By: ABP Desam | Updated at : 02 Sep 2022 09:23 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu September 2 Today Episode 545 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 2 Today Episode 545)
దేవయాని-సాక్షి కలసి కుట్రచేసి వసుధారని కిడ్నాప్ చేస్తారు. రిషి చాలా టెన్షన్ పడుతూ వెతుకుతుంటాడు. గౌతమ్, మహేంద్ర, జగతి కూడా రిషికి హెల్ప్ చేస్తారు. రేపు పరీక్ష రాయకపోతే వసుకి చాలా నష్టం అని బాధపడుతుంటాడు. మీరంతా వెళ్లండి నేను ఇక్కడే ఉంటానంటాడు రిషి. నువ్వొక్కడివే ఏం చేస్తావ్ అంటే..తనొచ్చాకే నేను వస్తాను మీరు వెళ్లండి అని పంపించేస్తాడు రిషి. వసు వచ్చేవరకూ గెస్ట్ హౌస్ లోనే ఉంటానంటాడు. ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పిద్దాం అని జగతి అన్నప్పటికీ..మహేంద్ర మాత్రం వద్దులే తనని ఒంటరిగా వదిలేద్దాం అంటాడు.
వసుకి ఏమైంది, ఎక్కడికి వెళ్లింది..తన ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ వస్తుందో అర్థంకావడం లేదని బాధపడతాడు. తెల్లారుతుంది.. కంగారుగా నిద్రలేచిన రిషి.. వసుకోసం మళ్లీ వెతకడం ప్రారంభిస్తాడు. మళ్లీ ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తుంది. ఏం జరిగిందో అర్థంకాక మరింత టెన్షన్ పడతాడు. ఇంతలో జగతి, మహేంద్ర అక్కడికి వచ్చి వసు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు. ఏం తెలియలేదు అంటాడు రిషి.
రిషి: మేడం మీరుకూడా ట్రై చేయండి..తన ఫ్రెండ్స్ ని అడగండి..ఈ రోజు ఆఖరి పరీక్ష..ఈ రోజు రాయకపోతే తన గోల్ మిస్సవుతుంది
జగతి: మేం అందరం తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి కనుక్కున్నాం ఏమీ తెలియలేదు
గౌతమ్: నువ్వు టెన్షన్ పడొద్దురా..తను క్షేమంగా ఉంటుంది
రిషి: క్షేమంగా ఉండడం కాదు..ఇన్నాళ్లూ అనుకున్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి కదా...అప్పుడే కాలేజీకి వచ్చిన పుష్పని అడిగితే తనకు కూడా తెలియదంటుంది. వసుని లాస్ట్ టైం నువ్వెక్కడ చూశావ్
పుష్ప: లైబ్రరీకి వెళ్లింది
రిషి: లైబ్రరీలో కూడా కనుక్కున్నాను తను అక్కడకు కూడా వెళ్లలేదంట అని టెన్షన్ పడతాడు.
పరీక్షకు టైం అవుతోందని జగతి చెబుతుంది.. ఎగ్జామ్ ఏర్పాట్లు చూడాలని చెప్పి గౌతమ్ ని అక్కడే ఉండమని చెప్పేసి.. మహేంద్ర,జగతి వెళ్లిపోతారు.ఎక్కడికి వెళ్లావ్ వసుధార..నీ జీవితమంతా దీనిపైేన ముడిపడి ఉందికదా.. నీకేమైనా అయితే నేను ఏం కావాలి అనుకుంటూ మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంటాడు..ఏదో ఆలోచిస్తూ అలా ల్యాబ్ బయటకు నడుస్తూ వస్తాడు..(అక్కడ వసు తనతో మాట్లాడినట్టు ఊహించుకుంటాడు) అప్పుడు రిషి కి గోళీలు కనిపిస్తాయి. ( గతంలో గోళీలు ఆడినవి ఇద్దరి దగ్గరా చెరో బాటిల్ ఉంటుంది..వసుని కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నప్పుడు కిందపడతాయి) ఇవి వసుధారవే అని అనుకుని ఆ గోళీలు కనిపించిన దిశలో వెళతాడు. ల్యాబ్ లో వసు కిందపడి ఉంటుంది. కంగారుగా ఎత్తుకుని తీసుకెళ్లిసోఫాలో కూర్చోబెట్టిన రిషి.. డాక్టర్ ని పిలవమని చెబుతాడు.
Also Read: దీపని ఇంటికి ఆహ్వానించిన కార్తీక్, మోనితలో మొదలైన టెన్షన్
రిషి: మొహంపై నీళ్లు కొడతాడు..ఆగకుండా పిలుస్తూనే ఉంటాడు..వసు లక్ష్యాన్ని గుర్తుచేస్తాడు. వసుధారా నీకేమైందని ఏడుస్తాడు... నువ్వు ల్యాబ్ లో పడిపోవడం ఏంటి..నువ్వు గెలవాలి..పరీక్ష రాయాలి..ఇది నీ లైప్ కి పరీక్ష..ఆఖరి ఎగ్జామ్ వసుధారా..నువ్వు యూత్ ఐకాన్ వి..డీబీఎస్టీ కాలేజీ టాపర్ వి..అలాంటప్పుడు పరీక్ష ఎలా మిస్సవుతావ్... నువ్వు పంతులమ్మ అవుతాను అన్నావ్ కదా..పంతులమ్మా లే లే..కళ్లు తెరు...ఏయ్ పొగరు..కళ్లు తెరు.. నన్ను ప్రిన్స్ అనవా..నన్ను జెంటిల్మెన్ అనవా..వసుధారా లే వసుధారా..నువ్వు ఎగ్జామ్ రాయగలవు..
(అటు పరీక్ష హాల్ లో వసు ప్లేస్ ఖాలీగా ఉండడం చూసి..వసుకి ఏమైందని జగతి బాధపడుతుంది)
ఈ యూనివర్సిటీ టాపర్ గా నువ్వు నిలవాలి..నువ్వు గెలవాలి..ఓడిపోవద్దు..నా మాటలు వినిపిస్తున్నాయా..నువ్వు దేనికోసం ఇంట్లో వాళ్లని ఎదిరించి పారపోయి వచ్చావో అదినెరవేరాలంటే నువ్వు ఎగ్జామ్ రాయాలి..కళ్లు తెరు వసుధారా..నేను చెబుతున్నాను నువ్వు ఎగ్జామ్ రాయాలని ఏడుస్తూనే ఆర్డర్స్ వేస్తుంటాడు.
ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్లు ఇస్తుంటారు.. వసధార కెరియర్,కలలు, లక్ష్యం అన్నీ అయిపోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి..ఇంతలో మేడం క్వశ్చన్ పేపర్ అని అడుగుతుంది వసుధార. ఆనందంతో కూడిన కంగారులో నీకేమైంది, ఎక్కడికి వెళ్లావని అడిగి.. ఆ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఎగ్జామ్ రాయమని చెబుతుంది... వసుధార ఇకా మత్తులోనే ఉంటుంది..పేపర్ సరిగా కనిపించదు కానీ కష్టపడుతూనే రాస్తుంటుంది..( రాయగలవా అని జగతి అడిగితే రాస్తానని మాటిచ్చాను మేడం అంటుంది) అప్పుడే రూమ్ లోకి వచ్చిన రిషి.. వసు పరీక్ష రాయడం చూసి సంతోషిస్తాడు.. అప్పటికీ వసు మత్తులోనే తూలుతూ ఉంటుంది. శక్తితెచ్చుకో వసుధారా అని అనుకుంటాడు..వసు తూలి పడిపోతుంది...మళ్లీ లేచి రిషి మాటలు గుర్తుచేసుకుని పరీక్ష రాస్తుంది...
Also Read: కళ్లు తెరు వసుధారా అంటూ రిషి కన్నీళ్లు, ప్రేమనంతా కరిగించేసి కదిలించేసిన ఈగో మాస్టర్
రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
నీకేమైందో ఎలా ఉన్నావో అని టెన్షన్ గా నేనొస్తే..నువ్వు ఆడుకుంటున్నావా అంటాడు రిషి. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సార్ అంటుంది వసుధార. ఆ ల్యాబ్ లో ఎలా పడిపోయావ్..అంత మత్తులో ఎలా ఉన్నావ్ అని అడిగితే..వసుధార ఏదో చెబుతుంది. ఎక్కడికి అని అడగొద్దు పద వెళదాం అని తీసుకెళతాడు...
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Naga Panchami December 2nd Episode నాగమణిని తీసుకొస్తే మోక్షని కాపాడుతా.. పంచమితో కరాళి!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>