Guppedantha Manasu September 1 Today Episode 544: కళ్లు తెరు వసుధారా అంటూ రిషి కన్నీళ్లు, ప్రేమనంతా కరిగించేసి కదిలించేసిన ఈగో మాస్టర్
Guppedantha Manasu September 1 Today Episode 544: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. దేవయాని-సాక్షి కలసి వసుధారని కిడ్నాప్ చేశారు.. ఈ రోజు( గురువారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 1 Today Episode 544)
పరీక్షలు జరుగుతున్నాయి.. వసుధార-రిషి ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటూ మనసులోనే మాట్లాడుకుంటారు.అందుకే అందర్నీ ఉద్దేశించి క్వశ్చన్స్ వేస్తుంటాడు రిషి. బాగానే రాస్తున్నాను కాదు బాగారాయాలి, జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి, మరో పరీక్ష అయ్యేవరకూ మీరు రిలాక్స్ కాకూడదు అంటాడు. ( మీరు నా గురించే చెబుతున్నారని నాకు అర్థం అయింది అనుకుంటుంది వసుధార). కాలేజీ, ఈ గ్రౌండ్, అల్లరి, రిషి సార్ ని అన్నీ మిస్సవుతాం ఏమో కదా అని పుష్ప అంటే.. ఇవన్నీ కాదు..నేను రిషి సార్ ని మిస్సవుతాను అనుకుంటుంది మనసులో ( అంతలోనే నేనెందుకు మిస్సవుతాను అనుకుంటుంది).
దేవయాని-సాక్షి
దేవయాని: వసుధార పాసై గొప్ప పేరు తెచ్చుకుంటే వసు గెలుస్తుంది,రిషి గెలుస్తాడు.. రిషికి వసుపై ఎన్నో అంచనాలున్నాయి వాటిని తల్లకిందులు చేస్తేకానీ ఏమీ చేయలేం
సాక్షి: రిషికి వసు అంటే చాలా ప్రేమ ఉంది కదా..వాళ్లిద్దర్నీ దూరం చేయాలంటే ఏం చేయాలి
దేవయాని:గొప్ప గొప్ప స్నేహితులే విడిపోయారు..వీళ్లో లెక్కా..పరీక్షలు రాసి గొప్పగా నిలబడితే సన్మానం చేస్తారు..ఆ తర్వాత పెళ్లిచేస్తారు..అందుకే వసుధార చివరి పరీక్ష రాయకూడదు..వసు పరీక్షలో ఫెయిల్ అయితే రిషి ప్రేమలో కూడా ఫెయిల్ అయినట్టే..నేను ప్లాన్ చెబుతాను నువ్వు అమలు చేయి...
అటు కాలేజీలో పరీక్ష రాసి బయటకు వస్తారు.. నాకు లైబ్రరీలో పని ఉందని చెప్పి పుష్పని వెళ్లమంటుంది. మహేంద్ర-జగతి ఎదురుపడతారు. నిన్ను రూమ్ దగ్గర దించుతాం అంటే..వద్దులెండి సార్ మీరు వెళ్లండి అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రిషి.. పరీక్షలకు సంబంధించి అన్నీ సక్రమంగానే ఉన్నట్టేనా అని జగతిని అడుగుతాడు. స్టూడెంట్స్ ఈ పేపర్ ఎలా రాశారంట అని అడిగితే..అందరూ దాదాపుగా బాగా రాశామని చెప్పారంటుంది జగతి. కొందరు ర్యాంక్ స్టూడెంట్స్ సంగతేంటని అడుగుతాడు( వసుని ఉద్దేశించి)...మనల్ని అడ్డం పెట్టుకుని వసుధారతో మాట్లాడుతున్నాడు అంటాడు మహేంద్ర. పరీక్ష బాగా రాశానని చెబుతుంది వసుధార... నేను లైబ్రరీకి వెళతానని వెళ్లిపోతుంది...
కాలేజీ బయట ఓ మహిళ..వసుధారని అబ్జర్వ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అటు తన క్యాబిన్లో కూర్చున్న రిషి.. పరీక్ష ఎలా రాశావని వసుకి మెసేజ్ చేస్తాడు. బాగా రాశానంటుంది.
రిషి: నెక్స్ట్ ఏంటి
వసు: లాస్ట్ ఎగ్జామ్ కి చదువుకోవాలి
రిషి: ఆ తర్వాత
వసు: ఓ లాంగ్ టూర్ ప్లాన్ చేయాలి
రిషి: ఆ టూర్ ఎవరితోనో...
వసు: మనసులో ఉన్న వ్యక్తితో
రిషి: పర్మిషన్ తీసుకున్నావా మరి..
వసు: అడగాలి..అడిగితే కాదనరనే నమ్మకం ఉంది..
Also Read: సెంటిమెంట్ డోస్ పెంచిన మోనిత, డాక్టర్ బాబుకి బిర్యానీ రుచి చూపించిన వంటలక్క
సాక్షి అరెంజ్ చేసిన వ్యక్తి.. కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి వసుధారని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతుంటుంది. అప్పుడు వసు బ్యాగ్ లోంచి గోళీలు చిందరవందరగా పడి ఉంటాయి. కాలేజీలో ఓ రూమ్ లోకి తీసుకెళ్లి వసుని పడేసిన సాక్షి... నీ కలలు, నీ లక్ష్యాలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా అని క్రూరంగా నవ్వుకుని వెళ్లిపోతుంది..
అటు రిషి.. రూమ్ లో కూర్చుని వసు గురించి ఆలోచిస్తాడు. తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అనుకుంటూ మెసేజ్ చేస్తాడు. రిప్లై లేకపోవడంతో కాల్ చేస్తాడు...అప్పటి వరకూ రింగైన ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. ఇప్పటి వరకూ రింగైన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది...నాపై ఏమైనా అలిగిందా అని టెన్షన్ పడుతుంటాడు..ఇంతలో గౌతమ్ వచ్చి బయటకు వెళదామా అని అడుగుతాడు. చిరాగ్గా ఉన్న రిషిని చూసి సెటైర్స్ వేస్తాడు. వసుధార ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందంటాడు రిషి. రెస్టారెంట్ కి వెళ్లిందేమో అనుకుంటారు...కానీ ఎగ్జామ్స్ టైమ్ లో రెస్టారెంట్ కి వెళ్లడం ఏంటి అనుకుంటారు.
అటు ఆపరేషన్ సక్సెస్ అని దేవయానికి మెసేజ్ చేస్తుంది సాక్షి. సంతోషంగా ఉన్న దేవయాని..వసుధారా నువ్వు ఫైనల్ ఎగ్జామ్ రాయలేవు అనుకుంటుంది. లెమన్ టీ తీసుకురా అని ధరణికి చెబుతుంది. ఇప్పుడు చేసేదేం లేదు..తన రూమ్ కి వెళతాను అంటాడు రిషి..నేనుకూడా వస్తానంటాడు గౌతమ్. రూమ్ కి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంటుంది..రెస్టారెంట్ కి యజమానికి కాల్ చేస్తే..అక్కడకూ వెళ్లలేదని తెలుస్తుంది. రిషిలో టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఫైనల్ ఇయర్ వాళ్ల గ్రూప్ లో మెసేజ్ పెట్టిన రిషి.. జగతికి కాల్ చేస్తాడు. వసుధార మీకేమైనా కాల్ చేసిందా అని అడిగితే లేదని చెబుతుంది. ఇంతలో గౌతమ్ ఆ ఫోన్ లాక్కుని వసు ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది..వసు రూమ్ తాళం వేసి ఉంది, రెస్టారెంట్ కి కూడా వెళ్లలేదంట..తను ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు..వసుధార కనిపించడం లేదని చెప్పేసి...కాలేజీకి వెళుతున్నాం అని కాల్ కట్ చేస్తాడు.
Also Read: పరీక్షలు అవగానే గుడ్ న్యూస్ చెబుతానన్న రిషి, వసు ఆలోచనే లేకుండా చేస్తానన్న దేవయాని!
మహేంద్ర మనం కూడా వెళదాం అనుకుంటూ కిందకు దిగుతారు జగతి-మహేంద్ర.
దేవయాని: ఎక్కడికో హాడవుడిగా వెళుతున్నారు..
మహేంద్ర: మేం బయటకు వెళుతున్నాం..వసుధార కనిపించడం లేదు వదినా
దేవయాని: నన్ను కూడా రమ్మంటారా
జగతి: అవసరం లేదులెండి..మీరిక్కడే ఉండండి..
దేవయాని: ఆ అమ్మాయి గురించి తెలియగానే నాకు చెప్పండి...నేను కుదుటపడతాను..
ధరణి ఏదో మాట్లాడబోతుంటే..మనకు అవసరమా ఈ టాపిక్ వెళ్లి పనిచూసుకో అంటుంది. వెంటనే సాక్షికి మెసేజ్ చేస్తుంది.. ఇక్కడ సినిమా స్టార్ట్ అయిందని...
ఆ మెసేజ్ చూసిన సాక్షి..వసుధార రేపు పరీక్ష రాయదు..తనకు ఇచ్చిన డోస్ అలాంటిది అనుకుంటుంది మనసులో...
వసుధార వచ్చిందా అని సెక్యూరిటీని అడుగుతాడు రిషి...కాలేజీ లోపలకు వెళ్లి రిషి వెతుకుతుంటే.. బయట గౌతమ్ వెతుకుతుంటాడు. అప్పుడే జగతి-మహేంద్ర వస్తారు...రిషి కాలేజీ మొత్తం పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు...
రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
ఎట్టకేలకు వసుని చూస్తాడు రిషి... వసు కళ్లుతెరువు అని ఏడ్చేస్తాడు..