Jagadhatri Serial Today December29th: కౌషికి భూమిపూజ చేసిన స్థలం వివాదం ఏంటి..? జగధాత్రి కుటుంబం అవమానభారంతో ఎందుకు ఇంటిముఖం పట్టింది..?
Jagadhatri Serial Today Episode December 29th: కౌషికి భూమి పూజ చేసిన స్థలం తమదని హోంమినిష్టర్ కోర్టు నుంచి స్టే తీసుకొస్తుంది. దీంతో అవమానభారంతో అందరూ ఇంటికి తిరిగి వెళ్తారు.

Jagadhatri Serial Today Episode: కౌషికి భూమి పూజచేస్తున్న స్థలం వద్దకు వచ్చిన హోంమినిష్టర్ తాయర్ అనుచరుడు అభి గొడవచేస్తుండగా...కేదార్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో కౌషికి పోలీసులను పిలుస్తామని చెప్పడంతో...మా సైట్‌లో శంకుస్థాపన చేసి మమ్మల్నే పోలీసులకు పట్టిస్తారా అని అభి నిలదీయడంతో కౌషికి షాక్‌కు గురవుతుంది. కావాలంటే పేపర్‌లు చూసుకోమ్మని అభి వారికి ఆ పేపర్లు చూపిస్తాడు. ఇంతలో వైజయంతి, నిషిక రెచ్చిపోతారు. మేం చెప్పినా వినకుండా రోడ్డున పోయే వాళ్లందరితో పూజలు చేయిస్తే ఇలాగే జరుగుతుందని అంటారు. ఇంతలో అభి కల్పించుకుని మీ ఇంటి గొడవలు ఇంట్లో చూసుకోండని...ఇప్పుడుమాత్రం ల్యాండ్ ఖాళీచేయాలనిఅంటాడు.గత నెలలోనే ఈ భూమిని మేం కొనుగోలు చేశామని...కావాలంటే పేపర్లు చూపిస్తామని కౌషికి అంటుంది. దీంతో మేం గత ఏడాది కొన్న సైట్...లాస్ట్ మంత్‌లో మీరు ఎలా కొంటారని అభి నిలదీస్తాడు. మనల్ని ఎవరో మోసం చేశారని వైజయంతి అనగా....అలాంటిదేమీలేదని హోంమినిష్టర్ కావాలనే తప్పుడు పత్రాలతో వచ్చి గొడవ పడుతున్నట్లు ధాత్రి అంటుంది. ఇది పక్కా ఫేక్ డాక్యుమెంట్ అని అంటారు. ఇంతలో అభి తన మనుషులతో అక్కడ టెంటు పీకేందుకు దాడి చేయిస్తాడు. అప్పుడు యువరాజు, కేదార్ ఇద్దరూ కలిసి రౌడీలను తుక్కుతుక్కుగా కొడతారు.జగధాత్రి కూడా రంగంలోకి దిగడంతో రౌడీలు పారిపోతారు. ఈ ల్యాండ్ గురించి ఏమైనా తేల్చుకోవాలంటే కోర్టులో తేల్చుకుందామని కౌషికి హోంమినిష్టర్‌కు వార్నింగ్ ఇస్తుంది.దీనికి హోంమినిస్టర్ రిప్లై ఇస్తూ....లాయర్‌ను పంపింస్తుంది. కోర్టు నుంచి లాయర్ స్టే ఆర్డర్ తీసుకుని వస్తాడు. దీంతో వాళ్లంతా అక్కడి బోర్డులు పీకేసి, టెంటు కూల్చేస్తారు.
ఇంతలో నిషిక ఫోన్ తీసుకుని ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని మినిష్టర్‌తో అంటుంది. దీంతో ధాత్రి నిషికపై కోప్పడుతుంది. మనల్ని అవమానించి మినిష్టర్‌తో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని అంటుంది. కానీ నిషిక హోంమినిష్టర్‌ను రిక్వెస్ట్ చేయగా....కౌషికి వచ్చి నా కాళ్లుపట్టుకుని క్షమాపణలు చెప్పాలని తాయారు అంటుంది. జగధాత్రికి కూడా వార్నింగ్ ఇస్తుంది. అనాథ శరణాలయానికి మీ అమ్మ పేరు పెట్టలేకపోయావు...ఇప్పుడు కౌషికిని ఓడిపోయేలా చేశావని అంటుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుందని అంటుంది. ఇక తన మనుషులను అక్కడ నుంచి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
అవమానభారంతో ఇంటికి వెళ్లిపోయిన కౌషిక తీవ్రంగా మథనపడుతుంది. ఆ ప్రాజెక్ట్ మన పరువుకు ప్రతిష్టలాంటిదని..ఎట్టి పరిస్థితుల్లోనూ అది చేజారిపోకూడదని కేదార్‌తో కౌషికి అంటుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే మన దగ్గర డబ్బులు లేక ప్రాజెక్ట్ ఆపేశామని నెగిటివ్ టాక్ బయటకు వస్తుందని అంటుంది. ఒరిజనల్ డాక్యుమెంట్ ఉన్న మనం బయపడాల్సిన పనిలేదని ధాత్రి అంటుంది.ఈ కొన్నిరోజులు చాలని నెగిటివ్ టాక్ వచ్చేస్తుందని కౌషికి భయపడుతుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏదో ఒకటి చేయాలని అంటుంది. కానీ హోంమినిస్టర్‌ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని కేదార్,ధాత్రి చెబుతారు. చూద్దాం ఏమవుతుందోనని చెప్పి లోపలికివెళ్లిపోతుంది.
ఇన్నిరోజులు మనజోలికి వచ్చింది కాబట్టే ఊరుకున్నామని...ఇప్పుడు మన ఇంటి వరకు మినిస్టర్ అరాచకాలు వచ్చాయని...ఇక చూస్తూ ఊరుకునేది లేదని కేదార్ జగధాత్రితో అంటాడు.ముందు తాయర్‌ను ఆ సీటులో నుంచి దింపితే దాని పొగరు దిగొస్తుందని జగధాత్రి అంటుంది. మినిస్టర్ గతం వెతుక్కుంటూ వెళ్తేనే మనకు సాక్ష్యాలు దొరుకుతాయని అంటుంది. వెంటనే ధాత్రికి ఓ పేరు గుర్తుకొస్తుంది. మినిస్టర్ పాతికేళ్ల క్రితం పనిమనిషిగా పనిచేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ వాళ్ల తమ్ముడు గంగాధర్ అని చెబుతుంది. గతంలోనే అతన్ని విచారించినప్పుడు ఎలాంటి ఆధారాలు దొరకలేదు కదా అని కేదార్ అంటాడు. మరోసారి అడిగితే ఏదైనా చెప్పొచ్చని ధాత్రి అంటుంది.ఇదే విషయాన్ని సాధూ సార్‌కు చెప్పగా...రేపు ఆఫీసుకు పిలిపిస్తానని మీరు వచ్చేయండని చెబుతాడు.





















