Jagadhatri Serial Today Fabruary 15th: ‘జగధాత్రి’ సీరియల్: చిత్రకు డబ్బులిచ్చిన బూచి – రంగంలోకి దిగిన జేడీ, కేడీ
Jagadhatri Today Episode : చిత్రకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు రౌడీలు కొట్టేశారని ఇంటికి వచ్చి నాటకం ఆడతాడు బూచి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode : బూచిని బ్లాక్ మెయిల్ చేసిన చిత్ర యాభై లక్షలు తీసుకుని వెంటనే నా ప్లాట్‌కు వచ్చేయ్ అంటుంది. యాభై లక్షలా అని బూచి అడగ్గానే అవునని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో ఎవరిని అడిగినా అన్ని డబ్బుల ఇవ్వరు. ఈ విషయం కాచికి తెలిస్తే బతకదు అని మనసులో అనుకుంటూ పక్కకు తిరిగి చూస్తే పక్కనే కాచి, ధాత్రి, కేదార్ ఉంటారు. వాళ్లను చూసిన బూచి కంగారు పడుతుంటాడు.
బూచి: మీరు ఎప్పుడు వచ్చారు…?
ధాత్రి: మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అన్నయ్యా..
కేదార్: ఏం చేస్తున్నావు బావ
బూచి: ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను.
కాచి: చేసిందెవరు..?
ధాత్రి: చెప్పండి అన్నయ్యా ఫోన్ చేసింది ఎవరు? అయినా బయటకు వచ్చి మరీ ఎందుకు మాట్లాడుతున్నారు.
కేదార్: ఫోన్‌లో చాలా కంగారుగా మాట్లాడినట్టు అనిపించింది బావ ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు?
బూచి: మీరు నా మాటలు వినలేదా..?
కాచి: లేదు నువ్వు ఫోన్ పెట్టేసే ముందు వచ్చాము అంతే..
బూచి: ఎవరో రాంగ్ నంబర్ చెప్తున్నా వినకుంటే తిడుతున్నాను అంతే.. కాచి నువ్వు పద వెళ్దాం..
అంటూ కాచిని తీసుకుని వెళ్లిపోతాడు.
ధాత్రి: అంతే మాత్రం కాదని గట్టిగా అనిపిస్తుంది కేదార్.
కేదార్: బావ తడబాటు, కంగారు, కళ్లల్లో బాధ చూస్తుంటే.. ఏదో జరిగింది అనిపిస్తుంది ధాత్రి.
ధాత్రి: టైం చూసి తీగ లాగి కొడితే డొంకంతా కదులుతుంది.
అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. కౌషికి ఎవరికో ఫోన్ చేసి ఇప్పుడే పంపిస్తాను అని చెప్తుంది. వెంటనే యువరాజ్ ఎక్కడికి వెళ్లాడని వైజయంతిని అడుగుతుంది.
వైజయంతి: ఏదో పని ఉందని బయటకు వెళ్లాడు..
నిషిక: ఏం వదిన ఏమైనా పని ఉందా..?
సుధాకర్: అవునమ్మా ఈ యాభై లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి.
బూచి: నేను చేస్తాను మామయ్య గారు.
వైజయంతి: పని అంటే పై దాకా పరిగెత్తే నువ్వు పని చేస్తానని ముందుకు వచ్చావా..?
అని వైజయంతి అడగ్గానే నాకు బయట పని ఉంది అలాగే బ్యాంకుకు వెళ్లొస్తాను అంటూ చెప్పగానే కేదార్ వచ్చి ఇంతకు ముందే బయటక రానని చెప్పావు ఇప్పుడేం పని ఉంది అని అడుగుతాడు. దీంతో బూచి కేదార్‌ను తిడతాడు.
కేదార్: నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ బావ.
వైజయంతి: బావ ఇంకా చూస్తున్నావు. బూచికి బ్యాగ్ ఇవ్వు బ్యాంకుకు వెళ్తాడు.
సుధాకర్: జాగ్రత్త బూచి యాభై లక్షలు. బ్యాంకు వెళ్లి మేనేజర్‌తో ఫోన్ చేయించు ఎవరి అకౌంట్లో వేయాలో నేను చెప్తాను.
అని సుధాకర్ చెప్పగానే బూచి డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. నిషిక, వైజయంతి కోపంగా ధాత్రి, కేదార్‌లను తిడతారు. ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి కౌషికికి సారీ చెప్తారు. మరోవైపు డబ్బులు తీసుకెళ్లిన బూచి చిత్రకు వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి నన్ను డబ్బులు అడగొద్దని గట్టిగా చెప్పడంతో నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతువు నిన్నెలా వదులుకుంటాను అంటుంది చిత్ర. మరో యాభై లక్షలు రెడీగా పెట్టుకో వెళ్లి అంటుంది. దీంతో బూచి భయపడతాడు. తర్వాత తనను రౌడీలు అటాక్ చేసి డబ్బు లాక్కెళ్లారని ఇంటికి వచ్చి చెప్తాడు బూచి.
ఆ ఏరియా ఎస్సైకి ఫోన్ చేసి విషయం చెప్తుంది ధాత్రి. దీతో ఆ ఏరియాకు మినిస్టర్ వస్తున్నారని.. 4 గంటల నుంచి టైట్ సెక్యూరిటీ ఉందని అలాంటి సంఘటన జరిగే చాన్సే లేదని చెప్తాడు. దీంతో బూచి ఎవరికి డబ్బులిచ్చాడో కనిపెట్టాలని ధాత్రి, కేదార్ డిసైడ్ అవుతారు. చిత్ర దగ్గరకు ఒకతను వెళ్లి పోలీసులు నిన్ను పట్టుకోవాలనుకుంటున్నారు అని చెప్తాడు. తాను ఎవ్వరికీ దొరకనని చెప్తుంది చిత్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

