Jagadhatri Serial Today December10th: హోంమినిష్టర్ ఫొటోను జగధాత్రి కాలికింద వేసి ఎందుకు తొక్కుతుంది? అది చూసిన మంత్రి ఏం చేసింది..?
Jagadhatri Serial Today Episode December 10th: తన అమ్మ పేరిట ఏర్పాటు చేసిన ఆశ్రమం ఓపెనింగ్‌కు హోంమినిస్టర్ తాయర్ వస్తుందని తెలిసి జగధాత్రి ఏం చేసిందో ఈ రోజు ఏపిసోడ్‌లో చూద్దాం

Jagadhatri Serial Today Episode: జగధాత్రి వాళ్ల అమ్మ కావ్య పేరిట వాళ్ల నాన్న కట్టించిన అనాథ ఆశ్రమం ఓపెనింగ్ కోసం కుటుంబం మొత్తం కలిసి వస్తుంది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఆశ్రమం కడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావని నిషికతోపాటు అల్లుడు యువరాజు కూడా అత్తను నిలదీస్తారు. మీరంతా ఉండి జగధాత్రిని ఆపలేకపోతున్నారు కానీ...ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉండి ఏం ఆపగలనని నిషిక తల్లి అంటుంది. ఇంతలో అక్కడికి వైజయంతి వచ్చి ఏదో చెప్పబోతుండగా...నిషిక ఆమెను దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించడంతో.. పాపం ఆమె ముఖం మాడ్చుకుని దూరంగా వెళ్లి నిల్చుంటుంది.
జగధాత్రి తన తల్లి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించి...ఆమె చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటుంది. ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఎన్ని మాటలు అన్నా...నీ కుటుంబం మొత్తం నీ వెంటే ఉందని చెబుతుంది. నీ కూతురుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నానని జగధాత్రి అంటుంది. నీ నిజాయితీని నేను నిరూపిస్తానని అంటుంది. ఆ రోజు దుర్మార్గులు మీ అమ్మను చంపి ఉండకపోతే...ఈరోజు నువ్వు ఆమెను మించిన పోలీసు ఆఫీసర్ అయినందుకు చూసి ఎంతో గర్వించేదని జగధాత్రి తండ్రి అనడంతో జేడీతోపాటు అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన మాటలకు జగధాత్రి, కేదార్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగా...మిగిలిన వాళ్లంతా నోరు వెళ్లబెడతారు. వాళ్ల నాన్న అలా చెప్పుకుంటూ పోతుండగా....వెంటనే జగధాత్రి ఆయన్ను ఆపి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అమ్మ నన్ను పోలీసును చేయాలని కోరుతుంది. కానీ నేను అవ్వలేకపోయాను కదా అంటుంది. ఈలోగా కౌషికి కూడా అనుమానం వస్తుంది. ముందురోజు రాత్రి జగధాత్రి మాట్లాడిన మాటలు...గుడిలో జేడీ తనను వదిన అని పిలిచిన పిలుపు అన్నీ రివైండ్ అవుతుంటాయి. జేడీ గురించి మాట్లాడితే జగధాత్రి కలవరపడటం అన్నీ గుర్తుచేసుకుంటుంది. ఇంతలో జగధాత్రి కూడా కొంత బయపడుతుంది. రాత్రి నేను చేసిన పనికే కౌషిక వదినకు అనుమానం వచ్చిందని...ఇప్పుడు మా నాన్న మాటలకు ఆమె అనుమానం ఖచ్చితంగా రెట్టింపు అవుతుందని అనుకుంటుంది.
ఇంతలో నిషిక కలుగజేసుకుని...మాకు తెలియకుండా పోలీసు అవ్వాలని ఏదైనా ట్రై చేస్తున్నావా ఏంటి అని నిలదీస్తుంది. కేదార్‌తోపాటు జగధాత్రి, వాళ్ల నాన్న అందరూ సైలెంట్‌గా ఉండటంతో ...కౌషిక్ అడుగుతుంది.ఏంటి అందరూ అలా ఉన్నారని నిలదీస్తుంది. ఇంతలో యువరాజు ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నవాళ్లలో ఎవరైనా పోలీసు ఉన్నారా ఏంటి అని కేదార్‌ను అడుగుతాడు. ఇంట్లో పని, స్కూల్ చూసుకోవడమే కుదరడం లేదు...ఇంకా మీకు తెలియకుండా పోలీసు ఎక్కడ నుంచి అవుతానని జగధాత్రి వాళ్లందరికీ అబద్ధం చెబుతుంది. దీంతో ఈ వివాదం సద్దుమణిగిపోతుంది. అందరూ వచ్చి కావ్య ఫొటోకు పూలు వేసి దండం పెట్టినా...నిషిక మాత్రం వేయదు. దీంతో జగధాత్రి ఆమెను పిలుస్తుంది. కానీ నిషి కోపంతో నేను పూలు వేయనని ఖరాఖండిగా చెబుతుంది.
నేనేకాదు...మా ఆయన,అత్తయ్య ఎవరూ ఆమెకు పూలు వేయరని అంటుంది. జగధాత్రి వాళ్ల పిన్ని కూడా నానా మాటలు అంటుంది. అవినీతిపరురాలైన మీ అమ్మకు మేం ఎందుకు దణ్ణం పెడతామని యువరాజుతోపాటు వైజయంతి కూడా అంటారు. ఇంతలో నిషిక కూడా కావ్యను తిట్టడంతో కోపంతో రగిలిపోయిన ఆమె తండ్రి...నిషిక చెంప పగులగొడతాడు.ఈ ప్రపంచానికి నా భార్య గురించి తెలియకపోవచ్చుగానీ...నాకు తెలుసు ఆమె గొప్పతనం అంటాడు. జగధాత్రి బ్రతిమాలడటంతో ఆమె పిన్ని వచ్చి పూలువేస్తుంది.సుధాకర్ గట్టిగా చెప్పడంతో వైజయంతితోపాటు యువరాజు పూలు వేస్తారు.తండ్రి గట్టిగా ఆదేశించడంతో నిషిక కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఫొటోకు పూలు వేసి నివాళులు అర్పిస్తారు.
అనాథ ఆశ్రమం ఓపెనింగ్ కోసం హోం మినిష్టర్ తాయర్ వస్తుందని తెలుసుకున్న జగధాత్రి కోపంతో రగిలిపోతుంది. ఏమైందని వార్డెన్ అడిగితే...మా అత్తయ్య చావుకు ఈ తాయర్,ఆమె భర్తే కారణమని కేధార్ చెబుతాడు. వాళ్ల స్వార్థానికే మా అత్తయ్య చనిపోయారని అంటాడు.ఆధారాలు లేకుండా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆ మినిస్టర్ చూస్తూ ఊరుకోదని యువరాజు అంటాడు.అతన్ని కౌషికి అడ్డుకుంటుంది. మినిష్టర్ ఫ్యామిలీకి, జగధాత్రి ఫ్యామిలీకి సంబంధాలు బాగాలేవు కాబట్టి...ఆశ్రమాన్ని హోంమినిష్టర్ ఓపెన్ చేయకుండా ఉండటమే మంచిదని చెబుతుంది. కానీ ఆమె పిలిచామని...ఆవిడ కూడా వచ్చేస్తోందని ఈ టైంలో నేను ఏం చేయగలనమ్మా అంటాడు.
ఆవిడ ఈ ఆశ్రమం ఓపెన్ చేస్తే ...మా అమ్మ ఆత్మ శాంతించదని జగధాత్రి అంటుంది. ఆవిడను ఇక్కడికి రాకుండా పింపించేయండని వేడుకుంటుండగా...నిషిక వచ్చి హోంమినిష్టర్ ఫెక్సీపై ఉన్న ఫొటోను కాలితో తొక్కుతూ...ఆయన పంపించేది ఏంటి మనమే పంపించేద్దాం అంటుంది. ఇంతలో వాళ్ల అమ్మ అక్కడికి వచ్చి నీకు ఏమైనా పిచ్చిపట్టిందా....నువ్వు చేస్తున్న పని మినిష్టర్ చూస్తే చంపేస్తుందని అంటుంది. అదే నా ప్లాన్ కూడా అని అంటుంది. ఇంతలో జగధాత్రి నిషికను పక్కకు లాగేస్తుంది.
ఈవిడ వల్లే కదా మీ అమ్మ చనిపోయింది...అందుకే మినిష్టర్‌ను మనమే తన్ని తరిమేద్దాం అంటుంది. అంతలో హోం మినిస్టర్ అక్కడికి రాగా...నిషికను పక్కకు లాగి అదే ఫ్లెక్సీపై జగధాత్రి నిల్చుని ఉండటం మినిష్టర్ తాయర్ చూస్తుంది. పరుగున అక్కడికి వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా ఫొటోను తొక్కుతావు అంటూ జగధాత్రిని నిలదీస్తుంది. ఇందంతా నిషిక కావాలనే చేసిందని జగధాత్రికి తెలుస్తుంది. ఇంతలో హోంమినిష్టర్ వార్డెన్‌ను పిలిచి గట్టిగా తిడుతుంది.ఈ జగధాత్రికి ఇక్కడ ఏం పని అని...రెండు నిమిషాల్లో వీళ్లను ఇక్కడ నుంచి పంపించేయాలని ఆదేశిస్తుంది. ఇంతలోజగధాత్రి కల్పించుకుని...ఒకసారి తల పైకి ఎత్తి బోర్డు చూడండి అని చెప్పడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.





















