Jagadhatri Serial Today August 18th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్, కేథార్‌ల మధ్య నడుస్తున్న కథలో ట్విస్ట్! మహాల్‌కి జేడీ, కేడీలు వెనకాలే యువరాజ్!
Jagadhatri Serial Today Episode August 18th జగద్ధాత్రి, కేథార్‌లు రౌడీని చంపడానికి వెళ్లడం యువరాజ్ ముందే వెళ్లి అక్కడ రౌడీని కొట్టి చనిపోయేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి జరిగిన విషయం తలచుకొని వణికిపోతూ తిండి కూడా తినకుండా ఏడుస్తూనే ఉంటుంది. జగద్ధాత్రి కేథార్‌తో వదిన బాధలో ఉండి నీ మీద ప్రేమ మనసులో దాచుకోలేక కట్టలు తెంచుకుంది. వదిన మనసులో నీ స్థానం ఏంటో అర్థమైంది కదా అని అంటుంది.
జగద్ధాత్రి మాటలకు కేథార్ నేను అక్క అనుకున్న మంచోడిని కాదు.. అక్క మీద చేయి వేసిన వాడిని ఇంకా ఏం చేయలేకపోతున్నా చూశావా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అని ఆ రౌడీ అడ్రస్ కార్డు చూపించి మా అక్క మీద చేయి వేసిన వాడికి ఈ భూమ్మీద బతికే అర్హత లేదు అని అంటాడు. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ రౌడీ ఉన్న లొకేషన్‌కి బయల్దేరుతారు. మరోవైపు యువరాజ్ అక్క మీద చేయి వేసిన రౌడీని చంపేస్తా అనుకుంటూ బయల్దేరుతాడు. రౌడీ చాలా భయపడతాడు. యువరాజ్ అన్న ఏం చేస్తాడో మత్తులో తప్పుగా ప్రవర్తించానని అనుకుంటాడు.
యువరాజ్ ఆ రౌడీ ఉన్న లొకేషన్‌కి వెళ్లి ఈ వజ్రపాటి యువరాజ్ అక్కని తాకడానికి నీకు ఎంత ధైర్యంరా అని రౌడీచి చావకొడతాడు. మరోవైపు జగద్ధాత్రి, కేథార్ కూడా అక్కడికి వచ్చేస్తారు. యువరాజ్ రౌడీని చితక్కొడతాడు. నా అక్క మీదే చేయి వేస్తావా అని రౌడీని చంపేసే పరిస్థితికి వస్తాడు. యువరాజ్ రౌడీకి గన్ గురి పెట్టి నువ్వు చేసిన తప్పునకు చచ్చిపోరా అని అంటాడు. రౌడీ ఎంతో బతిమాలుతాడు. అయినా యువరాజ్ వినడు. ఇంతలో జగద్ధాత్రి, కేథార్ అక్కడికి వస్తారు. రౌడీ తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. రౌడీ పరుగెడుతూ మేడ మీదకు వెళ్తాడు. యువరాజ్, కేథార్, జగద్ధాత్రి వెనక పరుగెడతారు. రౌడీ మేడ మీద తప్పించుకునే దారిలేక కింద పడి చనిపోతాడు.
కేథార్, యువరాజ్‌లు మా చేతిలో చనిపోవాల్సిన వాడు చనిపోకుండా అయిపోయాడు అని డిసప్పాయింట్ అవుతారు. కేథార్ యువరాజ్‌తో నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా నేను చేయాలి అనుకున్న పని నువ్వు చేశావని అంటాడు. దాంతో యువరాజ్ నువ్వు చేయాలి అనుకున్న పని నేను చేయలేదు. నేను చేయాలి అనుకున్నా కాబట్టి చేశానని చెప్తాడు. జగద్ధాత్రి యువరాజ్‌తో వాడు ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఎంక్వైరీ చేశానని అంటాడు. ఇంత త్వరగా నీకు ఎలా తెలిసింది అని అడిగితే మీ సర్కిల్ మీకు ఉంటే నా సర్కిల్ నాకు ఉంది అని అంటాడు. యువరాజ్ మంచోడు కానీ కొంచెం మార్చుకోవాలని అనుకుంటారు. ఇక కేథార్ తన టీమ్‌కి కాల్ చేసి రౌడీ చనిపోయిన విషయం చెప్పి గుర్తు తెలియని బాడీగా కేసు రాయమని అంటాడు.
జగద్ధాత్రికి ఆదిత్యపురం నుంచి వాచ్‌మెన్ కాల్ చేస్తాడు. మహాల్ గుమస్తా వచ్చి మహాల్ అమ్మడానికి పార్టీని తీసుకొచ్చాడని త్వరగా వచ్చి మాట్లాడమని అంటాడు. జగద్ధాత్రి, కేథార్ బయల్దేరుతారు. యువరాజ్ మొత్తం విని సాక్ష్యాల కోసం వెళ్తున్నారా అనుకుంటాడు. ఇంతలో నిషిక కాల్ చేస్తే విషయం చెప్పి ఫాలో అవుతున్నానని అంటాడు. నిషిక వస్తాను అంటే వద్దని వాళ్లు ఎలా ఆధారాలు సంపాదిస్తారో నేను చూస్తా అంటాడు. నిషిక తనలో తాను కేథార్ ఈ ఇంటి పెద్ద కొడుకు అయినా పర్లేదు కానీ జగద్ధాత్రి మాత్రం పెద్ద కోడలు కాకూడదు.. నాకు తోటి కోడలు అస్సలు కాకూడదు అనుకుంటుంది. సాక్ష్యాలు తారు మారు చేయడం యువరాజ్ ఒక్కడి వల్లే కాదని తన వల్ల అవుతుందని బయల్దేరుతుంది.
గుమస్తా వాళ్లకి అది తన మహాల్ అని చెప్పి అమ్మడానికి ప్రయత్నిస్తాడు. జేడీ, కేడీలు వెళ్తుంటే ఎదురుగా పిచ్చి వాడు అయిపోయిన ఓ డాక్టర్ కారుకి అడ్డుగా వెళ్లి వెళ్లిపోండి వెళ్లిపోండి అక్కడ అన్నీ శవాలే నాశనం అని రకరకాలు అంటాడు. ఇక కేథార్ బయటకు దిగితే కేథార్‌ని చూసి వెళ్లు నీకు కావాల్సింది ఇక్కడే ఉంది.. ఈ సంస్థానం నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు. జేడీ, కేడీలు మంచి రోజులు వచ్చాయని అనుకుంటారు. జగద్ధాత్రి, కేథార్‌లు జేడీ, కేడీలుగా ఎంట్రీ ఇవ్వడం చూసిన యువరాజ్ ఈ కేథార్ ఏంటి జగద్ధాత్రితో బయల్దేరి జేడీతో వచ్చాడేంటి అనుకుంటారు.
జేడీ, కేడీలు వెళ్లి ఎవరి ఆస్తి ఎవరు అమ్ముతున్నారు అని ప్రశ్నిస్తుంది. డాక్యుమెంట్స్ చూపించారు అని అతను అంటే అలాంటి డాక్యుమెంట్స్ మేం గంటలో సృష్టించగలం అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















