియల్: మీడియాలో మహదేవయ్య పరువు.. ఎమ్మెల్యే టికెట్ డౌటే.. డీఎన్ఏ టెస్ట్ సలహా ఇచ్చిన సత్య!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget