Jagadhatri Serial Today August 15th: జగద్ధాత్రి సీరియల్: నిజం తెలిస్తే చంపేస్తారన్న భయంలో అత్తాకోడళ్లు.. కేథార్, యువరాజ్ ఆవేశం ఏం జరగనుంది!
Jagadhatri Today Episode August 15th యువరాజ్‌కి రౌడీ కౌషికి జీవితం నాశనం చేయాలని ప్రయత్నించాడని తెలియడం యువరాజ్ ఆవేశంగా వెళ్లడంతో జగద్ధాత్రికి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి రౌడీ చేసిన వీరంగానికి కింద పడి ఏడుస్తుంది. జగద్ధాత్రి వాళ్లు ఓదార్చుతారు. పిల్లల్ని పట్టుకొని కౌషికి చాలా ఏడుస్తుంది. జగద్ధాత్రి మాట్లాడాలి అని ప్రయత్నించినా కౌషికి ఉలుకు పలుకు లేకుండా ఏడుస్తుంది. అందరూ భయపడతారు. కేథార్ అక్కడికి వస్తాడు.
కౌషికి భయంతో జగద్ధాత్రి వాడు వాడు అని ఏడుస్తూ కేథార్ ఎక్కడ అని ఏడుస్తుంది. ఇక్కడే ఉన్నాను అక్కా అని కేథార్ అని ఇక నుంచి ఒక్క క్షణం నిన్ను వదలను.. వాడిని వదలను అక్క వాడి చావు వాడే వెతుక్కుంటూ వచ్చాడు. వాడి అంతు చూసేవరకు నిద్రపోను. నీ మీద చేయి వేసిన వాడి చేతులు విరిచేస్తా అని కేథార్ రౌడీని తిడతాడు. నిషిక, వైజయంతిలు భయపడతారు. కేథార్ వాడిని చంపేస్తా అని వెళ్తుంటే కౌషికి ఆపి వాడు అంతకంతా అనుభవిస్తాడు. కానీ వాడు నాకు చావు భయం చూపించాడు. నేను అంత ఈజీగా మర్చిపోలేను అని ఏడుస్తుంది. వైజయంతి, నిషికలు గదిలోకి వెళ్లిపోతారు. కేథార్ ఆవేశంగా బయటకు వెళ్తాడు. జగద్ధాత్రి బాబుని పడుకోపెడతా అని తీసుకుంటుంది.
వైజయంతి నిషికతో పాపం అమ్మీ కౌషికి చాల భయపడిపోయింది.. ఏ ఆడపిల్లకి అలాంటి కష్టం రాకూడదు అని జాలి చూపిస్తుంది. నిషిక అత్తతో వదిన ఇప్పుడు సేఫ్ కానీ మనం కాదు మన పరిస్థితి ఆలోచించండి అత్తయ్యా.. ఇదంతా చేసింది మనమే అని జగద్ధాత్రి, కేథార్‌లకు తెలిస్తే మనల్ని చంపేస్తారు అని అంటుంది. వైజయంతి కూడా చాలా భయపడుతుంది. నిషిక అత్తతో కేథార్ ఆవేశంగా వెళ్లాడు మనకి ఇక శుభంకార్డు పడిపోతుందని మనల్ని బతకనివ్వురు అని చాలా టెన్షన్ పడిపోతారు. వైజయంతి ఇంకా టెన్షన్ పడుతుంది. ఈ టెన్షన్‌తో పోయే కంటే హార్ట్అటాక్ వచ్చి చనిపోతే బెటర్ రేపు ఆయనకు ఈ విషయం తెలిస్తే అది కూడా మనమే చేశామని తెలిస్తే చంపేస్తారని అనుకుంటుంది.
కేథార్ బయట కారులో వతికి వెతికి విజిటింగ్ కార్డు పట్టుకొని అయిపోయావురా అని అనుకుంటాడు. జగద్ధాత్రి బాబుని ఒడిలో పడుకోపెట్టుకొని కౌషికిని మరోవైపు పడుకోపెట్టుకొని వదినకు చావు భయం చూపించిన వాడిని చంపేయాలని గన్ తీస్తుంది. ఉదయం సుధాకర్‌కి విషయం తెలిసి నీ జీవితం పాడు చేయాలి అనుకున్నవాడిని వాడి వెనక ఉన్నవారిని వదలను అని అంటాడు. వైజయంతి చాలా భయపడుతుంది. ఎప్పుడూ నిద్ర పట్టని నాకు రాత్రి విపరీతంగా నిద్ర పట్టేసిందని సుధాకర్ అంటాడు. జగద్ధాత్రి ఆ మాటతో ఆలోచనలో పడుతుంది. మన పని గోవింద అత్తయ్యా అని నిషిక వైజయంతితో చెప్తుంది. ఇదంతా మీ వల్లే అత్యయ్య వీలునామా దొంగతనం చేయమని చెప్పింది మీరే అని చెప్పేస్తా మేం సేఫ్ అని నిషిక అంటుంది. వైజయంతి కోడలితో ఓసేయ్ మీ కోసం ఇంత చేస్తే మీరు నా మీద తోసేస్తారా.. అయినా వాడిని కన్నందుకు నిన్ను కోడల్ని చేసుకున్నందుకు నాకు తప్పదు కదా అని కౌషికిని ఓదార్చుతుంది. అందరూ కౌషికిని బాధ పడొద్దని చెప్తారు.
కౌషికి ఏడుస్తూ నేను మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నా కానీ అది తలచుకుంటే కళ్ల ముందు ఏం కనిపించడం లేదు. ఒక్క క్షణం కేథార్ లేటుగా వచ్చుంటే నా జీవితం ఏమైపోయేది.. నా పిల్లలతో నేను కన్న నూరేళ్ల జీవితం ఏమైపోయేది. ఒక్క క్షణం ఆలస్యం అయింటే నా బతుకు ఏమైపోయేది.. నా జీవితం అయిపోయింది అని నేను అనుకున్న టైంలో వచ్చాడు బాబాయ్ కేథార్.. నా తమ్ముడు.. నా కోసమే పుట్టాడు బాబాయ్.. నాకు ఏ కష్టం వచ్చినా అది నా కంటే ముందు వాడికే తెలిసిపోతున్నట్లు ఉంది.. వాడిని నాకోసమే ఆ దేవుడు ఇక్కడికి పంపించుంటాడు బాబాయ్.. వాడిని చూడగానే ఒక్క సారి ఊపిరి పీల్చుకున్నాను బాబాయ్ వాడు రావడం లేటు అయింటే మీకు మీ కూతురు దక్కేది కాదు.. నా పిల్లలకు ఈ తల్లి దక్కేది కాదు అని కౌషికి ఏడుస్తుంది. కౌషికి తన గురించి చెప్పడం విన్న కేథార్ హ్యాపీగా ఫీలవుతాడు.
యువరాజ్ అంతా తనకు అనుకూలంగా జరుగుంటుందని అనుకొని అందరూ వీలునామా పోయింటుందని బాధ పడుతుంటారు అని సంతోషపడతారు. బయట రౌడీ కారు చూసి వీడి కారు ఏంటి ఇక్కడ ఉందని అనుకుంటాడు. యువరాజ్ రాగానే వైజయంతి యువరాజ్ మీద కోప్పడుతుంది. రాత్రి ఎందుకు రాలేదు.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని తిడుతుంది. ఏమైందని యువరాజ్ అడిగితే నిషిక జరిగింది అంతా చెప్తుంది. రౌడీ వచ్చి కౌషికి జీవితం నాశనం చేయాలి అనుకున్నాడని తెలియగానే ఆవేశంగా బయటకు వెళ్తాడు. నా అక్క మీదే చేయి వేస్తాడా ఆ నా కొడుకుని వదలను అని యువరాజ్ ఆవేశంగా వెళ్తాడు. జగద్ధాత్రికి యువరాజ్ ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. యువరాజ్ రౌడీని చంపేస్తా అనుకుంటూ వాడికి కాల్ చేస్తుంటాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు.. మరోవైపు అందరూ కౌషికిని తినమని బతిమాలుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















