అన్వేషించండి

Jagadhatri Serial Today December 9th: ‘జగధాత్రి’ సీరియల్‌: మాధురి రిసెప్షన్‌లో ధాత్రి, కేదార్‌ లకు అవమానం  - కావ్య కేసులో పంతులు సాక్ష్యం  

Jagadhatri Today Episode:  మాధురి రిసెప్షన్‌కు వచ్చిన ధాత్రి, కేదార్‌లను కుక్కలతో పోలుస్తుంది నిషిక దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Jagadhatri  Serial Today Episode:  కావ్య కేసు గురించి కేదార్‌, జగధాత్రి ఆలోచిస్తారు. మధుకర్‌ మర్డర్‌ కేసులో కూడా హోంమంత్రి ఉన్నట్లున్నాడు అని కేదార్‌ డౌట్‌ క్రియేట్ చేస్తాడు. మనకు హోంమంత్రి వార్నింగ్‌ ఇచ్చాడంటే మనం టార్గెట్‌కు దగ్గరగా ఉన్నామనే అర్తం కాబట్టి మనం ఇంకాస్త స్పీడుగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని అంటాడు. అవునని  ఆ దేవుడి దయవల్ల మనకు ఒక్క కరెక్టు క్లూ దొరికినా బాగుండు అంటుది ధాత్రి. తర్వాత వేలంపాట గురించి డీటెయిల్స్‌ ధాత్రి, కేదార్‌కు చెప్తుంది రమ్య. ఇంతలో రోడ్డు మీద పంతులు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి కారు స్పీడుగా రావడంతో ధాత్రి, కేదార్‌ పంతులును కాపాడతారు. పంతులు వాళ్లకు థాంక్స్‌ చెప్తూ.. మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం తప్పా ఏమీ ఇచ్చుకోలేనని మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పండి అర్చన చేస్తానని చెప్తాడు.

ధాత్రి: మా అమ్మ పేరు కావ్య. నాన్న భరద్వాజ్‌..  ఏంటి పంతులు గారు అలా డల్లుగా అయిపోయారు.

పంతులు: కావ్య అనే పేరు వింటే నేను ఇంతే అమ్మా..

ధాత్రి: ఏమైందండి..

పంతులు: ఇరవై యేళ్ల క్రితం నేను ఓ గుడిలో పని చేస్తుండేవాణ్ని. గుడిలో అప్పుడు తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని రక్షించే బాధ్యత అప్పట్లో సీఐగా పని చేస్తున్న కావ్య అమ్మ మీద పెట్టారు. తర్వాత కొంత మంది ఆ విగ్రహాన్ని కొట్టేసి కావ్య అమ్మ మీద నెట్టారు.

ధాత్రి: పంతులు గారు నేను ఆ కేసు రీ ఓపెన్‌ చేశాను. మీకు తెలిసిందంతా చెప్పండి పంతులు గారు.

పంతులు: చెప్తానమ్మా.. కానీ రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేస్తాను. ఇప్పుడు మా ఆవిడ నాకోసం ఎదురు చూస్తుంది.

 అని చెప్పి పంతులు వెళ్లిపోతాడు. ధాత్రి, కేదార్‌ హ్యాపీగా ఫీలవుతారు. దూరం నుంచి అంతా గమనిస్తున్న హోంమంత్రి బామర్ధి వెంటనే వెళ్లి మంత్రికి జేడీ, కేడీల గురించి పంతులు నిజం చెప్పిన విషయం మొత్తం చెప్తాడు. దీంతో మంత్రి భయంతో కోపంగా జేడీ, కేడీని తిడతాడు.   తర్వాత మాధురి రిసెప్షన్‌కు ధాత్రి, కేదార్‌ రెడీ అయి వస్తారు.

కౌషికి: జగధాత్రి ఈరోజు నువ్వు చాలా బాగా ఉన్నావు.

కేదార్‌: అంటే మిగతా టైంలో బాగుండదని అంటున్నావా అక్కా..

కౌషికి: కేదార్‌ అంటే నా ఉద్దేశం అది కాదు అందరి దిష్టి తగిలేలా ఉందని నా ఉద్దేశం. అందరికంటే ముందు నా దిష్టే తగిలేలా ఉంది.

ధాత్రి: చాల్లే వదినా మీరేమైనా తక్కువ ఉన్నారా..?

నిషిక: చూశావా అత్తయ్యా ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలా ఉంది.

కౌషికి: ఏం మాట్లాడుతున్నావు నిషిక..

ధాత్రి: పర్వాలేదులే వదిన మనకంటే ఇంకొకరు అందంగా రెడీ అయినప్పుడు కుళ్లుకోవడం మన ఆడవాళ్ల లక్షణం. అదే నిషిక చేస్తుంది.

వైజయంతి: నువ్వు గమ్మున ఉండు నిషిక.

సత్యప్రసాద్‌: ఏంటి బాబు మీ నాన్న ఎవరనేది తెలిసిందా…?

కేదార్‌: తెలిసింది. కానీ ఇంకా సాక్ష్యం దొరకలేదు.

ప్రసాద్‌: సాక్ష్యం మీ అమ్మనే చెప్పాలి. ఎందుకంటే మీ తండ్రి ఎవరనేది మీ అమ్మకే తెలుస్తుంది కదా..?

ధాత్రి: పెద్దవాళ్లు అయ్యుండి మీరు అలా మాట్లాడటం తప్పుగా అనిపించడం లేదా..?

ప్రసాద్‌: తప్పుగా ఎందుకు అనిపిస్తుంది అమ్మా..

అనగానే కౌషికి కోపంగా ప్రసాద్‌ను తిడుతుంది. వైజయంతి, నిషిక, ప్రసాద్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ధాత్రి ఏడుస్తుంది. ఎందుకు మనకు ఇన్ని అవమానాలు అంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పద అంటుంది. పెళ్లి టైంలో కూడా ఇలాగే మనం వెళ్లిపోయాం ఇప్పుడు కూడా వెళ్లిపోతే ఎలా అంటూ కేదార్‌ ఓదారుస్తాడు. తర్వాత అందరూ గ్రూప్‌ ఫోటో దిగుతుంటే.. ధాత్రి, కేదార్‌లను గ్రూప్‌ ఫోటో దిగుదామని మాధురి పిలుస్తుంది. నేను తీసుకొస్తాను వదిన అంటూ నిషిక, ధాత్రి దగ్గరకు వెళ్లి మర్యాదగా వెళ్లిపోండి అని తిడుతుంది. మాధురి దగ్గరకు వచ్చి ధాత్రి, కేదార్‌లను చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget