MAD Movie Release Date: ఎన్టీఆర్ బావమరిది 'మ్యాడ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి యూత్ ఫుల్ మూవీ రాబోతోంది సంగీత శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మ్యాడ్' మూవీని అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ బ్యానర్ నుంచి మరో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. ఆ సినిమా పేరే 'మ్యాడ్'(MAD). జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో ఫార్చునర్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాని సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదల చేయాలని నిర్వహించుకుని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో తెలియదు ఆ తేదీన కాకుండా అక్టోబర్ 6న 'మ్యాడ్' సినిమాని విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 6 న ఈ క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
The most insanely fun and crazy gang is coming to meet you at theatres on 𝐎𝐂𝐓 𝟔𝐭𝐡 with MADdening entertainer. 😎#MADon6thOctober 🥳#MADtheMovie @kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin @gouripriyareddy… pic.twitter.com/h1jhB1YBgS
— Sithara Entertainments (@SitharaEnts) September 25, 2023
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఈ సినిమాలో ఓ హీరోగా నటిస్తుడటంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతోంది. యువతను విశేషంగా ఆకట్టుకొని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. దినేష్ కృష్ణన్ బి, షామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రఘుబాబు, మురళీధర్ గౌడ్, రచ్చ రవి, విష్ణు, ఆంథోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మరోవైపు అక్టోబర్ 6న ఈ సినిమాతో పాటు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'రూల్స్ రంజన్(Rules Ranjann) కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో 'సమ్మోహనుడా' అనే సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది. కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది.రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, గోపరాజు రమణ, నెల్లూరు సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో అక్టోబర్ 6 న 'మ్యాడ్', 'రూల్స్ రంజన్' చిత్రాల మధ్య పోటీ ఉండబోతోంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ను అందుకుంటుందో చూడాలి.
Also Read : మేఘా ఆకాష్ హీరోయిన్‌గా కొత్త సినిమా - టైటిల్ ఏమిటీ అలా ఉంది?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

