![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedanta Manasu Serial Today May 11th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: స్టేషన్ కు వెళ్లి మనుతో గొడవపడ్డ వసు – ప్లేటు ఫిరాయించిన కానిస్టేబుల్
Guppedanta Manasu Today Episode: పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనుతో వసు గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
![Guppedanta Manasu Serial Today May 11th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: స్టేషన్ కు వెళ్లి మనుతో గొడవపడ్డ వసు – ప్లేటు ఫిరాయించిన కానిస్టేబుల్ Guppedanta Manasu serial today episode May 11th written update Guppedanta Manasu Serial Today May 11th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: స్టేషన్ కు వెళ్లి మనుతో గొడవపడ్డ వసు – ప్లేటు ఫిరాయించిన కానిస్టేబుల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/11/27fcbf5ce6d7d16de4f20cad91cb37d21715391971083879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedanta Manasu Serial Today Episode: శైలేంద్ర ముందు మను మంచివాడు కాదని ఇప్పుడే అర్థం అయిందని వసు, మహేంద్ర నాటకం ఆడతారు. యాభై కోట్లు అని అడ్డుపెట్టుకుని కాలేజీని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు అని వసుధార అంటుంది. మనునే ఎందుకు మోసం చేశాడని నిలదీస్తానని.. వినకపోతే ఈ నోటీసు చింపి ఆయన ముఖం మీద కొట్టి వస్తానని వసుధార మను దగ్గరకు వెళ్తుంది. మహేంద్ర ఏడుస్తున్నట్లు నటిస్తుంటే.. బాబాయ్ వాడు మోసగాడని నేను ముందు నుంచి చెప్తుంటే మీరే వినలేదు అంటాడు. మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వసుధార. మనును గట్టిగా నిలదీస్తుంది. మనుతో వసు మాట్లాడటాన్ని అక్కడి కానిస్టేబుల్ కాల్ చేసి శైలేంద్రకు వినిపిస్తుంటాడు.
వసు: అసలు అనుకోలేదు మీరు ఇలా చేస్తారని. నాకు మొదటి నుంచి అనుమానం ఉండేది. కానీ మా మామయ్య వాళ్లు చెప్పినందుకు నమ్మాను. పైగా మీరు మా అనుపమ మేడం కొడుకని తెలిసి ఊరుకున్నాను. కానీ మీరు ఇంత మోసం చేస్తారని నేను అసలు ఊహించలేదు.
మను: నాకు అప్పుడు అలా అనిపించింది అలా చేశాను. ఇప్పుడు ఇలా అనిపించింది ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా అప్పు ఇచ్చింది అది మీ సొంతం అయిపోదు. కావాలి అనుకున్నప్పుడు తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. నేనేదో చేయరాని తప్పు చేసినట్లు మాట్లాడతారేంటి?
వసు: మీరు చేయరాని తప్పే చేశారు. మీరు అందరిని నమ్మించి, నమ్మక ద్రోహం చేశారు.
మను: ఇందులో నమ్మక ద్రోహం ఏంటి నా డబ్బులు నేను అడుగుతున్నాను.
అంటూ.. శైలేంద్ర తమ మాటలు వింటున్నాడని తెలిసి కావాలని గొడవపడతుంటారు. తర్వాత కానిస్టేబుల్ బయటకు వెళ్లి శైలేంద్రతో మాట్లాడతాడు. ఇంకా ఏదైనా ఇన్మఫర్మేషన్ ఉన్నా నాకు చెప్తుండు అంటాడు శైలేంద్ర. సరే అని కానిస్టేబుల్ లోపలికి వెళ్లగానే వసుధార కానిస్టేబుల్‌ను పిలిచి శైలేంద్ర అంతా విన్నాడా? అని అడగ్గానే కానిస్టేబుల్ మొత్తం విన్నాడని చెప్పడంతో వసుధార, కానిస్టేబుల్‌కి థాంక్స్ చెప్తుంది. కానిస్టేబుల్ అదేం వద్దు మేడం మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని బటయకు వెళ్లిపోతాడు. మరోవైపు శైలేంద్ర, ఫణీంద్ర, దేవయాని భోజనం చేస్తుంటారు. శైలేంద్ర, మను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అన్నం ప్లేటులో కాకుండా టేబుల్ మీద వడ్డించుకుంటాడు. అది చూసిన ఫణీంద్ర కోపంగా శైలేంద్రను తిడుతూ నువ్వేదో తప్పు చేస్తున్నావని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావని నువ్వు తప్పు చేసినట్లు తెలిస్తే నీ తాట తీస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో వసు, మహేంద్ర అక్కడకు వస్తారు. వాళ్లను కూడా భోజనం చేయమని చెప్తాడు ఫణీంద్ర. అందరూ భోజనం చేస్తుంటే..
ఫణీంద్ర: ఏంటో మాట్లాడాలి అన్నావు కదా మహేంద్ర ఏంటది?
మహేంద్ర: ఏం లేదు అన్నయ్యా మీతో శైలేంద్ర చెప్పలేదా?
ఫణీంద్ర: నాకేం చెప్పలేదే..?
వసు: ఏంటి సార్ మీరు విషయం చెప్పలేదా?
శైలేంద్ర: వామ్మో వీళ్లు నన్ను డాడీ దగ్గర ఇరికించేలా ఉన్నారే? (అని మనసులో అనుకుంటూ) ఏ విషయం వసుధార.
ఫణీంద్ర: అరేయ్ అసలు నువ్వు ఏం చేశావురా..? ఏదో చేసే ఉంటావు. నువ్వలా టేబుల్ మీద భోజనం పెట్టుకున్నప్పుడే నేను అనుకున్నాను.
అంటూ ఫణీంద్ర కోపంగా శైలేంద్రను తిడుతుంటే.. వెదవ పని ఎం చేయలేదన్నయ్యా కానీ మనుతో గొడవపడ్డాడని.. మను పంపించిన నోటీసు గురించి చెప్పడంతో ఫణీంద్ర, దేవయాని షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)