Jagadhatri Serial Today February 20th: ‘జగధాత్రి’ సీరియల్: హోమం చేసిన ధాత్రి, కేదార్ - సైకోలా మారిన యువరాజ్
Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ వెలిగించడంతో హోమం వెలుగుతుంది. దీంతో యువరాజ్, నిషిక షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: నిషిక, యువరాజ్ ఎన్నిసార్లు అగ్గిపుల్ల వెలిగించినా హోమం వెలుగదు. దీంతో పంతులు ఇక వద్దని మళ్లీ మంచి రోజు చూసుకుని హోమం చేద్దామని వెళ్లిపోతుంటే లోపలి నుంచి కౌషికి, ధాత్రి, కేదార్ వస్తారు. ఒక్కసారి ధాత్రి, కేదార్‌లను కూర్చోబెట్టి ప్రయత్నిద్దామని కౌషికి చెప్తుంది. దీంతో వైజయంతి, నిషిక వద్దని వాళ్లతో చేయించడం ఏంటని నిలదీస్తారు. కౌషికి కోపంగా నిషికి, వైజయంతిని తిడుతుంది.
కౌషికి: ఈ హోమం ఎవరు చేయాలో నాకు తెలుసు పిన్ని. కానీ ఎందుకు చేయిస్తున్నామో మీలో ఎవరికైనా గుర్తుందా? ఎలాగైనా హోమం చేయాలని నేను చూస్తుంటే.. మేం చేయకుంటే ఆపేస్తాం.. వేరే వాళ్లను చేయనివ్వము అంటే ఏంటిది ఇదంతా? పంతులు గారు ఈ హోమం పెద్ద కొడుకు లాంటి వారితో జరిపించవచ్చా?
పంతులు: ఇలా హోమం వెలగని పక్షంలో పెద్ద కొడుకు లాంటి వారితో ప్రయత్నించవచ్చు అమ్మా..
కౌషికి: జగధాత్రి మీరు వెళ్లి హోమం పీటల మీద కూర్చోండి.
నిషిక: కుదరదు..అయినా ఇంటి కొడుకు కోడలైన మేము వెలిగిస్తేనే వెలగలేదు. మీరు వెలిగిస్తే ఇంకేం వెలుగుతుంది.
ధాత్రి: అది ఒక్కసారి ప్రయత్నిస్తేనే కదా నిషి తెలిసేది. ఏమో ఈ ఇంటి పెద్దకొడుకు వెలిగిస్తే వెలగొచ్చేమో..
నిషిక: ఈ ఇంటి పెద్ద కొడుకా?
కేదార్: జగధాత్రి చెప్తుంది. ఈ ఇంటి పెద్దకొడుకు లాంటి వాడు అని
ధాత్రి: ఒకసారి మేము కూర్చుని వెలిగిస్తామత్తయ్యా.. వెలుగుతే అంతకన్నా ఏముంది చెప్పండి.
వైజయంతి: సరే ప్రయత్నించండి.
అనగానే యువరాజ్ పూలను విసిరికొట్టు కుదరదు అంటాడు. దీంతో కౌషికి కోపంగా యువరాజ్‌ను తిట్టి కేదార్‌ను హోమం వెలిగించమని చెప్తుంది. కేదార్ అగ్గిపుల్ల వెలిగించగానే హోమం వెలుగుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
నిషిక: అదేంటి ఈ ఇంటి పెద్ద కొడుకు మీరు వాళ్లకు ఈ ఇంటికి ఏలాంటి సంబంధం లేదు. వాళ్లు వెలిగిస్తే వెలిగిందేంటి?
అని అడగ్గానే కళ్లతో చూసింది నమ్మాలా? మనసు చెప్పేది నమ్మాలా? అని కౌషికి మనసులో అనుకుంటుంది. పంతులుగారికి హోమం ఆపోద్దని చెప్తుంది. నిషిక కోపంగా మేము హోమం చేయకుండా ధాత్రి ఏదో చేసిందంటుంది. అవేవీ పట్టించుకోకుండా కేదార్, ధాత్రి హోమం చేస్తారు. ఈ ప్లాన్ కౌషికి చేసినట్లుంది. దీనికి మనం ప్రతికారం తీర్చుకోవాలని మనసులో అనుకుంటుంది వైజయంతి.
ధాత్రి: థాంక్స్ వదిన మాతో హోమం చేయించినందుకు
కౌషికి: ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా ఉండి మా కోసం హోమం చేసినందుకు నేనే థాంక్స్ చెప్పాలి.
అనగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రూంలోకి వెళ్లిన కేదార్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ధాత్రిని హగ్ చేసుకుని తన హ్యాపీని షేర్ చేసుకుంటాడు. మరోవైపు యువరాజ్ రూంలో పిచ్చిపిచ్చిగా అరుస్తూ కేదార్‌ను తిడుతుంటాడు. ఎందుకు మా ఇంట్లోకి వచ్చావని తిడుతుంటాడు. గోడకు తల బాదుకుంటాడు. ఇంతలో నిషిక వచ్చి యువరాజ్‌ను ఆపుతుంది.
నిషిక: ఏంటండి ఈ పిచ్చి పనులు. ఇలా గోడకు కొట్టుకుంటే నీతల పగులుతుంది కానీ వాళ్లు ఇంట్లోంచి పోరు.
యువరాజ్: అసలిదంతా మీ అక్క జగధాత్రి వల్లే అందరి ముందు పరువు పోయింది.
నిషిక: హోమం వెలగకపోవడం మీ తప్పు కాదు కదండి. జగధాత్రి వాళ్లే కావాలని ఏదో చేశారు. ఇప్పుడేంటి వాళ్లు అంటిస్తే హోమం వెలిగిందని వాళ్లు ఈ ఇంటికి పెద్దకొడుకు, కోడలు అయిపోతారా?
అని నిషిక అనగానే యువరాజ్ షాక్ అవుతాడు? నీకు అసలు నిజం తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవు అని యువరాజ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు కౌషికి హోమం వెలగడాన్ని గుర్తు చేసుకుంటూ ఏది నిజం ఏది అబద్దం అని ఆలోచిస్తుంది. నిజం ఏంటో కనిపెట్టాలని నిర్ణయించుకుంటుంది కౌషికి. కట్ చేస్తే యువరాజ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటాడు. ఇంతలో ధాత్రి, కేదార్ కారులో దిగుతారు. వారిని చూసిన యువరాజ్ వీళ్లెవరో ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్ల లాగా ఉన్నారు. అని దగ్గరకు వెళ్లి వాళ్లను పిలుస్తాడు యువరాజ్. యువరాజ్‌ను చూసిన ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: పెళ్లి చేసుకున్న ‘జాదుగాడు’ బ్యూటీ సోనారిక - ఇవిగో ఫొటోలు