Jagadhatri Serial Today August 19th: జగద్ధాత్రి సీరియల్: కేథార్ మహాల్ వారసుడా! యువరాజ్, నిషికలకు దిమ్మతిరిగే న్యూస్.. మంత్రసాని చేతిలో కేథార్ ఫ్యూచర్!
Jagadhatri Serial Today Episode August 19th కేథార్ మహాల్ వారసుడని కేడీ, జేడీలతో పాటు యువరాజ్, నిషికలకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode గుమస్తా తనదే ఆస్తి అని అమ్మకానికి పెడతాడు. జేడీ, కేడీలు అక్కడికి వెళ్తారు. ఎవరి ఆస్తి ఎవరికి అమ్ముతున్నారని ప్రశ్నిస్తారు. దాంతో గుమస్తా జేడీకి డాక్యుమెంట్స్ చూపిస్తాడు. జేడీ వాటిని చూసి కేథార్‌కి చూపిస్తుంది. దాంతో కేథార్ ఆయనకు మీ పూర్వీకలు తాతగారి ఇంటి పేరు ఏంటో చెప్పండి అని అడుగుతాడు.
గుమస్తా మనసులో డాక్యుమెంట్స్‌లో లాయర్ ఏం పెట్టాడో అర్థం కావడం లేదే ఇలా ఇరుక్కున్నాను ఏంటి అని అని గట్టమనేని అని చెప్తాడు. దాంతో జేడీ మరేంటి ఇందులో ఇంద్రగిరి అని అందని అంటుంది. భేరానికి వచ్చిన వాళ్లు కూడా షాక్ అయిపోతారు. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలిపోవడంతో అతను గుమస్తాని తిడతారు. పోలీసులకు అప్పగిస్తామని అంటే మేం కూడా పోలీసులమే అని కేడీ అంటాడు. గుమస్తా తన రౌడీలను పిలిచి జేడీ, కేడీలకు కొట్టమని అంటాడు. జేడీ, కేడీలు రౌడీలను చితక్కొడతాడు. మరోవైపు యువరాజ్ అక్కడికి వచ్చి మొత్తం చూస్తాడు. నిషిక కూడా యువరాజ్‌కి తెలీకుండా అక్కడికి చేరుకుంటుంది. ఇద్దరు రెండు వైపుల నుంచి అక్కడేం జరుగుతుందో చూస్తుంటారు.
నిషిక చూసి జగద్ధాత్రి, కేథార్ వస్తారు అనుకుంటే జేడీ, కేడీలు వచ్చారేంటి అని అనుకుంటుంది. జేడీ, కేడీలు గుమస్తాకి గన్ గురి పెట్టి వచ్చిన ప్రతీ పోలీస్‌ని చంచేసి దెయ్యాలు అని భయపెడుతున్నారని ఎందుకు అని అడుగుతుంది. దాంతో గుమస్తా నిజం చెప్తేస్తా అని దీని వెనక ఉంది మీనన్ అని గుడిలో గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకున్న మీనన్ ఊరిని సొంతం చేసుకోవడానికి ఊరిలో దెయ్యాలు అని భయపెట్టి ఊరి నుంచి అందర్నీ తరిమేశాడని ఆఫీసర్లను చంపేశాడని.. మీనన్ మహాల్‌ని మహాల్‌కి చెందిన ఆస్తులు తనకు ఇచ్చేస్తానని డీల్ కుదిరిందని అంటాడు. కేడీ, జేడీల తప్పు చేసిన గుమస్తాని చంపేస్తామని అంటే గుమస్తా వద్దని బతిమాలుతాడు.
జేడీ, కేడీలు వదిలేస్తామని తనకు కొంత సమాచారం కావాలని అడుగుతారు. గుమస్తా చెప్తానని అంటాడు. కేడీ తన తల్లి ఫొటో చూపించి ఈవిడ గురించి నీకు ఏం తెలుసు.. అని అడిగితే గుమస్తా కేడీ వాళ్లతో ఈవిడ పేరు సుహాసిని దేవి.. ఈవిడ ఈ సంస్థానానికి వారసురాలు అని చెప్తాడు. కేడీ, జేడీలతో పాటు యువరాజ్, నిషిక బిత్తర పోతారు. కొన్నేళ్ల క్రితం వజ్రపాటి సుధాకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని అందుకే తనని పుట్టింటి వాళ్లు దూరం పెట్టారని గర్భవతిగా వచ్చినా కూడా చేరదీయలేదని ఆ మహాతల్లి చాలా అవస్థలు పడిందని చెప్తాడు. కేథార్ చాలా బాధ పడతాడు. ఈ ఊరిలోనే మంత్రసాని ఆవిడకు పురుడు పోసిందని ఆవిడకు మగ బిడ్డ పుట్టాడని గుమస్తా చెప్తాడు. కేథార్ చాలా ఏడుస్తాడు. గుమస్తా వెళ్లిపోతాను అంటే జేడీ తీసుకెళ్లి నువ్వు మా కస్టడీలో ఉండాలని తీసుకెళ్తుంది.
కేథార్ తల్లి ఫొటోతో పాటు ఆ మహాల్‌ని తనివితీరా చూస్తుంది. కేథార్ మంత్రసానిని కలిస్తే పుట్టక గురించి తెలిసిపోతుందని మంత్రసానిని కలిసి సాక్ష్యాలు లేకుండా చేయాలని వెళ్తాడు. నిషిక కూడా అదే అనుకొని వెళ్తుంది. కేథార్, జగద్ధాత్రిలు మంత్రసాని దగ్గరకు బయల్దేరుతారు. ఇక నిషిక, యువరాజ్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇది ఎలాంటి ప్లేసో తెలుసా నీకు ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు త్వరగా వెళ్లిపో అని అంటే నిషిక వెళ్లను అని చెప్తుంది. ఇద్దరూ మంత్రసాని దగ్గరకు వెళ్లాలి అనుకుంటారు. నిషిక యువరాజ్‌తో జగద్ధాత్రి, కేథార్ వస్తారు అనుకుంటే జేడీ, కేడీలు వచ్చారేంటి అని అడుగుతుంది. యువరాజ్ మనసులో ఆ కేథార్‌నే ఈ కేడీ అందుకే వాడి స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఇక యువరాజ్ రౌడీలను పిలుస్తాడు.
జేడీ, కేడీలు మంత్రసాని ఇంటికి వెళ్తారు. మంత్ర సాని బయటకు వెళ్లిందని తెలిసి వెయిట్ చేస్తారు. యువరాజ్ రౌడీలు రావడంతో తాను వాళ్లతో వెళ్తానని నిషికని ఇంటికి పంపేస్తాడు. యువరాజ్ మంత్రసానిని పట్టుకొని గన్ గురి పెట్టి కేథార్ తల్లి డిటైల్స్ అడుగుతాడు. జేడీ, కేడీలు అక్కడికి వచ్చి యువరాజ్ బెదిరించడం చూసి యువరాజ్‌కి జేడీ గన్ గురిపెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















