అన్వేషించండి

Actor Navdeep: నవదీప్‌కు పెళ్లి, వెడ్డింగ్ కార్డు వైరల్ - ఇంతలోనే ట్విస్టు!

మోస్ట్ ఎలిజబుల్ టాలీవుడ్ హీరో నవదీప్ అభిమానులకు భలే ట్విస్ట్ ఇచ్చాడు. వెడ్డింగ్ కార్డు షేర్ చేసి, చివరకు అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చాడు.

Actor Navdeep Shared His Wedding Card: టాలీవుడ్ హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. 2004లో ‘జై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవదీప్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్నారు. హీరోగా సత్తా చాటారు. నెమ్మదిగా హీరో నుంచి హీరో ఫ్రెండ్ గా కనిపిస్తున్నారు. పాత్ర ఏదైనా తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ మూవీ ‘ఈగల్’లో కీలక పాత్ర పోషించారు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

ఇక సోషల్ మీడియాలో నవదీప్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ట్రెండింగ్ లో ఉన్న  డైలాగ్స్, సాంగ్స్ తో రీల్స్ చేస్తూ అభిమానులను అకట్టుకుంటున్నారు. ఆయన రీల్స్ చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఆయన వయసు 40 ఏళ్లు దగ్గర పడుతున్నా, ఇంకా పెళ్లి చేసుకోలేదు. గత కొంత కాలంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు? అనే ప్రశ్నే ఎదురవుతుంది. ఎవరు ఎన్ని ప్రశ్నలకు అడిగినా, తన పెళ్లి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు నవదీప్. 

వెడ్డింగ్ కార్డు షేర్ చేసిన నవదీప్

తాజాగా ఆయన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఆయన ఓ వెడ్డింగ్ కార్డు షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. మీరు చాలా కాలంగా అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరికింది అని చెప్తూ, పెట్టెలో ఉన్న పెళ్లి పత్రికను చూపించాడు. అందరూ అది నిజంగా నవదీప్ పెళ్లికార్డు అని భావించారు. కానీ, చివరకు ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. “అది పెళ్లి కార్డు కాదు ‘లవ్ మౌళి’ రిలీజ్ డేట్ అనౌన్సింగ్ కార్డు అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

ఏప్రిల్ 19న ‘లవ్ మౌళి’ విడుదల

నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ మౌళి’. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతోంది. ఇదే విషయాన్ని నవదీప్ పెళ్లికార్డుతో చెప్పారు. ఈ కార్డులో పెళ్లి కొడుకు పేరు దగ్గర నవదీప్ అని ఉండగా.. పెళ్లి కూతురు స్థానంలో పంఖురి గిద్వానీ అని రాశారు. ఇక ముహుర్తం స్థానంలో రిలీజ్ డేట్‌ ను వేశారు. పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేసి ‘లవ్ మౌళి’ సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ షేర్ చేసిన వెడ్డింగ్ కార్డు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావేమో అనుకుంటే భలే ట్విస్ట్ ఇచ్చావు బాసూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

Read Also: 'టిల్లు స్క్వేర్’ టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించిన చిరంజీవి - ఇది ‘అడల్ట్’ కాదు, అందరూ చూడొచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget