Jabardasth Mohan Wedding : పెళ్లి చేసుకున్న ‘జబర్దస్త్’ లేడీ గెటప్ మోహన్ - గుర్తుపట్టారా?
Jabardasth Mohan : జబర్దస్త్ కమెడియన్ మోహన్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. అతని పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Jabardasth Mohan Ties the Knot in Grand Wedding : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఆడియన్స్ లో ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చి సెలబ్రిటీలు గా మారారు. టీం లీడర్స్ తో పాటు కొందరు టీం మేట్స్ కూడా తమ కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే జబర్దస్త్ లో కొందరు మగవాళ్ళు లేడీ గెటప్స్ వేసి నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో మోహన్ కూడా ఒకరు. జబర్దస్త్ లో రాకెట్ రాఘవ టీం లో మోహన్ లేడీ గెటప్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ప్రతి స్కిట్లో లేడీ గెటప్ వేస్తూ తన కామెడీతో ఆకట్టుకున్న మోహన్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయి.
ఘనంగా 'జబర్దస్త్' మోహన్ పెళ్లి
జబర్దస్త్ షోలో రాకెట్ రాఘవ టీం లో లేడీ గెటప్ తో ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. అందులో కోకిల పేరుతో చేసిన స్కిట్ బాగా వైరల్ అయింది. ఆ స్కిట్ తో రాఘవ టీంలో మెయిన్ లీడ్ గా మోహన్ కొనసాగుతూ వస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి మోహన్ రాకెట్ రాఘవ టీం లో కమెడియన్ గా చేస్తున్నాడు. ఒకప్పుడు లేడీ గెటప్ అంటే ఎక్కువగా వినోద్ కనిపించేవాడు. కానీ ఈ మధ్యకాలంలో మోహన్ లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటున్నాడు. మోహన్ చీర కట్టి లేడీ గెటప్ వేస్తే నిజంగా అమ్మాయిలాగే కనిపిస్తుంటాడు. తన స్లాంగ్, కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన జబర్దస్త్ కమెడియన్ తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు.
ఈనెల 31వ తేదీన మోహన్ పెళ్లి ఘనంగా జరిగింది. మోహన్ వారి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. విజయవాడలో ఈ పెళ్లి జరిగినట్లు సమాచారం. ఈ పెళ్లికి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జబర్దస్త్ కమెడియన్ నవీన్ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ మోహన్ భార్య చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హాజరైన 'కమెడియన్స్'
View this post on Instagram
విజయవాడలో జరిగిన మోహన్ పెళ్లికి కొందరు జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు. ఈ వేడుకలో రాకెట్ రాఘవ, అదిరే అభి, అప్పారావు, గడ్డం నవీన్, వినోద్ తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కమెడియన్స్ సమక్షంలో మోహన్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మోహన్ పెళ్లి ఫోటోలను చూసిన నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మోహన్ ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు కొన్ని చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటున్నాడు.
Also Read : నవదీప్‌కు పెళ్లి, వెడ్డింగ్ కార్డు వైరల్ - ఇంతలోనే ట్విస్టు!
View this post on Instagram