అన్వేషించండి

Jabardasth Avinash : మొదటి సంపాదనతో మందు తాగాను.. ప్రపంచంలో ఎవడైనా అలాగే చేస్తాడు - ‘జబర్దస్త్’ అవినాష్

Jabardasth Avinash: జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు కామెడియన్‌గా పరిచయమయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్‌గా పాపులారిటీ సంపాదించుకున్న తను ఫస్ట్ సంపాదనతో తాగానని ఆసక్తికర విషయం బయటపెట్టాడు.

Jabardasth Avinash About First Salary: ‘జబర్దస్త్’ అనే కామెడీ షో వల్ల ఎంతోమంది కమెడియన్లకు ఫేమ్ లభించింది. అందుకే వారందరూ తమ పేర్లకు ముందు జబర్దస్త్ అనే ట్యాగ్‌ను యాడ్ చేసుకున్నారు. అందులో జబర్దస్త్ అవినాష్ ఒకరు. వేరొకరి టీమ్‌లో ఒక మెంబర్‌గా జాయిన్ అయ్యి.. తర్వాత తనే స్వయంగా టీమ్ లీడర్‌గా కూడా మారాడు అవినాష్. ఆ తర్వాత మెల్లగా తనకు సినిమాల్లో కామెడియన్‌గా అవకాశాలు మొదలయ్యాయి. దీంతో ఇతర జబర్దస్త్ సభ్యులలాగానే అవినాష్ కూడా ఆ షో నుండి తప్పుకున్నాడు. తాజాగా తన ఫస్ట్ శాలరీ ఎంత? దాంతో ఏం చేశాడో బయటపెట్టాడు అవినాష్.

గర్వంగా అనిపించింది..

జబర్దస్త్‌లోని ఒక ఎపిసోడ్ కోసం రూ.1500 రెమ్యునరేషన్ అందుకున్నానని, అదే తన మొదటి రెమ్యునరేషన్ అని బయటపెట్టాడు అవినాష్. అది తక్కువ అమౌంటే అయినా చాలా గర్వంగా అనిపించిందని చెప్పాడు. ప్రస్తుతం షోను బట్టి, అందులో తన కష్టాన్ని బట్టి ఛార్జ్ చేస్తానని, మరీ లక్షల్లో ఛార్జ్ చేస్తానని చెప్పలేనని అన్నాడు. ‘‘ఆ సమయంలో నేను ఇండస్ట్రీలో ముందుకు వెళ్తానా లేదా అని డౌట్‌గా ఉండేది. అలాంటి 1500 రెమ్యునరేషన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని తెలిపాడు అవినాష్. ఎవరికైనా తమ మొదటి జీతం, మొదటి సంపాదన చాలా స్పెషల్‌గా ఉండిపోతుంది. అదే విధంగా తను ఫస్ట్ జీతంతో ఏం చేశాడని అడగగా.. షాకింగ్ సమాధానం ఇచ్చాడు అవినాష్.

ఎవరైనా ఇంతే..

‘‘మొదటి సంపాదనతో తాగాను. ప్రపంచంలో మొదటి జీతం వచ్చిన ఎవడూ దానిని దాచిపెట్టుకొని చూస్తూ ఉండడు. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెడుతూనే తన మొదటి సంపాదనతో ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు అవినాష్. ఇక ఆ సంపాదనతో తన తల్లికి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అని అడిగగా.. ‘‘మా అమ్మకు బంగారు గాజులు అంటే చాలా ఇష్టం. కానీ 1500కు రావు కదా. భవిష్యత్తులో నేను ఇంకా ఎక్కువగా సంపాదిస్తాను అనే నమ్మకంతో అప్పుడు ఆ ఎమౌంట్‌తో తాగేశాను. ఎక్కువ డబ్బులు వచ్చాక అమ్మకు గాజులు కొనిచ్చాను’’ అంటూ తన అమ్మ కోరిక తీర్చిన సందర్భం గురించి బయటపెట్టాడు అవినాష్.

ముక్కు అవినాష్‌గా..

జబర్దస్త్‌లో పెద్ద ముక్కుతో, వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ నవ్వించేవాడు అవినాష్. అందుకే తనకు ప్రేక్షకులంతా ముక్కు అవినాష్ అని పేరు పెట్టుకున్నారు. జబర్దస్త్‌లో టీమ్ మెంబర్ నుండి టీమ్ లీడర్‌గా మారిన సమయంలోనే తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. అందులో కొన్నాళ్లకే ఎలిమినేట్ అయ్యాడు. తిరిగి జబర్దస్త్‌లో అడుగుపెట్టకుండా స్టార్ మాలోని షోలతోనే ఆడియన్స్‌లో ఎంటర్‌టైన్ చేయడం మొదలుపెట్టాడు. పైగా అవినాష్ ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్‌కు కూడా లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలా బుల్లితెర వీడియోలతో, యూట్యూబ్ వ్లాగ్స్‌తో బిజీగా ఉన్నాడు అవినాష్.

Also Read: ఒకరు హైపర్, ఒకరు రిజర్వ్‌డ్‌ - బాలకృష్ణ, మహేశ్ బాబుపై బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget