Karthika Deepam September 1 Today Episode 1446: సెంటిమెంట్ డోస్ పెంచిన మోనిత, డాక్టర్ బాబుకి బిర్యానీ రుచి చూపించిన వంటలక్క
Karthika Deepam September 1 Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 1 Today Episode 1446
పేరుకే భర్తగా ఉన్నాడు కానీ నా మీద ప్రేమలేదు..ఆ ప్రేమ కలిగేలా చేస్తాను అనుకుంటుంది మోనిత. చేయి కాలినట్టు నటిస్తుంది. అయినా కార్తీక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నా మీద ప్రేమ లేదు సరే కనీసం కరుణా,జాలి కూడా లేవా అని మనసులో అనుకుంటుంది. అప్పుడు బయటకి ఏడుస్తూ నువ్వు నన్ను ఓదారుస్తావు అని అనుకున్నాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటుంది.
కార్తీక్: నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ రావడం లేదు. నేను నా మనసులో ఉన్నది నీకు చెప్పాను, ఫీలింగ్స్ ఎందుకు రావడం లేదు అనేది నాకు తెలీదు
మోనిత: నేను నీకోసం ఏం వదులుకున్నానో తెలుసా? నేను నీకోసం ఎంత చేశానో తెలుసా
కార్తీక్: మనకు ఓ బిడ్డ ఉన్నాడు. నీకు యాక్సిడెంట్ అయిన రోజు తనకి చాలా జ్వరం వచ్చింది. నీకు సేవలు చేసేసరికి సరిపోయింది. అలా ఒక రోజు నీకు సేవలు చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి నాకు మన బిడ్డ కనపడలేదు ఎంతో వెతికాను ఎవరు తీసుకెళ్లారో తెలీదు కేవలం నీకోసం వదులుకున్నాను.నువ్వంటే నాకు అంత పిచ్చి
కార్తీక్: నిజంగా మనకి బిడ్డ ఉన్నాడా అని బాధపడుతూనే మొనితని హగ్ చేసుకుంటాడు
మోనిత: నీ ప్రేమ దక్కాలంటే ఇంత డోస్ ఉండాలని క్రూరంగా నవ్వుకుంటుంది.
Also Read: వంటింట్లో ఇల్లాలు - ఇంట్లో ప్రియురాలు -బావుందయ్యా డాక్టర్ బాబు!
దీప వంటచేసి వడ్డిస్తుంటే..డాక్టర్ అన్నయ్య, వాళ్ల అమ్మ దీపని పొగిడేస్తుంటారు. రుచికరమైన వంట చేస్తే భర్త మీద ప్రేమ ఉన్నట్టు అర్థం అంట అని ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ అనగా ఏమి ప్రేమో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి అని అంటుంది దీప. ఏం పర్లేదు సీతాదేవి అంతటి వాళ్లకే కష్టాలొచ్చాయి..అలాగని వాళ్లకు ప్రేమ లేదనుకుంటారా...నీ భర్తకి ఈ వంట పెట్టు కచ్చితంగా గుర్తుపడతాడు..నేను మీకు తోడుగా ఉన్నాం అంటారు.
అప్పుడు దీప...డాక్టర్ బాబే, నేను కావాలి అనుకునేలా చేస్తాను, నన్ను గుర్తుపట్టేలా చేసుకుంటాను అని అంటుంది.
శౌర్య,వారణాసితో ఆటో నేర్చుకోవడానికి బయలుదేరుతుంది. అప్పుడు వారణాసి దీపక్క కనిపిస్తే నువ్వు హిమని క్షమిస్తావా అంటే.. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితేనే నిన్ను ఎక్కడ నానమ్మ తాతయ్య పంపారు అని నాకు అనుమానం వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడితే నేను నిన్ను పంపించేస్తాను అని అంటుంది.
వారణాసి: కనీసం దీపక్క ఇక్కడికి వచ్చి నువ్వు హిమతో మాట్లాడు అని చెప్పితే మాట్లాడతావా
శౌర్య: అమ్మ నా కళ్ళ ముందు కనిపిస్తే చాలు అమ్మ ఏం చెప్తే అది చేస్తాను
వారణాసి: వీళ్ళందరూ కలవాలంటే నువ్వు తిరిగి రావాలి అక్క అని మనసులో అనుకుంటాడు
Also Read: పరీక్షలు అవగానే గుడ్ న్యూస్ చెబుతానన్న రిషి, వసు ఆలోచనే లేకుండా చేస్తానన్న దేవయాని!
కార్తీక్ శివతో బయటకు వెళ్తాను అంటాడు. మొనిత ఎక్కడికి అని అడగడంతో నీకోసం చిన్న సర్ప్రైజ్ అంటాడు. ఏంటని అడుగుతుంది మోనిత. అప్పుడు కార్తీక్, నువ్వు నా భార్యవి అని అన్నావు కాని నా దగ్గర ఎలాంటి రుజువు లేదు..నేను నా నీడ ని కూడా నమ్మేస్థితిలో లేను కానీ నా కోసం మన బిడ్డని వదులుకున్నావు అని అన్నావు నాకు అందులో నిజాయితీ కనిపించింది అంటాడు.
మోనిత: ఒక అబద్ధం వల్ల ఇంత ప్రేమ వచ్చిందా ఇప్పుడు కార్తీక్ నా వాడే, కార్తీక్ ప్రేమ కూడా నాదే అని అనుకుంటుంది . ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ కార్తీక్
కార్తీక్: ఇందాక నీకు చేయ కాలిందని నేను పట్టించుకోలేదు కదా అసలు అలా ఎలా ఉన్నానో నామీద నాకే అసహ్యం వేస్తుంది అందుకే వెళ్లి వంటలక్కని తీసుకొస్తాను
మోనిత: వంటలక్కను తీసుకురావడం ఏంటి అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వకూడదు
కార్తీక్: నేను వంటలక్క దగ్గరికి వెళ్లి నేను నీ డాక్టర్ బాబును కాదు అని చెప్పి మాకు వంట చేయు అని ఇంట్లోకి తీసుకువచ్చేమనుకో మనకు వంట చేసినట్టు ఉంటుంది, మనిద్దరి అన్యోన్యత చూసి నేను వేరే తను వేరే అని అనుకుంటుంది సమస్య తీరిపోతుంది కదా అంటాడు
మోనిత: అది మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. మనం తన కంటపడడానికి వీల్లేదు మన దరిదాపుల్లో కూడా అది రాకూడదు. తను కాకపోతే ఇంకా ఎవరినైనా తెచ్చుకుందాం తను వద్దు
కార్తీక్ : నువ్వంత టెన్షన్ పడొద్దు వద్దులే అని అంటాడు
అప్పుడు మోనిత మనసులో అసలు దీప గురించి మర్చిపోవడం లేదేంటి ఇంకా దీప ఇక్కడికి వస్తే ప్రమాదమే అసలు కార్తీక్ దీపకు కనిపించకుండా చూడాలి అనుకుంటుంది
తనను కాపాడిన డాక్టర్ వాళ్లింట్లోంచి..దీప బట్టలు సర్దుకుని బయటకు వచ్చేస్తుంది. ఆ పని ఇక్కడే ఉండి కూడా చేయొచ్చుకదా అంటే...అది ఎంత జిత్తుల మారి నక్కో చెప్పాను కదా అనుక్షణం డాక్టర్ బాబు పక్కన ఉంటే కానీ నేను తనని కాపాడుకోలేను అంటుంది. ఎపిసోడ్ ముగిసింది...
రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
మీ మేడంకి మంచి వంట మనిషిని చూడాలని కార్తీక్ అనగానే.. సార్ వాసన చూడండి సార్ అంటాడు శివ. ఎవరో బిర్యానీ వండుకుంటున్నారు ఆ వాసన బావుంది..ఆవిడనే మనింట్లో వంటమనిషిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటాడు కార్తీక్. కట్ చేస్తే దీప కనిపిస్తుంది.నువ్వా అని కార్తీక్ అనగానే..గుర్తుపట్టేశాడా ఏంటి అనుకుంటుంది మోనిత...