News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

యాంకర్ సౌమ్య చెప్పుపై చంటీ పంచ్‌లు - అలా చేస్తే నా జడ్జి పోస్ట్ ఎప్పుడో పోయేదన్న కృష్ణ భగవాన్

జబర్దస్త్ కామెడీ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రాఘవ, చంటి, సద్దాం తమదైన పంచులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

FOLLOW US: 
Share:

‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ కామెడీ షోలకి ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి గురువారం ‘జబర్దస్త్’ లో కమెడియన్స్ తమ స్కిట్స్ తో అలరిస్తుండగా, ఎప్పటిలాగే ఈ వారం ‘జబర్దస్త్’ ఎపిసోడ్ మరింత సరదాగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 28న ఈటీవీలో ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాఘవ, చంటి, సద్దాం హుస్సేన్, నూకరాజు తమ స్కిట్స్ తో అదరగొట్టేశారు.

రాఘవ స్కిట్ తో ప్రోమో స్టార్ట్ అయ్యింది. "కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏదైనా తినడానికి పట్టుకురా?" అని రాఘవ తన భార్యతో చెప్తే.. "ఆమె నీకా? ఎలకలకా?’’ అంటూ పంచ్ వేస్తుంది. ఇలాంటి డైలాగులు వేస్తే నాకు మండిపోద్ది అని రాఘవ చెబితే, ఎక్కడమ్మా? అని భార్య అంటుంది. దానికి రాఘవ ముందు నుంచి వెనక్కి తిరుగుతూ ఇక్కడ! కడుపులో అని చెప్పగానే షోలో ఉన్న వాళ్లంతా నవ్వేశారు. "నేను ఏదైనా మనసులో అనుకుంటే అది బయటికి వినబడిపోతుంది. ఇది నాకున్న జబ్బు" అని రాఘవ చెబుతుండగా, "ఇలా మనసులో అనుకున్నవి బయటకు వినబడిపోతే నా జడ్జి పోస్ట్ ఎప్పుడో పోయేది’’ అని కృష్ణ భగవాన్ సెటైర్ వేస్తాడు. దానికి ఇంద్రజ ‘‘అంటే?’’ అని షాకింగ్ గా చూస్తుంది.

ఆ తర్వాత వెంకీ స్కిట్ లో భాగంగా భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతుండగా భార్య వెంకీ ని, "వీడు ఇక్కడ ఎగురుతాడు, అక్కడ ఎగరడు?" అని అనగానే దానికి ఇంద్రజ, సౌమ్య పగలబడి నవ్వుతారు. ఆ తర్వాత సద్దాం, యాదమ్మ రాజు స్కిట్ లో పంచులు బాగా పేలాయి. ‘‘వైజాగ్ ని వైజాగ్ అని ఎందుకంటారు?’’ అని అడిగితే.. "బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జాగ్ అన్న ఒకడు ఉండేవాడు. అతను ఇంగ్లాండ్ కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నావ్? వై..జాగ్ వై..జాగ్? అలా అది వైజాగ్ అయిపోయిందని" సద్దాం హుస్సేన్ చెప్పగానే షోలో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత మచిలీపట్నం కి ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగితే.. "మచిలీపట్నంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక చెల్లి ఉండేది. ఆమెకు ఏదైనా గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాడు. అందుకే ఆ ఊరికి మా చెల్లి పట్నం అని పెట్టేశాడు. అది కాస్త మచిలీపట్నం అయిపోయింది" అని సద్దాం చెప్పగానే కృష్ణభగవాన్, ఇంద్రజ నవ్వారు.

చంటి స్కిట్ లో భాగంగా ఓ చెప్పును చూపిస్తూ.. "ఇప్పటికీ 200 సార్లు దాన్ని కుట్టాను" అని చంటి అంటాడు. ‘‘ఎవరిదన్నా ఈ చెప్పు’’ అని అడిగితే ‘‘మన సౌమ్యది’’ అని చంటి అంటాడు. ‘‘అదేంటన్నా కొత్త చెప్పు కొనుక్కోవచ్చుగా’’ అని అంటే.. "ఆవిడకి ఇచ్చే పేమెంటులో కాఫీ కప్పే కొనుక్కోదు. ఇంకా చెప్పలేం కొంటుంది" అని చంటి చెప్పగానే, ‘‘నీకన్నా పదివేలు ఎక్కువే అని చెప్పారు’’ అంటూ సందీప్ సెటైర్ వేస్తాడు. ఆ సెటైర్ కి ఇంద్రజ పగలబడి నవ్వుతుంది. చివరగా నూకరాజు తన స్కిట్లో భాగంగా విమానం మూవీ స్పూఫ్ చేశాడు. ఆ స్కూఫ్ లో వేసిన పంచులు నరేష్ కి అర్థం కాక.."దేవుడా ఈ కాలు తీసేసుకో" అని నరేష్ చెప్పగానే షోలో ఉన్నవాళ్లంతా తెగ నవ్వుతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.

Also Read : ఎన్టీఆర్ బావమరిది 'మ్యాడ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 04:02 PM (IST) Tags: etv Jabardasth Jabardasth Latest Promo Indraja Chalaki Chanti Krishna Bhagavan

ఇవి కూడా చూడండి

Gruhalakshmi December 6th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: తాగొచ్చిన నందగోపాల్‌కు శిక్ష వేయాలన్న బసవయ్య - విక్రమ్‌ను అడ్డుకున్న రాజ్యలక్ష్మీ

Gruhalakshmi December 6th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: తాగొచ్చిన నందగోపాల్‌కు శిక్ష వేయాలన్న బసవయ్య - విక్రమ్‌ను అడ్డుకున్న రాజ్యలక్ష్మీ

Guppedantha Manasu December 6th Episode: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!

Guppedantha Manasu December 6th Episode: రిషి పెద్ద టిస్ట్ ఇవ్వబోతున్నాడా - అనుపమ కథను ఎలాంటి మలుపు తిప్పబోతోంది!

Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!

Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!

Prema Entha Madhuram December 6th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చంపేస్తాడంటూ భయపడుతున్న మాన్సీ - మళ్ళీ అతడికి దూరం అవ్వనున్న అను!

Prema Entha Madhuram December 6th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చంపేస్తాడంటూ భయపడుతున్న మాన్సీ - మళ్ళీ అతడికి దూరం అవ్వనున్న అను!

Bigg Boss 7 Telugu: అమర్ వీడియోను లీక్ చేసిన బిగ్ బాస్, శోభ శెట్టి ఏడుపు - ఫన్ టాస్క్‌లోనూ అదే లొల్లి

Bigg Boss 7 Telugu: అమర్ వీడియోను లీక్ చేసిన బిగ్ బాస్, శోభ శెట్టి ఏడుపు - ఫన్ టాస్క్‌లోనూ అదే లొల్లి

టాప్ స్టోరీస్

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Michaung Cyclone Effect In AP: మిగ్‌జాం తుపాను ధాటికి ఏపీ కకావికలం- బోరుమంటున్న రైతులు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam

Telangana New CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..కార్యకర్తల సంబరాలు | ABP Desam
×