Guppedantha Manasu ఆగస్టు 16 ఎపిసోడ్: ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి
Guppedantha Manasu August 16 Episode 530: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి నోటి నుంచి వసు జపం చూసి ఫస్ట్రేట్ అయిన సాక్షి ఎట్టకేలకు పెళ్లి వద్దని వెళ్లిపోయింది...
గుప్పెడంతమనసు ఆగస్టు 16 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 16 Episode 530)
నిశ్చితార్థం పీటలపై కూర్చున్న రిషి..సాక్షికి షాకులమీద షాకులిచ్చాడు. చివరికి యంగేజ్ మెంట్ రింగ్ S అని కాకుండా V అని చేయించాడు. ఆ విషయంపై సాక్షి పెద్ద రచ్చ మొదలెట్టింది. రిషి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోగా.. చుట్టూ ఉన్నవాళ్లంతా షాక్ అయి చూస్తుంటారు.
సాక్షి: 'V' అని ఎందుకుంది ఆంటీ 'S' అని కదా ఉండాలి చెప్పండి ఆంటీ... రిషి ఏంటిది..
రిషి: అది.... Sorry...
సాక్షి: కాబోయే భార్యని నా పేరుతో మొదటి అక్షరాన్ని మరిచిపోయావా...
రిషి: అనుకోకుండా అలా...
సాక్షి: నాపేరు మర్చిపోయావా...లేదా..వసుధార ప్రేమని మరువలేకుండా ఉన్నావా
రిషి: సాక్షి..అని గట్టిగా అరుస్తాడు
సాక్షి: ఇప్పుడు గుర్తుకొచ్చిందా నా పేరు..జీవితాంతం నువ్వు నన్ను సాక్షి అని పిలుస్తావో..వసుధార అని పిలుస్తావో టెన్షన్ గా ఉంది..
ఏంటమ్మా ఇది అని సాక్షి తల్లిదండ్రులు ఏంటమ్మా అది అనేలోగా..మీరు మధ్యలో మాట్లాడకండి ఇది ఉంగరంలో అక్షరంతో ఆగదు ఇది తన మనసులో ముద్రించుకుపోయింది..ఇది ఈ రోజుతో అయిపోయే పొరపాటు కాదు..రేపు పొద్దున్న వసుధార కావాలంటాడు, పిల్లలు పుట్టాక కూడా మీ అమ్మపేరు వసుధార అని చెబుతాడేమో... తన మనసులో నేను లేను, తన ఆలోచనల్లో నేను లేను..మనసంతా ఆ వసుధారపైనే ఉంది..వసుధార, వసుధార, వసుధార..ఈ పేరు వింటేనే నాకు కంపరంగా ఉంది. ఈ పేరుతోనే నేను జీవితాంతం బతకాలా..చెప్పండి...ఈ కంపరంతోనే నేను జీవితాంతం కాపురం చేయాలా..ప్రతిక్షణం తనకి నేను వసుధారలానే కనిపిస్తాను..తను నన్ను మానసికంగా చంపేస్తూ వసుధారా అని పిలుస్తాడు.. ఇవన్నీ భరించడం నావల్లకాదు..ఈ పెళ్లి నాకొద్దంటూ ఉంగరం వసు కాళ్ల దగ్గరకు విసిరేస్తుంది సాక్షి...
Also Read: మార్చురీలో శవం డాక్టర్ బాబుది కాదంటూ కుదుటపడిన దీప, కార్తీక్ కోసం మరో డాక్టర్ వెతుకులాట
మహేంద్ర: హమ్మయ్య అని గుండెపై చేయి వేసుకుంటాడు మహేంద్ర...
దేవయాని షాక్ అయి చూస్తుంటుంది..ధరణి మొహం వెలిగిపోతుంది...అమ్మా సాక్షి అని దేవయాని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా..ఇంకేం మాట్లాడొద్దు ఆంటీ.. ఈ పెళ్లి జరిగితే నేను ఒక్కసారే ఏడుస్తాను..కానీ జరిగితే జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి..
సాక్షి తండ్రి: ఇన్నాళ్లూ రిషిని కోరుకున్నావ్ ఇప్పుడువద్దంటావేంటి..
సాక్షి: డాడ్ ఆగండి..నీ గురించి ఇన్నాళ్లూ ఎవరో ఏదో చెబుతుంటే ఏదో అనుకున్నాను..తల్లిని కాదనుకున్నావంటే ఆంటీ తప్పు అనుకున్నాను..వసు నిన్నుకాదనుకుంటే పిచ్చిది అనుకున్నాను..కానీ వసు నిన్ను ఎందుకు వద్దనుకుందో ఇప్పుడు అర్థమైంది..నీకు ప్రేమించడం రాదు...నీకు ప్రేమ విలువ తెలియదు..జగతి ఆంటీ మీరు సూపర్..మీరు చెప్పిందే కరెక్ట్.. దేవయాని: ఏయ్ జగతి..ఏం చెప్పి సాక్షి మనసు విరిగేలా చేశావ్...
సాక్షి: ఆంటీ..జగతి ఆంటీ నా మనసు విరగ్గొట్టలేదు..రిషి మనసులో నువ్వు లేవు..ముందు ముందు నీకే ప్లాబ్లెమ్ అవుతుందని చెప్పారు కానీ నేనే వినలేదు.. మమ్మీ, డాడీ పదండి...
దేవయాని: సాక్షి..ఆవేశం తగ్గించుకో...
సాక్షి: ఆంటీ ఆపండి..మీకో దండం, మీ అబ్బాయికో దండం, మీ పెంపకానికో దండం...
దేవయాని: తప్పు చేస్తున్నావ్..జీవితాంతం బాధపడతావ్..
రిషి: సాక్షి ఏమైంది నీకు..
సాక్షి: నాకు జ్ఞానోదయమైంది..నేను కళ్లు తెరుచుకున్నాను..మిస్టర్ రిషీంద్ర భూషణ్..నేను ఈ పెళ్లి వద్దని మహా గొప్ప పని చేస్తున్నాను..అందుకు గర్వపడుతున్నాను..ఛీఛీ ఇంతకాలం నేను ఆరాటపడింది నీకోసమా.. లండన్ నుంచి వచ్చి ఇక్కడ నా టైమ్ వేస్ట్ చేసుకున్నది నీకోసమా... ఇది నా ఓటమి కాదు..నేను గెలిచి వెళుతున్నాను...
రిషి: షడప్ సాక్షి..నీకు ఈ పెళ్లి నచ్చకపోతే వెళ్లిపో..కానీ నోటికొచ్చినట్టు మాట్లాడకు..
సాక్షి: నేను ఎందుకు వెళుతున్నానో నీకు తెలియాలి కదా..అందుకే ఇన్ని మాటలు మాట్లాడాను...
సాక్షి అని దేవయాని పిలుస్తున్నా ఆగకుండా వెళ్లిపోతుంది సాక్షి...
హమ్మయ్య అని గుండెపై చేయి వేసుకుంటాడు మహేంద్ర..ధరణి,గౌతమ్ మొహాలు వెలిగిపోతుంటాయి... గౌతమూ ఏం జరిగిందని మహేంద్ర అంటే...డెస్టినీ అంకుల్ అని గౌతమ్ అంటే..కాదు ప్రేమ అని రిప్లై ఇస్తాడు మహేంద్ర...
Also Read: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్
వసుధార తన కాళ్ల దగ్గర పడిన ఉంగారన్ని తీసుకుంటుంది.. ఆ ఇంట్లోంచి బయటకు వస్తుంది.. బయట సాక్షి ఎదురుపడుతుంది.
సాక్షి: ఏంటి వసుధారా హ్యాపీయేనా..ఫుల్ ఖుష్ కదా నువ్వు..నా లైఫ్ స్మాష్ అయింది.. సాక్షి లైఫ్ ఔట్ కదా.. రిషి నాకు దక్కాలని తనతో జీవితం పంచుకోవాలని ఎంత తపించానో అన్నీ అయిపోయాయ్..నువ్వు హ్యాపీనే కదా..వసుధారా నువ్వు మాట్లాడలేదంటే మనసులో సంతోషిస్తున్నావా..మనసు ఆనంద తాండవం చేస్తోందా..
వసు: ఈ రోజు ఏం జరిగిందో నీకూ తెలుసు..నాకు తెలుసు..నువ్వే వద్దనుకున్నావ్..ఇందులో ఎవ్వర్నీ తప్పుపట్టలేం.. నువ్వే వద్దనుకున్నావ్ కదా.. ఒకరి గెలుపు కోసం మనం కోరుకుంటే మనసు హాయిగా ఉంటుంది.. ఒకరి నాశనాన్ని కోరుకుంటే అది కరెక్ట్ కాదు సాక్షి.. ఒకరి మంచి కోరుకో గెలుస్తావ్..ఒకరి చెడు కోరుకుంటే ముగింపు ఇలాగే ఉంటుంది..అయినా ఒకరి ఓటమిని చూసి నేను సంతోషించేదాన్ని కాదు..నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు..మొదటి నుంచీ మొండితనంతో ముందుకెళ్లావ్.. అసాధ్యాన్ని సాధించాలని కోరుకున్నావ్..ఏదోఓసారి గాలివాటంలా విజయం దక్కుతుంది..అన్నిసార్లూ అది సాధ్యం కాదు సాక్షి. మనిషి గాలివాటం కాదు..వ్యక్తిత్వాన్ని బట్టి నడుచుకోవాలి..
ఇదంతా దూరం నుంచి వింటున్న రిషి..అక్కడకు వస్తాడు....
సాక్షి: ఈ సందర్భంగా నీకో మాట చెబుతాను జాగ్రత్తగా విను..రిషిని కాదని నువ్వు చాలా మంచిపని చేశావ్.. నువ్వు అదే మాట మీదుండు..నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్..అసలు రిషికి ప్రేమంటే ఏంటో తెలియదు..రిషి ఎవ్వర్నీ ప్రేమించలేడు.. తనకి ప్రేమ విలువ అస్సలు తెలియదు..అమ్మాయిల్ని గౌరవించడం తెలియదు..అసలు కన్నతల్లినే అమ్మా అని పిలవడం తెలియదు, ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు,సినిమాలు షికార్లు కబుర్లు తెలియదు, ఎంటర్టైన్మెంట్ తెలియదు, ప్రేమగా మాట్లాడటం తెలియదు..అసలు ప్రేమే తెలియనప్పుడు ప్రేమగా ఎలా మాట్లాడుతాడు..చూడు వసుధార నాలాంటి బాధ నువ్వు పడకూడదని చెబుతున్నాను..ఈ రోజు నా ముందు నీపేరు కలవరిస్తున్నాడు..రేపు నీ ముందు ఇంకొకరి పేరు కలవరిస్తాడేమే.. నవ్వీ మాయలో పడలేదు సంతోషం..నువ్వు నీలాగే ఉండు వసుధారా..నేను వెళ్లిపోతున్నాను అనుకుంటున్నావా రిషి.. నేను వెళ్తున్నాను అంతే..నీ జీవితంలోంచి కాదు..నా బాధ, నా కడుపుమంట ఏదో ఒకరూపంలో నీకు కచ్చితంగా తగులుతాయి.. ఇది శాపం అనుకుంటావో, శపథం అనుకుంటావో నీ ఇష్టం...గుడ్ బై రిషి...
Also Read: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!
నేను గుడ్ బై చెబితే వెళ్లిపోతున్నాను..మళ్లీ నీ జీవితంలోకి తొంగి చూడను అనుకుంటున్నావా..నాకు దక్కని నిన్ను ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను..సాక్షి అంటే ఏంటో నీకు తప్పకుండా చూపిస్తాను అనుకుంటుంది.. వసుధార కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో పరిగెత్తుకు వచ్చిన మహేంద్ర..నువ్వే గెలిచావ్.. లవ్ యూ రిషి..నీ మనసు గెలిచింది, నీ ప్రేమ గెలిచిందంటాడు.. నేను ప్రేమను ప్రేమించాను డాడ్..మనుషులు ఓడిపోవచ్చేమో ప్రేమ ఓడిపోదని వెళ్లిపోతాడు... మరోవైపు వదినా మంచి స్వీట్ కావాలని ధరణిని అడుగుతాడు గౌతమ్. ఈ అకేషన్ కోసం స్వీట్స్ ఉన్నాయికదా అంటుంది జగతి. ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని.. నిశ్చితార్థం తప్పిపోయిందని స్వీట్స్ చేయమంటున్నావా అని మండిపడుతుంది...
Also Read: తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ